BigTV English

Kota Srinivas Rao: తెలుగు కాకుండా కోటా నటించిన ఇతర భాషా చిత్రాలివే!

Kota Srinivas Rao: తెలుగు కాకుండా కోటా నటించిన ఇతర భాషా చిత్రాలివే!

Kota Srinivas Rao:కోట శ్రీనివాసరావు(Kota Srinivasa Rao) ఈరోజు తెల్లవారుజామున వృద్ధాప్యంలో వచ్చే అనారోగ సమస్యల కారణంగా కన్నుమూసిన సంగతి మనకు తెలిసిందే. కోట శ్రీనివాసరావు మరణవార్త విని ఎంతోమంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇప్పటికే రాజకీయ నాయకులు,సినీ ప్రముఖులు ఎంతోమంది ఈయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఈయనతో సినిమాలు చేసిన చిరంజీవి(Chiranjeevi), మోహన్ బాబు (Mohan Babu), బాబు మోహన్ (Babu Mohan), మంచు విష్ణు(Manchu Vishnu) ,పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వంటి ఎంతోమంది సెలబ్రిటీలు నివాళులు అర్పించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దిగ్గజ నటుల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్న కోట మరణం ఎంతో మందిని కలిచివేసింది. అయితే అలాంటి దిగ్గజ నటుడి గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.


సినిమాలు అంటేనే ఇష్టం లేని కోట.. 750కి పైగా చిత్రాలలో..

కోట శ్రీనివాసరావు హీరో హీరోయిన్లకు తండ్రి, మామ, బాబాయ్, తాత పాత్రలు పోషించడమే కాకుండా కమెడియన్ గా.. విలన్ గా.. ఇలా ఎన్నో పాత్రలు పోషించారు. ముఖ్యంగా బాబు మోహన్(Babu Mohan),కోట శ్రీనివాసరావు కాంబోలో వచ్చే కామెడీ అంటే చాలామందికి ఇష్టం. వీరిద్దరి కామెడీ ని చూసి కడుపుబ్బా నవ్వని ప్రేక్షకులు అంటూ ఉండరు.అలా సినిమాలు అంటేనే ఇష్టం లేని కోట శ్రీనివాసరావు.. చిరంజీవి నటించిన ప్రాణం ఖరీదు (pranam Kharidu) మూవీతో టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలోకి నటుడిగా ఎంట్రీ ఇచ్చి దాదాపు 750 కి పైగా సినిమాల్లో నటించారు.


కోటా నటించిన ఇతర భాషా సినిమాలు..

అయితే కోటా శ్రీనివాసరావుని అందరూ కేవలం టాలీవుడ్ లోనే నటించారని అనుకుంటారు. ఈయన కేవలం టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్,కోలీవుడ్ ఇండస్ట్రీలలో కూడా నటించారు.మరి ఇంతకీ కోట శ్రీనివాసరావు నటించిన ఇతర భాషా సినిమాలేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

కోటా నటించిన హిందీ చిత్రాలు..

కోట శ్రీనివాసరావు కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ, మలయాళ, హిందీ, తమిళ్ భాషల్లో కూడా రాణించారు. అలా ఈయన హిందీలో ‘ఖేల్ ఖిలాడి కా’, ‘ముసాఫిర్’, ‘అగ్లీ ఔర్ బేకార్’, ‘ఘర్షణ’, ‘రక్త చరిత్ర’, ‘సత్య ది సర్కార్’ వంటి సినిమాల్లో నటించారు.. ఇక ఇందులో ఖేల్ ఖిలాడి కా అనే సినిమా తెలుగులో వచ్చిన సూపర్ పోలీస్ (Super Police) అనే సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. అలాగే సత్య ది సర్కార్ మూవీ తెలుగులో రాంగోపాల్ వర్మ డైరెక్షన్లో వచ్చిన గాయం (Gaayam) మూవీకి రీమేక్ గా తెరకెక్కింది.. అంతేకాదు రాంగోపాల్ వర్మ(Ram Gopal Varma) దర్శకత్వంలో వచ్చిన మరో మూవీ రక్త చరిత్ర (Rakta Charitra).ఈ సినిమా తెలుగు,హిందీ భాషల్లో విడుదలైంది.

30కి పైగా తమిళ్ చిత్రాలలో నటించిన కోటా..

ఇక హిందీ సినిమాలతో పాటు తమిళ సినిమాల్లో కూడా రాణించారు. అలా కోట శ్రీనివాసరావు దాదాపు 30 తమిళ సినిమాల్లో నటించారు.అందులో ప్రముఖంగా.. కథై తిరక్కథై వాసనం ఇయక్కం, కాశీ రాజన్, అరియన్, పువెల్లం కెట్టుపర్, అన్బోడు, కొలైగరన్ వంటి సినిమాలు ఉన్నాయి.

కన్నడ, మలయాళం సినిమాలలో కూడా..

కోటా శ్రీనివాసరావు కన్నడ చిత్ర పరిశ్రమలోకి 1997లో లేడీ కమిషనర్(Lady Commissioner) సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. చివరిగా కబ్జా అనే మూవీలో నటించారు. అలాగే మలయాళ సినిమాల్లో కూడా కోట శ్రీనివాసరావు రాణించారు.

నటనా వచ్చినా అవకాశం ఇవ్వలేదంటూ అసహనం..

అంతేకాకుండా కోట శ్రీనివాసరావు నటించిన చాలా సినిమాలు హిందీ, తమిళ భాషల్లో డబ్ అయ్యాయి.. అలా విభిన్న భాషల్లో విలక్షణ పాత్రలు పోషించిన కోటా శ్రీనివాసరావు ఓ ఇంటర్వ్యూలో ఇతర ఇండస్ట్రీలో నటుల గురించి మాట్లాడుతూ.. నాకు నటన వచ్చు అని చెప్పినా కూడా నన్ను ఎవరూ పట్టించుకోరు. కానీ ముంబై(Mumbai) నుండి వచ్చిన వారికి ఇట్టే అవకాశాలు ఇచ్చేస్తారు.. వాళ్లకు నటన వచ్చా లేదా అని చూడకుండానే కోట్లకు కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చి తీసుకుంటారు. కానీ నటన వచ్చిన నన్ను మాత్రం పక్కన పెడతారు అంటూ అసహనం వ్యక్తం చేశారు.

ALSO READ:HHVM Pre Release Event: మారిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక.. ఎక్కడంటే?

Related News

Bollywood: బాలీవుడ్ లో దిగ్బ్రాంతి, ఆ ప్రముఖ నటుడు దూరమయ్యారు

Ar Muragadoss: ఇంక రిటైర్మెంట్ ఇచ్చేయండి బాసు, పెద్ద డైరెక్టర్లు వరుస ఫెయిల్యూర్స్

Nag Ashwin: ప్రధానికి నాగ్ అశ్విన్ కీలక రిక్వెస్ట్.. కొత్త జీఎస్టీ‌లో ఆ మార్పు చెయ్యాలంటూ…

Siima 2025 Allu Arjun: సైమా ఈవెంట్లో అల్లు అర్జున్, లుక్ అదిరింది భాయ్

17 Years of Nani : మామూలు జర్నీ కాదు, ఈ తరానికి నువ్వే బాసు

Sujeeth: సుజీత్ కరుడుగట్టిన కళ్యాణ్ అభిమాని.. ఏం చేశాడంటే?

Big Stories

×