Viral Video: సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు క్రియేటర్స్ కొత్తగా ఆలోచిస్తున్నారు. రొటీన్ కు భిన్నంగా వీడియోలను షూట్ చేసి నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. ఆయా వీడియోలు క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి. తాజాగా ఢిల్లీకి చెందిన ఓ కంటెంట్ క్రియేటర్ ఏకంగా మెట్రోలోనే సింపుల్ గా మేకప్ చేసుకుంటూ రెడీ అయ్యే వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు. ఈ వీడియోలు క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి. అతడు మేకప్ చేసుకునే విధానానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
సింఫుల్ గా మేకప్ వేసుకుంటూ..
ర్యాన్ అనే క్రియేటర్ రీసెంట్ గా ఇన్ స్ట్రాగ్రామ్ లో బాగా పాపులర్ అవుతున్నాడు. బ్లష్, లిప్ బామ్, హెయిర్ జెల్ సింపుల్ గా ఉపయోగిస్తూ మేకప్ చేసుకుంటున్నాడు. పెద్దగా కష్టపడకుండానే లేకుండానే మేకప్ చేసుకునే విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. ఆయన షేర్ చేసే వీడియోలు మిలియన్ల కొద్ది వ్యూస్ సాధిస్తున్నాయి. ‘గెట్ రెడీ విత్ మీ’ పేరుతో ఈ వీడియోలను షేర్ చేస్తున్నాడు. రొటీన్ సబ్ వే రైడ్ కంటే వోగ్ బ్యూటీ సీక్రెట్స్ ఎపిసోడ్ లా కనిపిస్తుంది.
ర్యాన్ ఏం చేస్తున్నాడంటే?
ర్యాన్ మెట్రో ఎక్కిన కాసేపటికి తన బుగ్గల మీద, ఆ తర్వాత ముఖం మీద బ్లష్ ను పూయడం మొదలు పెడతాడు. ఆ తర్వాత లేత రంగు లిప్ బామ్‌ను పూయడం, లైట్ హెయిర్ జెల్ తో ఈజీగా, ఫాస్ట్ గా స్టైల్-అప్ చేయడం జరుగుతుంది. మెట్రోలనే కాదు, ఆటో రిక్షాలోనూ ఆఫీస్ కు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియోలను అబ్బాయిలతో పాటు అమ్మాయిలు ఎంతో ఇష్టపడుతున్నారు.
నెటిజన్లు ఏం అంటున్నారంటే?
నెటిజన్లు ఈ వీడియోలను చూసి క్రేజీగా ఫీలవుతున్నారు. “బ్రో నీ స్కిన్ భలే మెరుస్తోంది” అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోలను సాహిరా తనేజా, దిపా బుల్లర్-ఖోస్లా లాంటి పాపులర్ బ్యూటీషియన్స్ లవ్ ఏమోజీస్ పెట్టారు. అంతేకాదు, ఈ వీడియోలకు తమ ప్రశంసలను అందించారు. “ది డ్యూడ్ ఇన్ పింక్ వాంట్స్ ఇన్ ఆన్ ది గ్లో” అని అభినందించారు.
Read Also: వారం రోజులు మెట్రో ఫ్రీ రైడ్.. ఇది కదా ఆఫర్ అంటే!
మేకప్ ఆడవారికే కాదు!
నిజానికి మేకప్ అనగానే అదేదో అమ్మాయిలకు సంబంధించి విషయంగా భావిస్తారు. కానీ, అబ్బాయిలు కూడా చక్కగా మేకప్ చేసుకోవచ్చని ర్యాన్ చూపించాడు. ‘గెట్ రెడీ విత్ మీ’ అనే ఈ పద్దతి అబ్బాయిలు కూడా ఎక్కడైనా మేకప్ కావచ్చని విధానాన్ని చూపిస్తోంది. ఎక్కడ ఉన్నామనేది ముఖ్యం కాదు, మేకప్ చేసుకున్నామా? లేదా? అనేది ముఖ్యం అని అనే ప్రచారాన్ని మొదలు పెట్టాడు. ఎక్కడ ఉన్నా, అది పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అయినా కూడా మేకప్ చేసుకోవచ్చనే సందేశాన్ని ఇస్తున్నాడు. ప్రస్తుతం ర్యాన్ వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Read Also: రైల్లో పొట్టు పొట్టుగా కొట్టుకున్న మహిళలు, బాబోయ్ మరీ ఇలానా?