Pooja Hegde: గ్లామర్ ఇండస్ట్రీలో హీరోల మధ్య ఎంత పోటీ ఉంటుందో.. హీరోయిన్స్ మధ్య అంతకంటే ఎక్కువే పోటీ ఉంటుంది. ఒకరి చేతికి వచ్చిన అవకాశాన్ని వెంటనే అందిపుచ్చుకోకపోతే మరొక హీరోయిన్ ఆ స్థానంలోకి వచ్చేస్తుంది. ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే నటీమణులకు డిమాండ్ ఉంటుంది. ఆ డిమాండ్‌ను వారు ఉపయోగించుకునే దాన్నిబట్టి ఆఫర్లు కూడా పెరుగుతుంటాయి. గతేడాది టాలీవుడ్‌లో శ్రీలీల (Sreeleela) హవా నడిచింది. ఇంతలోనే తన డిమాండ్ ఒక్కసారిగా తగ్గిపోయింది. ఇప్పుడు పూజా హెగ్డే (Pooja Hegde)కు శ్రీలీలపై రివెంజ్ తీర్చుకునే సమయం వచ్చేసిందని అర్థమవుతోంది.
ఒకరి తర్వాత ఒకరు
శ్రీలీల రాకముందు టాలీవుడ్‌లో కృతి శెట్టి హవా నడిచింది. ఏకంగా అరడజను సినిమాల్లో ఒకేసారి కనిపించి అందరినీ అలరించింది. కానీ శ్రీలీల రావడం వల్ల కృతి స్పీడ్‌కు బ్రేకులు పడ్డాయి. అలాగే కృతి శెట్టి కంటే ముందు పూజా హెగ్డే టాలీవుడ్‌ను ఏలేసింది. స్టార్ డైరెక్టర్లు, సీనియర్ హీరోలు.. ఇలా చాలామందితో పనిచేసి తానే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇప్పుడు అసలు పూజాను పట్టించుకునే వారే లేరు. తను హీరోయిన్‌గా తెలుగుతెరపై కనిపించే రెండేళ్లు అయిపోయింది. దాని తర్వాత హిందీ సినిమాల్లో అవకాశాలు రావడంతో అక్కడే సెటిల్ అయ్యింది. ఇప్పుడు శ్రీలీలకు వచ్చిన బాలీవుడ్ అవకాశాన్ని తను దక్కించుకొని పర్ఫెక్ట్‌గా రివెంజ్ తీర్చుకుంటోంది.
Also Read: రేణు దేశాయ్ కోరికను తీర్చిన ఉపాసన.. ఎంత గొప్ప మనస్సో..
అప్పుడలా.. ఇప్పుడిలా..
అసలైతే 2024లో విడుదలయిన ‘గుంటూరు కారం’ సినిమాలో పూజా హెగ్డేనే హీరోయిన్‌గా నటించాల్సింది. అందులో శ్రీలీల సెకండ్ హీరోయిన్‌గా కూడా ఎంపికయ్యింది. కొన్నిరోజుల పాటు షూటింగ్ పూర్తిచేసిన తర్వాత పూజా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. దీంతో వెంటనే ఇందులో శ్రీలీల మెయిన్ హీరోయిన్ అయిపోయింది. అలా అప్పట్లో పూజా చేతిలో ఉన్న ఆఫర్‌ను శ్రీలీల దక్కించుకుంది. ఇప్పుడు శ్రీలీలకు వచ్చిన బాలీవుడ్ డెబ్యూ ఆఫర్‌ను పూజా హెగ్గే ఖబ్జా చేసుకుంది. టాలీవుడ్‌లో తన టాలెంట్ చూపించిన శ్రీలీల.. ఇప్పుడు బాలీవుడ్‌లో ఎంట్రీకి సిద్ధమయ్యింది. కానీ ఇప్పుడు అనుకోకుండా ఈ అవకాశం పూజాకు వెళ్లినట్టు తెలుస్తోంది.
అదే స్థానంలోకి
శ్రీలీల చేతిలో ప్రస్తుతం చాలానే సినిమాలు ఉన్నాయి. ఇదే సమయంలో వరుణ్ ధావన్ (Varun Dhawan) హీరోగా నటించే సినిమాలో హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. ముందుగా ఈ ప్రాజెక్ట్ తను ఓకే చేసినా డేట్స్ విషయంలో క్లారిటీ లేకపోవడంతో దీని నుండి తప్పుకుంది. డేవిడ్ ధావన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో శ్రీలీలతో పాటు మృణాల్ ఠాకూర్ హీరోయిన్స్‌గా నటించాల్సి ఉంది. కానీ శ్రీలీల తప్పుకోవడంతో ఇప్పుడు ఆ స్థానంలోకి పూజా హెగ్డే వచ్చి చేరినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో తాను నటించడంపై పూజా స్పందించింది. అధికారికంగా ప్రకటించలేదు కానీ ప్రస్తుతం తన చేతిలో పలు ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయని బయటపెట్టింది. వరుణ్ ధావన్, పూజా హెగ్డే కాంబినేషన్‌లో తెరకెక్కే మూవీకి ‘హై జవానీతో హైతో ఇష్క్ హోనా హై’ అనే టైటిల్‌ను ఖరారు చేయనున్నట్టు సమాచారం.