BigTV English

Pushpa 2: పుష్పగాడికి పోటీగా అమ్మాయా.. సుకుమార్ ట్విస్ట్ అదుర్స్..!

Pushpa 2: పుష్పగాడికి పోటీగా అమ్మాయా.. సుకుమార్ ట్విస్ట్ అదుర్స్..!

Pushpa 2 Twist.. అల్లు అర్జున్ (Allu Arjun) సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో భారీ బడ్జెట్ తో వస్తున్న చిత్రం పుష్ప -2 (Pushpa -2). గతంలో వచ్చిన పుష్ప సినిమాకి సీక్వెల్ ఇది. ఒకప్పుడు ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై బాలీవుడ్ లో రూ.100 కోట్ల క్లబ్లో చేరి రికార్డ్ సృష్టించిన పుష్ప (Pushpa) సినిమా అల్లు అర్జున్ కి పాన్ ఇండియా ఇమేజ్ ను అందించింది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కి దేశవ్యాప్తంగా భారీ బజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 6వ తేదీన విడుదల కావలసిన పుష్ప -2 ఒకరోజు ముందుగానే అభిమానుల కోసం డిసెంబర్ 5న విడుదల కాబోతోంది. ఇకపోతే పుష్ప -2 నుంచి విడుదల చేసిన గ్లింప్స్,పోస్టర్స్ అన్నీ కూడా సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. దీనికి తోడు అల్లు అర్జున్ అమ్మవారి గెటప్ లో కనిపించడంతో సినిమా కోసం అభిమానులు చాలా ఎదురు చూస్తున్నారు.


మెయిన్ విలన్ గా అనసూయా..

ఇకపోతే పుష్ప పార్ట్ 1 లో అనసూయ, సునీల్, ఫహాద్ ఫాజిల్ లను విలన్లుగా చూపించారు. అయితే ఇక్కడ పుష్ప 2 లో మెయిన్ విలన్ ఎవరు? అంటూ అభిమానులు సైతం తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేకాదు ఈ మెయిన్ విలన్ గా ఎవరు నటిస్తున్నారు? అని తెలుసుకోవడం కోసం కనీసం చిన్న హింట్ అయినా ఇవ్వాలి అని కోరుతూ ఉండగా.. తాజాగా తెరపైకి వచ్చిన ఒక వార్త విని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప గాడికి పోటీగా ఒక అమ్మాయి చాలా పవర్ ఫుల్ గా విలనిజాన్ని పండించబోతోందని సమాచారం. ఆమె ఎవరో ఇప్పటికే అర్థమయి ఉంటుంది కదా.. పుష్ప-1 లో సునీల్ మీద కూర్చొని పీక పైన బ్లేడ్ పెట్టిన దాక్షాయిణి అలియాస్ అనసూయ ఇక్కడ పవర్ఫుల్ విలన్ పాత్ర పోషిస్తోంది అని సమాచారం. ఇక ఈ విషయం తెలిసి అనసూయ విలనిజాన్ని మరోసారి చూడాలి అని అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు.


సుకుమార్ దెబ్బకు మైండ్ బ్లాక్..

ఇకపోతే ఈ సినిమాలో ప్రతి పది నిమిషాలకి ఒక ట్విస్ట్ ఉంటుందని అటు ఇంటర్వెల్ , ఇటు క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లు, ప్రేక్షకులను గురిచేస్తాయని దీనికి తోడు అనసూయ చేయబోయే నటన పట్ల కూడా చాలామంది ప్రేక్షకులు ఎన్నో రకాల కాంప్లిమెంట్స్ ఇవ్వబోతారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే ఈ సినిమాతో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి సుకుమార్ సిద్ధమైనట్లు సమాచారం. దీనికి తోడు తన దర్శకత్వంలో వచ్చే ప్రతి సినిమాలో కూడా క్లైమాక్స్ లో తన మార్కు చూపించడం సుకుమార్ కి అలవాటు. అలా రంగస్థలం సినిమాలో చివర్లో ప్రకాష్ రాజ్ (Prakash Raj) ను విలన్ గా ఎలా అయితే రివీల్ చేశాడో.. అదేవిధంగా అలాంటి మ్యాజిక్ ని ఇప్పుడు రిపీట్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచడంలో ఎంతో కృషి చేస్తున్నాడు అని చెప్పవచ్చు. దీనికి తోడు సౌత్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా భారీ ధరకు అమ్ముడు పోయింది ఈ సినిమా. ఇక అక్కడ కూడా బజ్ భారీగా ఏర్పడడంతో పాన్ ఇండియాలో రికార్డులు సృష్టించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×