BigTV English

Ravi Teja: మాసోడి కొత్త సినిమాకు క్లాస్ టైటిల్.. వర్కౌట్ అవుతుందా..?

Ravi Teja: మాసోడి కొత్త సినిమాకు క్లాస్ టైటిల్.. వర్కౌట్ అవుతుందా..?

Ravi Teja: టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజ రవితేజ ఖాతాలో ఈ మధ్య ఒక్క హిట్ సినిమా కూడా పడలేదు. హిట్లు, ఫ్లాపులు పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ధమాకా తర్వాత సరైన విజయం రాకపోయినా, మళ్ళీ ఓ మాస్ హిట్ కొట్టాలనే ఆశతో వరుసగా సినిమాలను అనౌన్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ తన 75 వ సినిమా ‘మాస్ జాతర’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత మరో చిత్రాన్ని తన లైనప్ లో పెట్టుకున్నాడు. ఆ టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు ఓ వార్త వినిపిస్తుంది. ఆ మూవీ డీటెయిల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


‘మాస్ జాతర ‘ షూటింగ్ అప్డేట్..

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పూర్తి స్థాయి మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. షూటింగ్ దశ చివరిలో ఉంది. మేకర్స్ ఈ చిత్రాన్ని ఆగస్టు 27న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. టైటిల్ మాస్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతుందని రవి తేజా ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. మాస్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేశాయి.. ఈ మూవీ పై హిట్ అవుతుందని రవితేజా కూడా ధీమాగా ఉన్నాడు.


Also Read : ‘కన్నప్ప’ హార్డ్ డిస్క్ చోరీ, మంచు మనోజ్ ఏమన్నారంటే..?

నెక్స్ట్ సినిమా టైటిల్ ఫిక్స్..? 

మాస్ జాతర ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు కానీ.. మరో సినిమాను రవితేజ లైనప్ లో పెట్టుకున్నాడు. రవితేజ తన నెక్స్ట్ చిత్రాన్ని దర్శకుడు కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాను జూన్ నెలలో అఫీషియల్‌గా లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ విషయంలో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. ఈ మూవీకి ‘అనార్కలి’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట.. వెరైటీ టైటిల్‌తో రవితేజ తన నెక్స్ట్ మూవీపై ఇప్పటినుంచే అంచనాలు క్రియేట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో అందాల భామ కేతిక శర్మ కథానాయికగా నటిస్తుండగా.. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి పూర్తి డీటెయిల్స్ ని అనౌన్స్ చేసే అవకాశం ఉంది.

రవితేజ ఖాతాలో ధమాకా తర్వాత బ్లాక్ బాస్టర్ చిత్రం పడలేదు. భారీ యాక్షన్ తో పాటుగా బడ్జెట్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ హిట్ సినిమాలు లేవు.. ఇప్పుడు కథల విషయంలో జాగ్రత్తలు తీసుకున్న రవితేజ కొత్త సినిమాల పై నమ్మకంగా ఉన్నాడు.. చూడాలి ఈ సినిమాలు ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×