Flight Journey: బస్సు, రైలు ప్రయాణంతో పోల్చితే విమాన ప్రయణీకులు కఠిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. విమాన ప్రయాణంలో తీసుకెళ్లే వస్తువుల విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కత్తుల లాంటి పదునైన వస్తువులతో పాటు లైటర్లు, డ్రై సెల్ బ్యాటరీలు సహా మండే వస్తువులను తీసుకెళ్లడం నిషేధం. అయితే, కొబ్బరికాయలు కూడా నిషేధిత వస్తువుల లిస్టులో ఉండటం విశేషం. ఇంతకీ కొబ్బరికాయను విమానంలో ఎందుకు తీసుకెళ్లనివ్వరంటే?
కొబ్బరికాయ ఆయుధంతో సమానం!
కొబ్బరి కాయలు గట్టి టెంకెను కలిగి ఉంటాయి. ఈ టెంకె ఆయుధంగా పని చేసే అవకాశం ఉంటుంది. అవసరమైతే విమాన ప్రయాణీకులను గాయపరిచేందుకు ఉపయోగించవచ్చు. “విమానంలో ప్రయాణించే ప్రతి ఒక్కరు సురక్షితంగా జర్నీ చేసేలా విమానయాన సంస్థలు చర్యలు తీసుకుంటాయి. ఆయుధాలుగా ఉపయోగపడే వస్తువులు సాధారణంగా విమానాలలో క్యారీ చేయనివ్వరు. అందులో భాగంగానే కొబ్బరికాయలను నిషేధించారు” అని విమానయాన నిపుణుడు రాజగోపాల్ వెల్లడించారు.
కొబ్బరికాయను స్కాన్ చేయడం కష్టం!
కొబ్బరికాయ గట్టి పెంకును కలిగి ఉండటం వల్ల దాని లోపల ఏవైనా నిషేధిత వస్తువులను తీసుకెళ్తే గుర్తించడం కష్టం అవుతుంది. కనీసం స్కానర్లు కూడా కొబ్బరికాయ లోపల ఏం ఉంది? అనే విషయాన్ని గుర్తించే అవకాశం ఉండదు. అందుకే కొబ్బరికాయలను విమానాల్లో తీసుకెళ్లనివ్వరు.
అధికపీడనంతో కొబ్బరికాయ పగిలే అవకాశం!
కొబ్బరికాయలు గట్టి కొబ్బరితో పాటు లోపల నీటిని కలిగి ఉంటుంది. విమానంలో తీసుకెళ్లడం వల్ల ఎక్కువ ఎత్తుకు ఎగిరాక, కాయలో పీడనం పెరిగే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి పగిలిపోతుంది. భద్రతా పరమైన సమస్యలకు కారణం అవుతుంది. అందుకే కొబ్బరికాయలను తీసుకెళ్లనివ్వరు.
ఎండు కొబ్బరికి మండే స్వభావం!
సాధారణంగా విమానంలో మండే స్వభావం ఉన్న వస్తువులను తీసుకెళ్లనివ్వరు. ఎండు కొబ్బరిలో ఆయిల్ ఎక్కువగా ఉంటుంది. మండే స్వభావం అధికంగా ఉంటుంది. ఒకవేళ కొబ్బరిని విమానంలో తీసుకెళ్తే ఏదైనా పొరపాటు మంట అంటుకుంటే త్వరగా మంటలు వ్యాపించే అవకాశం ఉంటుంది. అందుకే ఎండు కొబ్బరిని విమానంలో తీసుకెళ్లనివ్వరు.
కొబ్బరిలోని తేమతో ఇబ్బంది!
ఎండిన కొబ్బరికాయల నుండి అధిక తేమ బయటకు వస్తుంది. విమానంలో తేమ పెరిగి వెంటిలేషన్ కు ఇబ్బంది కలుగుతుంది. విమానంలోని వాతావరణం కూడా అధిక తేమతో నిడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే, కొబ్బరిని విమానంలోకి అనుమతించరు.
చెక్ ఇన్ లగేజీలో అనుమతించే అవకాశం!
విమానయాన నిబంధనల ప్రకారం సాధారణంగా ఎండిన కొబ్బరికాయలను అనుమతించరు. కొన్ని విమానాలు చెక్-ఇన్ లగేజీలోఅనుమతిస్తాయి. అయితే, విమాన ప్రయాణం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగాలంటే, ముందుగా ఆయా విమాన సంస్థల నిషేధిత వస్తువుల లిస్టును పరిశీలించడం మంచిది. అంతేకాదు, విమానయాన సంస్థల అధికారిక వెబ్ సైట్, కేంద్ర విమానయాన శాఖ అధికారులను సంప్రదించి విమానంలో నిషేదిత వస్తువులేవో తెలుసుకోవచ్చు. విమాన ప్రయాణానికి ముందు ఈ విషయాలను తెలుసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు లేకుండా ఫ్లైట్ జర్నీ చేసే అవకాశం ఉంటుంది.
Read Also: పో*ర్న్ మూవీలో ఆఫర్.. సంతోషం తట్టుకోలేక తల్లికి చెప్పేసిన కొడుకు, ఆ తర్వాత ఏం జరిగిందంటే?