E-Paper
Advertisement

Nani Sujeeth Film: నాని, సుజీత్ సినిమాలో ప్రభాస్ ప్రాణ స్నేహితుడు.. కన్ఫర్మ్ అయినట్టే?

Nani Sujeeth Film: నాని, సుజీత్ సినిమాలో ప్రభాస్ ప్రాణ స్నేహితుడు.. కన్ఫర్మ్ అయినట్టే?
Advertisement

Nani Sujeeth Film: టాలీవుడ్ ఇండస్ట్రీలో టైర్ 2 హీరోలలో నాని ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈయన తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ సొంతం చేసుకొని తన సినిమాలను కూడా గ్లోబల్ రేంజ్ లో ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం నాని(Nani) శ్రీకాంత్ ఓదెల(Sreekanth Odela) దర్శకత్వంలో ది ప్యారడైజ్(The Paradise) సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా 2026 మార్చి 26వ తేదీ ఏకంగా ఎనిమిది భాషలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే షూటింగ్ పనులను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు.

నాని సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్..

ఈ సినిమా తర్వాత నాని తన తదుపరి సినిమాని ఓజీ సినిమా డైరెక్టర్ సుజిత్(Sujeeth) తో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా ఎంతో ఘనంగా జరిగాయి.ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇతర భాష సెలబ్రిటీలు ఈ సినిమాలో భాగంగా కాబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రముఖ మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్(Pruthvi Raj Sukumaran) కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం.

Advertisement

Also Read: Naveen polishetty: ఆ హీరో పెళ్లి జరిగిన మరుసటిరోజే నా పెళ్లి: నవీన్ పోలిశెట్టి

బ్లడీ రోమియో..

ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో నటించడం కోసం డైరెక్టర్ సుజిత్ పృథ్వీరాజ్ ను సంప్రదించగా ఆయన కథ విన్న అనంతరం ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి ఈ సినిమాలో పృథ్వీరాజ్ నటించబోతున్నారనే వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే చిత్ర బృందం స్పందించాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే ఎంపిక అయినట్టు కూడా వార్తలు బయటకు వచ్చాయి. ఈ విషయాలన్నింటికీ క్లారిటీ రావాలి అంటే చిత్రబృందం అధికారకంగా వెల్లడించాల్సి ఉంది. వీరి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు “బ్లడీ రోమియో” అనే టైటిల్ పెట్టాలని మొదట్లో భావించారు కానీ ప్రస్తుతం మాత్రం “గన్స్ అండ్ రోజెస్” అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది.

Advertisement

కుంభ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్..

ఇక పృథ్వీరాజ్ సుకుమారన్ విషయానికి వస్తే సలార్ సినిమాలో ప్రభాస్ స్నేహితుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన అనంతరం వరుస తెలుగు సినిమాలలో అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పృథ్విరాజ్  దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వారణాసి సినిమాలో నటించబోతున్నారు ఈ సినిమాలో ఈయన కుంభ అనే పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇలా వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో పృథ్వీరాజ్ ఎంతో బిజీగా ఉన్నారు.

Also Read: The Raja Saab: ది రాజా సాబ్ మూవీపై కుట్రలు… మారుతిపై ప్రతీకారమేనా?

Related News

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

Big Stories

Advertisement
×