China Woman Indian Food| భారతదేశ పర్యటనలో ఉన్న ఒక చైనా యువతి.. ఇండియాలో ఆహారం అపరిశుభ్రంగా ఉంటుందిన చెబుతూ కొన్ని యూట్యూబ్ వీడియోలు చూపెట్టింది. అయితే ఆమెకు ఒక ఇండియన్ యూట్యూబర్ సరైన సమాధానమిచ్చాడు. ఇదంతా ఒక వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడా వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజెన్లు ఆ యూట్యూబర్ చేసిన పనిని మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. ప్యాసెంజర్ పరవ్ వీర్ అనే పేరుతో యూట్యూబ్ లో చానెల్ నడుపుతున్న యువకుడు ఇటీవల తన చానెల్ కోసం వీడియో తీస్తూ.. ఒక చైనా యువతిని కలిశాడు. ఆమె ప్రస్తుతం భారత దేశ పర్యటనలో ఉంది. అయితే.. ఆమె అతనితో ఇండియన్ ఫుడ్ చాలా డర్టీ అని చెప్పింది. ఇండియాలో లభించే స్ట్రీట్ ఫుడ్ పరిశుభ్రంగా ఉండదని చెబుతూ.. అతనికి కొన్ని యూట్యూబ్ వీడియోలు చూపించింది.
Also Read: పండుగ రోజు విషాదం.. ఇడ్లీ తిని వ్యక్తి మృతి.. అత్యాశకు పోయి ఎన్ని తిన్నాడంటే?..
అయితే యూట్యూబర్ పరమ్ వీర్ ఆ వీడియోలు చూసి.. ఇండియా చాలా పెద్ద దేశమని.. అన్ని చోట్ల అలాజరదని చెప్పి.. తనతో వస్తే.. మంచి స్ట్రీట్ ఫుడ్ తినిపిస్తానని ఆమెకు ఆహ్వానిస్తాడు. దీంతో అతని వెంట వెళ్లిన ఆ చైనా యువతికి షాహి పనీర్, దాల్ మఖని, బట్టర్ నాన్ తినిపించాడు. ఆ వెజిటేరియన్ వంటల రుచి ఆస్వాదిస్తున్న సమయంలో యూట్యూబర్ పరమ్ వీర్ ఆమెకు ఫుడ్ ఎలా ఉందో ఇప్పుడు చెప్పమన్నాడు.
దానికి ఆ చైనా యువతి యమ్మీ అని సమాధానం చెప్పింది. ఇండియన్ ఫుడ్ గురించి తన అభిప్రాయం ఆమె మార్చుకుంటున్నట్లు తెలిపింది. ఈ వీడియో చూసిన వారంతా యూట్యూబర్ పరమ్‌వీర్ సమయస్ఫూర్తిని మెచ్చుకుంటున్నారు. చాలా మంది అతడిని పొగుడుతూ కామెంట్లు చేస్తున్నారు.
ఒక నెటిజెన్ అయితే.. “ఒక చైనా అమ్మాయి ఇండియన్ ఫుడ్‌ని అవమానించింది. అయినా ఇండియన్ కుర్రాడు చాలా జెంటిల్ మెన్ గా ఆమెతో బిహేవ్ చేశాడు. ఆమెకు మంచి ఇండియన్ ఫుడ్ తినిపించి ఇండియా సంప్రదాయం తెలియజేశాడ. ఇతనికి హాట్సాఫ్” అని కామెంట్ చేశాడు.
మరొకరైతే దేశాల మధ్య యుద్ధాలు వచ్చినప్పుడు కూడా ఇలాగే చక్కగా మాట్లాడుకుంటే సమస్యను పరిష్కారం చేయవచ్చు అని కామెంట్ లో రాశాడు.
ఇంకొక యూజర్ అయితే.. “ఆమె ఇండియన్ ఫుడ్ ని అవమానించి ఫ్రీగా భోజనం చేసింది. కానీ మనోడు మాత్రం చైనా గబ్బిలా సూప్, పురుగులు, కుక్కల వంటకాల గురించి మాట్లాడే ధైర్యం చేయలేదు” అని విమర్శిస్తూ కామెంట్ పెట్టాడు.
కానీ ఒక నెటిజెన్ ఈ వీడియో గురించి పూర్తి విషయం చెప్పాడు. “ఈ వీడియోలో ముందుగా ఇండియన్ యూట్యూబర్ చైనా ఫుడ్ బాగోదని చెప్పాడు. అందుకే ఆమె యూట్యూబ్ ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ వీడియోలు చూపించి.. ఎంత అపరిశుభ్రంగా ఉంటాయో చూపింది. అయితే వీడియో సగం నుంచి చూపించారు. కాబట్టే అందరూ ఆమెను తప్పుబడుతున్నారు. “అని కామెంట్ చేశారు.