E-Paper
Advertisement

School Kid: ఆది యోగిగా మారిన బుడ్డొడ్డు.. అలా ఎందుకు చేశాడంటే?

School Kid: ఆది యోగిగా మారిన బుడ్డొడ్డు.. అలా ఎందుకు చేశాడంటే?
Advertisement

పాఠశాలల్లో తరచుగా విద్యార్థులకు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ నిర్వహిస్తారు. విద్యార్థులు రకరకాల గెటప్ లలో ఆకట్టుకుంటారు. తల్లిదండ్రులు క్రియేటివ్ గా తమ పిల్లలను తయారు చేస్తారు. తాజాగా కర్ణాటకలోని ఒక పాఠశాలలో జరిగిన ఫ్యాన్సీ డ్రెస్ ఈవెంట్ లో ఓ విద్యార్థి గెటప్ అందరినీ ఆకట్టుకుంది. అంతేకాదు, ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇంతకీ ఆయన వేసిన గెటప్ మరేదో కాదు, ఆదియోగి. ఈషా ధ్యాన మందిరంలోని అతిపెద్ద ఆది యోగి విగ్రహాన్ని పోలినట్లుగా అసాధారణమైన రూపంలో కనిపించి ఆకట్టుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించాడు.

ఆది యోగి గెటప్ కు తొలి బహుమతి  

ఈషా యోగా సెంటర్ లో కొద్ది కాలం క్రితం ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించిన ఆదియోగి విగ్రహం ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది. చాలా మంది ఆ విగ్రహం ప్రతిమలను తన వాహనాలలో, ఇళ్లలో, కార్యాలయాలలో పెట్టుకుంటున్నారు. ఆ విగ్రహం నుంచి స్పూర్తి పొందిన విద్యార్థి.. తమ స్కూల్లో నిర్వహించిన ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో మొదటి యోగి అయిన ఆదియోగి శివుడిగా రెడీ అయ్యాడు. తన ఒంటికి ఆదియోగి మాదిరిగా ఒంటికి నలుపురంగు పూసుకున్నారు. తన వెనుక నెలవంకను ఏర్పాటు చేసుకున్నాడు. నుదుటిన శ్వేతవర్ణపు తిలకం, చెవులకు రింగులు, మెడకు పూలస దండ, పొడవైన జుట్టు పెట్టుకున్నాడు. పర్వతాల నడుము ఉన్నట్లు సెట్ వేయించుకున్నాడు. అద్భుతమైన సృజనాత్మకతో కష్టమైన గెటప్ ను వేసిన బుడ్డోడి భక్తికి  సర్వత్రా ప్రశంసలు దక్కాయి. భారతీయ పురాణాలు, సంస్కృతిపై లోతైన అవగాహనను ప్రదర్శించిన కుర్రాడిపై టీచర్లు అభినందనలు కురిపించారు. పోటీకి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. న్యాయనిర్ణేతలు అతడికి ప్రథమ బహుమతి అందించారు.

సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

Advertisement

ప్రస్తుతం ఈ బుడతడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. విద్యార్థులకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల మీద అవగాహన కలిగించేలా ఇలాంటి వేషధారణ కలిగి ఉండటం నిజంగా అద్భుతం అన్నారు. ఈ పిల్లాడి గెటప్ తో అసలు ఆదియోగి అంటే ఎవరు? అని విద్యార్థులకు తెలుసుకునే ఉత్సాహం కలుగుతుందన్నారు. మిగతా విద్యార్థులు కూడా మన పురాణాలు, ఇతిహాసాల గురించి తెలుసుకోవాలనే ఆలోచిన కలిగించేలా ఉందన్నారు.

Read Also: దేవుడి హుండీలో ప్రేమలేఖలు, ఇదెక్కడి వింతరా మావా?

ఇంతకీ ఎవరీ ఆదియోగి?

Advertisement

శివుడిని భారతీయులు మొదటి ఆదియోగిగా భావిస్తారు. యోగాను ఆ పరమశివడే మొదలు పెట్టినట్లు పురాణాలు చెప్తున్న నేపథ్యంలో ఆయను మొదటి యోగి అభివర్ణిస్తారు.  హిమాలయాలలోని ధ్యాన జ్ఞానాన్ని మొదట పురాణ సప్త ఋషులకు అందించాడని నమ్ముతారు. ఆ తర్వాత ఈ ఏడుగురు ఋషులు యోగా అనేక విభాగాలను సృష్టించారని భావిస్తారు. శివుడి నటరాజ విగ్రహాలు, శివుడి భంగిమలు అన్నీ శివుడు మొదటి యోగి అని రుజువు చేస్తాయి. శివుడు యోగా కళకు పితామహుడు. శివుడే యోగా. యోగానే శివుడుగా భారతీయులు భావిస్తారు.

Read Also: హైదరాబాద్‌లో అర్ధరాత్రి ఒంటరిగా సైకిల్ తొక్కిన మహిళా వ్యాపారవేత్త, కారణం ఇదేనట!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×