Worms In Chocolet Incident: మేడిపండూ చూడు మేలిమై ఉండును.. పొట్టవిప్పి చూడ పురుగులుండు.. ఇప్పుడు ఈ వేమన శతకం ఎందుకు గుర్తు చేస్తున్నట్టు అనుకుంటున్నారా.. పాపులర్ ఖరీదైన బ్రాండ్ డార్క్ చాకోలేట్.. అంతకంటే పాపులర్ మార్ట్‌లో కొనుక్కుని తీరా తిందామనే సరికి ఆ చాకోలేట్‌లో పురుగులు కనిపించాయి. అందుకే ఈ వేమన శతకం గుర్తుకొచ్చింది.
చాక్లెట్లో పురుగులు..
హైదరాబాద్ గుడిమల్కాపూర్‌లోని రిలయన్స్ స్మార్ట్‌లో.. ఓ యువతి ఖరీదైన హార్ష్‌లే డార్క్ చాకోలేట్ కొనుక్కుంది. తీరా తినేద్దామని చాకోలేట్ కవర్ విప్పి చూడగా.. అందులో సజీవంగా పాకులాడే పురుగులను కనిపించడంతో షాక్ అయింది. ఇదేంటని రిలయన్స్ స్మార్ట్ యాజమాన్యాన్ని నిలదీస్తే.. యువతిపై దాడికి దిగింది రిలయన్స్ యాజమాన్యం. దాడిని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించేందుకు ట్రై చేస్తే.. దౌర్జన్యం చేసి ఫోన్ లాక్కోడానికి ట్రై చేశారు. జరిగిన ఈ ఘటనపై గుడిమల్కాపూర్ పోలీసులకు బాధిత యువతి ఫిర్యాదు చేసింది.
యాజమాన్యాన్ని ప్రశ్నించిందని దాడి
అయితే ఆ యువతి చాక్లెట్‌లో పురుగు ఉంది అని యాజమాన్యాన్ని నిలదీయగా అదే షాపులోని ముగ్గురు వ్యక్తులు ప్రవీణ్, DM, నాపై దాడికి దిగారు అని తెలిపింది. చాక్లెట్‌లో పురుగు ఉంది అని అడగడం తప్పా.. దీనికే దాడికి పాల్పడతారా? ఇలా అడగటం వల్ల ఒక ఆడపిల్లని అనరాని మాటలు అంటారా? ఇదేక్కడి న్యాయం.. రిపోర్టర్ అయిన నాపైనే ఇలా దాడి చేస్తే సామాన్య కస్టమర్లపై ఇంకెంత దాడి చేస్తున్నారో అని ఆ యువతి ఆందోళన తెలిపింది.
Also Read: భారీగా పడిపోనున్న బంగారం.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!
ప్రాణాలు తీసే చాక్లెట్..
చాక్లెట్స్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే.. చిన్న పిల్లలకు అయితే మరి ఎక్కువ ఇష్టం.. అలాంటిది వాటిలో ఇలా పురుగులు వస్తే ప్రజల ఆరోగ్యం ఏమవ్వాలి. ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారా? దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.