Indore Man: ఇండోర్‌కు చెందిన ఓ వ్యక్తి తన హెల్మెట్‌పై సీసీటీవీ కెమెరాను అమర్చుకున్నాడు. హెల్మెంట్‌కి సీసీటీవీ కెమెరా అమర్చాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఎవరి నుంచైనా ప్రాణహాని ఉందా? ఇవే ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. ఆ వీడియో నెట్టింట్లో హంగామా చేస్తోంది.
ఇండోర్ సిటీలోని గౌరీ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు సతీష్ చౌహాన్. ఇరుగు పొరుగువారితో ఆయనకు చిన్న తగాదా మొదలైంది. అది చివరకు గాలివానగా మారింది. ఆ తర్వాత ఇరుగుపొరుగు వారి నుంచి బెదిరింపులు మొదలయ్యాయి. తనతోపాటు ఫ్యామిలీని చంపేస్తారని భయపడ్డాడు. తనను తాను రక్షించుకోవడానికి ఏకంగా హెల్మెంట్‌కు సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేసుకున్నాడు.
ద్విచక్ర వాహనంపై ఆయన వెళ్లినప్పుడు అది చూపరులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించి ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌మీడియోలో అప్‌లోడ్ చేశారు. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీనివెనుక అసలు కారణం చెప్పాడు.
సతీష్ చౌహాన్‌కు పొరుగునున్న బలిరామ్ చౌహాన్- మున్నా చౌహాన్ లతో చాలా కాలంగా ఆస్తి వివాదం నెలకొంది. వారిద్దరి సతీష్ ఆస్తి కాజేయాలని ప్లాన్ చేస్తున్నారు. వివాదం కారణంగా ప్రతిరోజూ తగాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భయపడిన సతీష్, ఇంటికి చుట్టూ సీసీటీవీ కెమెరాలను అమర్శించాడు.
ALSO READ: ప్రియుడితో భార్య పరార్.. ఆనందంలో భర్త, ఆపై పాలతో స్నానం
ఆ కెమెరాలు సమీప ఇళ్లలో బాత్రూంలో స్నానం చేస్తున్నవారిని చిత్రీకరిస్తున్నట్లు పొరుగువారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బయటకు వెళ్లినప్పుడు తన ప్రాణానికి ముప్పుగా ఉందని భావించిన సతీష్, టూ వీలర్స్‌పై వెళ్లినప్పుడు ఆ హెల్మెంట్‌ని ధరిస్తున్నాడు. ఒకవేళ తనపై ప్రత్యర్థులు దాడి చేసినా సీసీటీవీ కెమెరాలో అంతా రికార్డు అవుతుందని, దాని ద్వారా వారు పోలీసులకు చిక్కుతారని అంటున్నారు.
అది ఎల్లప్పుడూ రికార్డు అవుతుందని, తనకు ఏదైనా జరగరానిది జరిగితే, ఆ ఫుటేజ్ సాక్ష్యంగా ఉపయోగపడుతుందని అన్నాడు సతీష్. నిరంతర వారి నుంచి వేధింపులను ఎదుర్కొంటున్నానని, రక్షించుకోవడానికి తప్పడం లేదన్నాడు.
దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని, ఏ మాత్రం పట్టించుకోలేదని అంటున్నారు. పోలీసుల వెర్షన్ మరోలా ఉంది. కేసును సమీక్షిస్తున్నామని, కొత్త వాస్తవాలు బయటపడితే తదుపరి చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. మొత్తానికి సతీష్ చౌహాన్ భయం ఏమోగానీ, హెల్మెంట్‌కు సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయడంపై నెట్టింట్లో నెటిజన్స్ తలోవిధంగా చర్చించుకుంటున్నారు.
पहली नज़र में ये तस्वीर हंसा सकती है, फिर सुनिये इंदौर में ये शख्स दरअसल व्यवस्था से मजबूर होकर हेलमेट में सीसीटीवी लगाकर घूमते हैं pic.twitter.com/OfNJMCiwfv
— Anurag Dwary (@Anurag_Dwary) July 13, 2025