Viral Video: మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఉన్న ప్రసిద్ధ జ్యోతిబా ఆలయం ఘోర అపచారం నెలకొంది. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో జరగాల్సిన ప్రశాంతమైన పూజా కార్యక్రమాలకు విరుద్ధంగా.. పూజారులే హింసకు దిగడం స్థానికంగా కలకలం రేపింది.
ఆలయ ప్రాంగణంలో ఇద్దరు భక్తులపై సుమారు 15 నుండి 20 మంది పూజారులు ఒక్కసారిగా దాడికి దిగారు. బాధితులను చుట్టుముట్టి విచక్షణారహితంగా కొట్టారు. సదరు భక్తులు పొరపాటున లేదా ఉద్దేశపూర్వకంగా పూజారులపై రంగు నీళ్లు చల్లడమే ఈ దాడికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఆ సమయంలో ఆగ్రహానికి లోనైన పూజారులు సంయమనం కోల్పోయి భౌతిక దాడికి పాల్పడ్డారు.
ఈ దారుణ దృశ్యాలను అక్కడి వారు వీడియో తీయగా.. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. భక్తి భావంతో ఉండాల్సిన చోట ఇలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల పట్ల పూజారుల తీరుపై పోలీసులు , ఆలయ కమిటీ విచారణ చేపడుతున్నాయి.
Also Read: బీజేపీకి దిమ్మతిరిగే కౌంటర్.. బీసీ రిజర్వేషన్లపై మహేశ్ కుమార్ గౌడ్ మాస్టర్ ప్లాన్
భక్తులను ఘోరంగా కొట్టిన పూజారులు
మహారాష్ట్ర-కొల్హాపూర్‌లోని ప్రసిద్ధ జ్యోతిబా ఆలయంలో ఘటన
ఇద్దరు భక్తుల్ని చుట్టుముట్టి విచక్షణారహితంగా కొట్టిన 15 నుంచి 20 మంది పూజారులు
తమపై రంగు నీళ్లు చల్లినందుకే పూజారులు ఆగ్రహంతో దాడి చేసినట్లు సమాచారం
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో… pic.twitter.com/dcX1l8AVt2
— BIG TV Breaking News (@bigtvtelugu) March 23, 2026