భారతీయ మహిళలు మానసికంగా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. కొంత మంది ఎన్ని కష్టాలు ఎదురైనా వెనుకడుగు వేయరు. కన్నీళ్లను అధిగమించి అనుకున్నది సాధిస్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మహిళ కథ కూడా అచ్చం ఇలాగే ఉంటుంది. ఆమె మరెవరో కాదు హిమి శర్మ. ఒకప్పుడు నెలకు రూ. 5 వేలు వచ్చే ఉద్యోగాన్ని మొదలు పెట్టిన ఆమె, ఇప్పుడు కెనడాలో రూ. 3 కోట్లు విలువ చేసే ఇంటిని కొనుగోలు చేసింది.
2005లో హిమి శర్మ MBA చదువుతున్నప్పుడు ఓ యుకుడితో పరిచయం ఏర్పడింది. ఒకరినొకరు ఇష్టపడ్డారు. ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కులాలు వేరు కావడంతో ఇంట్లో వాళ్లు పెళ్లికి ఒప్పుకోలేదు. కుటుంబ సభ్యులను కాదని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత మూడేళ్లు సంసార జీవితం అన్యోన్యంగా కొనసాగింది. ఆ తర్వాత భర్తతో సమస్యలు మొదలయ్యాయి. ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాడు. శర్మకు ఏది దిక్కు లేకుండా అయ్యింది. ఇటు కట్టుకున్న వాడు లేక, అటు పుట్టింటి వాళ్లు దూరమై పుట్టెడు శోకంలో ముగినిపోయింది. చేసేదేమీ లేక శర్మ తన రెండేళ్ల కొడుకును పోషించేందుకు ఓ స్కూల్ లో టీచర్ గా జాయిన్ అయ్యింది. నెలకు కేవలం రూ. 5 వేల జీతం వచ్చేది.
ఆమెకు ఉన్న సమస్యలకు, వచ్చే జీతానికి ఎక్కడా పొంతన లేదు. అద్దెకు గది తీసుకుని ఉండలేక, పేయింగ్ గెస్ట్ వసతి గృహంలోకి మారింది. అక్కడ అద్దె ఆమె జీతం కంటే ఎక్కువ. కొద్ది రోజుల్లోనే అప్పుల్లో కూరుకుపోయింది. కొడుకును పోషించేందుకు ఎంతో కష్టపడేది. ఆ తర్వాత బోర్డింగ్ స్కూల్ లో టీచర్ గా జాయిన్ అయ్యింది. రూ. 5 వేల సాలరీ కాస్త రూ. 30 వేలు అయ్యింది. కాస్త రిలాక్స్ అయ్యింది. డబ్బు ఆదా చేయడానికి, ఆమె తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లింది. అక్కడా ఆమెకు అవమానమే ఎదురయ్యింది. తన ఇంట్లో ఉండాలంటే, నెలకు రూ. 10 వేలు చెల్లించాలని తండ్రి కండీషన్ పెట్టాడు. తనను ఓ భారంగా చూశాడు. తప్పక తల వంచింది. కొడుకు స్కూల్ ఫీజు కట్టేందుకు తన నగలను తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ఆర్థికంగానే కాదు, సమాజపరంగానూ శర్మ ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నది. కుటుంబ వివాహాలు, ఇతర కార్యక్రమాలకు వెళ్లేది కాదు. ఒకవేళ వెళ్లినా సూటిపోటి మాటలతో వేధించే వాళ్లు. తప్పక తలదించుకుని వెళ్లేది. కష్టాల నుంచి బయటపడేందుకు సాయంత్రం 6 గంటల వరకు పని చేసేది. ఎక్ట్రా క్లాసులు చెప్పేది. ఆటోలు లేకపోతే చీకట్లో ఒంటరిగా నడుచుకుంటూ ఇంటికి వెళ్లేది.
సుమారు 10 సంవత్సరాల క్రితం, శర్మ తన జీవితాన్ని పూర్తి పునర్నిర్మించుకోవాలని నిర్ణయించుకుంది. కెనాడాలో టీచింగ్ ఫీల్డ్ లో ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలియడంతో, కెనడియన్ వీసా కోసం దరఖాస్తు చేసుకుంది. అప్పుడు తన దగ్గర రూ. 2 లక్షల కంటే తక్కువ డబ్బులు ఉన్నాయి. అయినా, తన తలరాత మార్చుకునేందుకు 2019లో కెనడాకు వెళ్లింది. ఒక నెలలోనే, ఆమెకు కాలేజీ ప్రొఫెసర్‌గా ఉద్యోగం లభించింది. కొత్త దేశంలో ఆమె తన జీవితాన్ని క్రమంగా చక్కదిద్దుకోవడం మొదలు పెట్టుకుంది. ఇప్పుడు ఆమె తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. తన కాళ్ల మీద తను నిలబడింది. కాలేజీ ప్రొఫెసర్ గా రాణిస్తోంది.
రీసెంట్ గా ఆమె కెనడాలో రూ. 3 కోట్ల విలువ చేసే ఇళ్లును కొనుగోలు చేసింది. తన కొడుకును చక్కగా పెంచుకుంటుంది. కష్టాల కడలి నుంచి ఆమె తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఆత్మవిశ్వాసంతో పని చేస్తే ఏదైనా సాధ్యమే అని నిరూపించింది హిమి శర్మ.
Read Also: 9 ఏళ్ల చెల్లికి కడుపు చేసిన 11 ఏళ్ల అన్న.. ఆమె చేతిలో బిడ్డ ఎవరు? నిజం ఏంటీ?