BigTV English

BEER: బీరును వడపోసుకుని తాగుతున్న మందుబాబులు.. ఆరోగ్యాభిలాషకులు అంటే వీళ్లే!

BEER: బీరును వడపోసుకుని తాగుతున్న మందుబాబులు.. ఆరోగ్యాభిలాషకులు అంటే వీళ్లే!

BEER: మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం. దీన్ని సేవించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నమాట. వీటికి సంబంధించి భారీ హోర్డింగ్‌లు, ప్రకటనలు ఇస్తుంటారు. కానీ మద్యం ప్రియులు దీనివైపు చూడకుండా ఉండలేరు. కొందరైతే తాము ఏమి తాగుతున్నామనే తేడా లేకుండా అందుబాటులో ఉన్న బ్రాండ్‌లను మిక్స్ చేసి కొట్టేస్తారు. ఇంకొందరు బీర్‌లో విస్కీ, వైన్ కలుపుకొని సేవిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. తాజాగా బీరును వడపోసుకుని తాగుతున్నారు మందుబాబులు.


పుర్రెకో బుద్ది అన్నట్లుగా.. ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఆలోచన చేస్తున్నారు మందుబాబులు. ఆ సమయంలో వారి ఆలోచనకు ఏమి వస్తే అది చేస్తుంటారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామంలో కొందరు యువకులు చేస్తున్న పనులు చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు.

బీరు సీసా ఓపెన్ చేసి అందులో ఈత కొమ్మ నార చేసి పెట్టుకొని గ్లాస్ లలో పోసుకొని సేవిస్తున్నారు. ఇదొక ఎంజాయ్ అన్నమాట. ఇలా చేస్తే ఏం జరుగుతుందని అడిగితే కొత్త విషయాలు చెప్పారు. రోజుల తరబడి సాసీలో మందు ఉండడం వల్ల నాచు, చెత్త చెదారం వస్తుందని అంటున్నారు. సేవించాలని కంగారులో మద్యం బాటిల్ ఓపెన్ చేసి తాగితే అవన్నీ కడుపులోకి వెళ్లి నానాఇబ్బందులు గురి చేస్తాయని చెబుతున్నారు.


అవన్నీ లోపలికి వెళ్లకుండా లొట్టి కల్లు కుండకు పెట్టినట్లుగా బీర్ సీసాకు పీచు పెడితే అందులో ఉన్న చెత్త చెదారం రాదని చెబుతున్నారు. అందుకే బీరు బాటిల్‌కు అవి పెట్టికుని తాగుతున్నామని చెప్తున్నారు. గతంలో అక్కడక్కడా బీర్ సీసాల్లో తుక్కు వచ్చిందని అంటున్నారు.

ALSO READ: చాక్లెట్‌లో బతికున్న పరుగులు

ఈ నేపథ్యంలో తాగేటప్పుడు అంత కేర్ తీసుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు ఆ గ్రూప్‌కి చెందిన యువకులు. ఈ మధ్యకాలంలో కూల్ డ్రింక్ బాటిళ్లులో చెత్తా చెదారం వస్తోంది. అది గమనించిన తర్వాత ఆరోగ్యం కాపాడుకునేందుకు యువకులంతా ఈ తరహా ఎత్తుగడ వేసినట్టు చెబుతున్నారు. మొత్తానికి సీల్ వేసినా బీరును నమ్మే రోజులు కాదని నిరూపించారు ఈ మందుబాబుల గ్యాంగ్.

Related News

Dinosaur Condom: డైనోసార్ కండోమ్.. రాయిని బద్దలకొడితే ఇది బయటపడింది, సైజ్ ఏంటీ సామి అంత ఉంది?

Viral video: రీల్స్ కోసం రైల్వే ట్రాక్‌పై రిస్క్ చేసిన దంపతులు.. దూసుకొచ్చిన వందే భారత్!

Woman Sprays Pepper: ప్రయాణికుల కళ్లల్లో పెప్పర్ స్ప్రే కొట్టిన మహిళ.. అలా ఎందుకు చేసిందంటే?

Viral News: బాల భీముడు మళ్లీ పుట్టాడు, బరువు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Software Engineer Journey: సెక్యూరిటీ గార్డ్ To సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్.. ఆకట్టుకునే జోహో ఎంప్లాయీ సక్సెస్ స్టోరీ!

Viral News: ఎంతకొట్టినా చావడం లేదని.. నోటితో కొరికి పాముని చంపేశాడు, వింత ఘటన ఎక్కడ?

Nose Drinks Beer: ఓరి మీ దుంపలు తెగ.. ముక్కుతో బీరు తాగడం ఏంటి?

Happy Divorce: పాలతో స్నానం చేసి.. కేక్ కట్ చేసి.. విడాకులను సెలబ్రేట్ చేసుకున్న భర్త, వీడియో వైరల్

Big Stories

×