Viral Video: ఎక్కడికైనా వెళ్తే జాగ్రత్తగా మాట్లాడాలి. తేడా వేస్తే ఇరుక్కోవడం తప్పదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్-టర్కీ మధ్య సంబంధాలు దూరం కాస్త పెరిగింది. ఈ క్రమంలో ఓ భారతీయ యట్యూబర్.. టర్కీ మహిళపై నోరు జారి అడ్డంగా ఇరుక్కు పోయాడు. ప్రస్తుతం అతడ్ని అరెస్టు చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
పెద్దలు ఒక సామెత చెబుతారు. దెబ్బ కొడితే వెనక్కి తీసుకోవచ్చు గానీ, మాట జారితే వెనక్కి తీసుకోలేమని అంటున్నారు. సరిగ్గా ఈ సామెత భారతీయ యూట్యూబర్ మాలిక్ స్వాష్‌బక్లర్‌కు అతికినట్టు సరిపోతుంది. టర్కీ మహిళ విషయంలో నోరు జారాడు. అందుకు సంబంధించి వీడియో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఆయన్ని టర్కీ పోలీసులు అరెస్టు చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-టర్కీ మధ్య సంబంధాలు కాస్త దెబ్బతిన్నాయి. ఈ విషయంలో దాయాది దేశం పాకిస్తాన్‌కు టర్కీ తనవంతు సాయం చేయడంతో మోదీ సర్కార్ అగ్గి మీద గుగ్గిలం అయ్యింది. ఈ క్రమంలో టర్కీ ఉత్పత్తులను భారత్‌లో బ్యాన్ చేశారు. ఆన్‌లైన్, ఆఫ్ లైన్ లో టర్కీ వస్తువులను భారతీయులు నిషేధించిన విషయం తెల్సిందే.
తాజాగా భారత్‌కి చెందిన ఓ యూట్యూబర్ మాలిక్ స్వాష్‌బక్లర్ టర్కీ వెళ్లాడు. టర్కీ గురించి చెప్పనక్కర్లేదు. అక్కడకు అన్నిదేశాల టూరిస్టులు వస్తుంటారు. ఇదే క్రమంలో షాపింగ్‌కు వచ్చిన ఓ టర్కీ మహిళపై అనుచిత వ్యాఖ్యలు హిందీలో చేశాడు. హిందీలో చేసిన కామెంట్స్ మొదట స్థానికుల దృష్టిని ఆకట్టుకోలేదు.
ALSO READ: భయ్యా పుల్ బిజీ.. మెట్రోలోనే రెడీ అయిపోతున్నాడు
ఆ తర్వాత టర్కిష్ సోషల్ మీడియా వినియోగదారులు ఆ వీడియో, చుట్టూ ఫ్లాగ్ చూసిన తర్వాత అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఆ తర్వాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. యూట్యూబర్ ఒక మహిళతో మార్కెట్‌లో తిరుగుతున్నట్లు కనిపించింది. ఆ తర్వాత ఓ షాపులో త్రివర్ణ పతాకం ఉందా అని అడిగిన తర్వాత స్థానిక దుకాణదారుడు దుర్భాషలాడడం అందులో బయటపడింది.
దీంతో కొందరు యువకులు టర్కీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే ఆ యూట్యూబర్ మాలిక్‌ను అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. భారతీయుడి అరెస్టుపై టర్కీ భారత రాయబార కార్యాలయం ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
టర్కిష్ మహిళలకు తన భాష అర్థం కాదని భావించి హిందీలో తిడుతూ పట్టుబడ్డాడు. మొత్తానికి భారతీయ యూట్యూబర్ మాత్రం ఇబ్బందుల్లో పడ్డాడనే చెప్పవచ్చు. మనకు తెలియని ప్రాంతానికి వెళ్తే జాగ్రత్తగా ఉండాలని చెప్పేది అందుకే. తేడా వేస్తే మాలిక్ లాంటి పరిణామాలు తప్పదు మరి.
Turkish cops have nicked an Indian tourist after he posted offensive videos about Turkey on his YouTube channel, Malik Swashbuckler. He was caught slagging off Turkish women in Hindi, thinking they wouldn’t understand. The videos kicked off a storm online, which got him arrested. pic.twitter.com/jejqwIOi8L
— Julia Kendrick (@JuKrick) May 31, 2025