Trivikram PanIndia: ”టాలీవుడ్ లో నాకు నచ్చిన ఇద్దరు దర్శకులు త్రివిక్రమ్, సుకుమార్” ..ఇదీ ఒకప్పుడు రాజమౌళి వదిలిన స్టేట్ మెంట్. అంటే ఇండస్ట్రీలో తనకు పోటీగా ,దీటుగా సినిమాలు తీసే సత్తా ఈ ఇద్దరికే ఉందని ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చాడన్నమాట. ఇక కాల క్రమంలో జక్కన్న బాహుబలి సిరీస్, RRR సినిమాలతో ప్యాన్ ఇండియా డైరెక్టర్ గా సత్తా చాటాడు. సుక్కు కూడా జక్కన్నపెట్టుకున్న నమ్మకం వమ్ము చేయకుండా వరుసగా పుష్ప, పుష్ప2 సినిమాలతో నేషనల్ వైడ్ గా ప్రూవ్ చేసుకోవడంతో త్రివిక్రమ్ వంతు ఎప్పుడొస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్.
అయితే గురూజీ మాత్రం దానికింకా టైమ్ ఉందిలే అనుకుంటూ దొరికిన హీరోతో లోకల్ గా సినిమాలు చేసుకుపోతున్నాడు.కానీ ఆ సినిమాలు ఒకటి ఆడితే మరొకటి బోల్తా పడ్డ పరిస్థితి. దీనితో ఇంత టాలెంట్ ఉన్నా ఇంకా బడా బడ్జెట్లతో,భారీ స్కేల్ లో సినిమాలు చేయాల్సింది పోయి ఇక్కడే తచ్చాడటం ఏంటోనని అనుకున్నారంతా.కానీ తాజాగా తారక్ తో సినిమా అంటూ వదిలిన ఆ పోస్టర్ ఒక్కసారిగా అందరి అనుమానాలని పటాపంచలు చేసేసింది.ఇదీ కదా గురూజీ నుండి మేము కోరుకున్నది అంటూ పోస్టర్ లో వదిలిన కంటెంట్ చూసి మురిసిపోయారు సినిమా ఫ్యాన్స్.సరైన సినిమా పడట్లేదు కాని పడితే త్రివిక్రమ్ అనే పేరు నేషనల్ వైడ్ గా ఎంతటి రీ సౌండ్ చేస్తుందో ఈ గాడ్ ఆఫ్ వార్ అనే సినిమా ప్రూవ్ చేస్తుందని డిబేట్లు పెట్టేస్తున్నారు నెటిజన్స్.
నిజానికి త్రివిక్రమ్ కి ఇదొకరకంగా కత్తి మీద సామనే చెప్పాలి.కారణం ఇప్పటి వరకు త్రివిక్రమ్ ఆడుతూ పాడుతూ మన ఆడియన్స్ ని నవ్వించే ఎంటర్ టైనర్స్ చేయడమే. లోకల్ గా పెన్ పవర్ తో తన స్టామినా ప్రూవ్ చేసుకున్న గురూజీ ప్యాన్ ఇండియా పల్స్ పట్టుకోగలడా అంటే ఆలోచించాల్సిందే. జక్కన్న, సుక్కులు కంటెంట్ తో ఇండస్ట్రీలో పాగా వేస్తె త్రివిక్రమ్ మాత్రం ప్రాసలు పంచులతో ఆడియన్స్ కి భాగా దగ్గరయ్యాడు.తెలుగు భాషలో ఉండే మ్యాజిక్ తో ఆకట్టుకున్నాడు కాని ఇదే మ్యాజిక్ నేషనల్ వైడ్ గా పని చేస్తుందా అంటే అనుమానమే.అంటే ఇప్పుడు తారక్ తో చేయబోయే సినిమాని మాటలతో కన్నా మెస్మరైజ్ చేసే విజువల్స్ తో, సాలిడ్ కంటెంట్ తో తెరకెక్కించాల్సిందే.
సో ప్యాన్ ఇండియా బాటలో మిగిలిన డైరెక్టర్స్ కి దీటుగా ప్రయాణం చేయాలంటే గురూజీకి అంత ఈజీ కాదన్నమాట.అయితే తారక్ చరిష్మా, నాగ వంశీ వారి ప్రొడక్షన్ వాల్యూస్ , ఎత్తుకున్న మైథాలజీ కథకి నేషనల్ వైడ్ గా యాక్సెప్టేన్సీ దొరికే చాన్స్ ఉండటం మూలానా సినిమా ఏ మాత్రం క్లిక్ అయినా త్రివిక్రమ్ పేరు జక్కన్న, సుక్కుల మాదిరిగా దేశమంతా రీసౌండ్ అవ్వడం ఖాయం.కావలసిందల్లా యతి,ప్రాసల్ని నమ్ముకోకుండా సాలిడ్ కంటెంట్ ని డెలివర్ చేయగలగడమే.
also read:టాలీవుడ్‌ను కుదిపేస్తోన్న ‘ఇళ్ల స్థలాల’ దందా.. నాకు సంబంధం లేదన్న టాలీవుడ్ డైరెక్టర్
చూడాలి మరి ఈసారి మిస్ అవ్వదు అంటూ ఎట్టకేలకి తారక్ తో సినిమా అనౌన్స్ చేసిన త్రివిక్రమ్ ప్యాన్ ఇండియా త్యాగ వేసుకుంటాడో లేదో. త్రివిక్రమ్ ప్రస్తుత సినిమాకి వస్తే వెంకీ మామ, శ్రీనిధి శెట్టి లీడ్ రోల్స్ లో వస్తున్న ఆదర్శకుటుంబం జోరుగా షూటింగ్ జరుపుకుంటుంది.ఇక ఇప్పటికే ఈ సినిమాని అక్టోబర్ 2న రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు కూడా.అంటే అక్టోబర్ తర్వాత గురూజీ పూర్తిగా గాడ్ ఆఫ్ వార్ మీదికి వెళ్ళిపోనున్నాడు అన్న మాట.