Photo Talk: టాలీవుడ్ లో హీరోల మధ్య ఎప్పుడు ఆరోగ్యకరమైన పోటీనే నడుస్తూ ఉంటుంది. సినిమాల విషయంలో పోటీ పడతారమో కానీ.. బయట ఇండస్ట్రీ మొత్తం ఒక్కట్టే. ఇక వారందరూ ఒకేచోట కలిసినప్పుడు అభిమానుల్లో ఉండే ఆనందం అంతా ఇంతాకాదు. నిన్నటికి నిన్న ఏఎన్నార్ నేషనల్ అవార్డ్ 2024 వేడుకలో మెగా – అక్కినేని కుటుంబాలు కలిసి కనిపించిన విషయం తెల్సిందే. ఈ ఏడాది ఏఎన్నార్ నేషనల్ అవార్డ్ 2024 వేడుకను అక్కినేని కుటుంబం ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు. ఆ అవార్డును ఈసారి మెగాస్టార్ చిరంజీవి అందుకున్నారు.
బిగ్ బి అమితాబ్ బచ్చన్.. ఏఎన్నార్ నేషనల్ అవార్డ్ ను చిరుకు ప్రదానం చేశారు. ఇక చిరు అవార్డు తీసుకోవడం కళ్లారా చూడడానికి ఆయన వారసుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ వేడుకకు విచ్చేశాడు. ఈ రెండు కుటుంబాల మధ్య విడదీయలేని అనుబంధం ఉంది. అక్కినేని నాగేశ్వరావు, అల్లు రామలింగయ్య ఉన్నప్పటి నుంచే వీరి మధ్య ఆ స్నేహం కొనసాగుతూ వస్తుంది. నాగ చైతన్యను పక్కన పెడితే.. అఖిల్ మెగా కుటుంబానికి చాలా క్లోజ్ అని చెప్పాలి.
Ashok Galla: మహేష్ బాబు ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ చెప్పిన మేనల్లుడు.. క్షమించండి అంటూ పోస్ట్
చిరంజీవిని పెద్దనాన్న అని పిలవడం.. చరణ్ ను అన్నయ్య అని పిలవడం.. మెగా ఇంటికి వెళ్లడం చిన్నతనం నుంచి అఖిల్ కు అలవాటు. చరణ్ కూడా తనకు తమ్ముడు లేని లోటును అఖిల్ లో చూసుకుంటూ ఉంటాడు. ఇక ఈ ఈవెంట్ లో మెగా – అక్కినేని వారసులే హైలైట్ గా నిలిచారు. తండ్రులతో కలిసి వారసులు కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. చిరంజీవి, నాగార్జున, రామ్ చరణ్, నాగ చైతన్య, అఖిల్.. బ్లాక్ కలర్ సూట్స్ లో అద్భుతంగా కనిపించారు. ఇలాంటి ఒక రేర్ పిక్ ఇంకెప్పుడు రాదు అన్నట్లు ఉంది. ఈ ఫోటో చూడడానికి రెండు కళ్లు చాలడం లేదే అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.
ఇక టాలీవుడ్ కు రెండు పిల్లర్లు అయినా చిరంజీవి, నాగార్జున సైతం.. ఒక ఫొటోలో పోజ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. చిరు – నాగ్ కెరీర్ విషయానికొస్తే.. చిరు హీరోగా విశ్వంభర లైన్లో ఉంది. నాగ్ ఈసారి హీరోగా కాకుండా సపోర్టివ్ రోల్స్ తో అదరగొట్టడానికి రెడీ అయ్యాడు. ధనుష్ నటిస్తున్న కుబేర, రజినీకాంత్ నటిస్తున్న కూలీ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. ఇక ఎలాగూ బిగ్ బాస్ ఉండనే ఉంది.
Rana Daggubati: నా జుట్టు ఒరిజినల్ కాదు.. ఎంత నిజాయితీగా చెప్పావ్ బాసూ.. హ్యాట్సాఫ్
ఇక వారసుల కెరీర్ ల విషయానికొస్తే.. చిరు వారసుడు చరణ్.. గ్లోబల్ స్టార్ గా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఎదుగుతున్నాడు. చరణ్ తో పోలిస్తే అక్కినేని వారసులు ఇంకా పాన్ ఇండియా రేంజ్ ను అందుకోలేదనే చెప్పాలి. ఏజెంట్ సినిమాతో అఖిల్.. పాన్ ఇండియా రేంజ్ అందుకోవాలనుకున్నాడు. కానీ,చివరి నిమిషం లో ఆ సినిమా తెలుగుకే పరిమితమయ్యింది.
నిజం చెప్పాలంటే తెలుగులో కూడా ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక చై .. కొద్దిగా ఆ రేంజ్ ను అందుకున్నాడు. ఆయన నటించిన దూత వెబ్ సిరీస్ అన్ని భాషల్లో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం తండేల్ సినిమాతో చై పాన్ ఇండియా రేంజ్ ను అందుకోవడానికి ట్రై చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో అక్కినేని హీరో.. పాన్ ఇండియా రేంజ్ ను అందుకుంటాడేమో చూడాలి.