సోషల్ మీడియా సెన్సేషన్ కుమారి ఆంటీ ఇప్పుడు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో తనదైన వంటకాలతో ఫేమస్ అయిన ఆమె వ్యాపారం ప్రస్తుతం ఒడిదుడుకులకు లోనవుతోంది. ప్రధానంగా గ్యాస్ సిలిండర్ల కొరత తనను వేధిస్తోందని ఆమె తాజాగా బిగ్ టీవీతో మాట్లాడుతూ వాపోయారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ఆమె స్టాల్ వద్ద ఇప్పుడు మునుపటి సందడి కనిపించడం లేదు. వంట చేయడానికి అవసరమైన ఇంధనం లభించకపోవడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
గ్యాస్ కొరత ప్రభావం నేరుగా తన అమ్మకాలపై పడిందని వాపోయారకు. స్టాల్‌లో ప్రతిరోజూ అందించే వెరైటీ ఐటెమ్స్ సంఖ్యను ఆమె భారీగా తగ్గించేశామని చెప్పారు. సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో కస్టమర్లకు కావాల్సిన అన్ని రకాల వంటకాలు అందించలేకపోతున్నామని అన్నారు. ప్రస్తుతం తన వద్ద ఒక్క గ్యాస్ సిలిండర్ కూడా లేదని.. అసలు వ్యాపారం ఎలా ముందుకు సాగించాలో అర్థం కావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సమస్య ఆమెను కుంగదీస్తోంది.
ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు కుమారి ఆంటీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తన సొంత ఊరి ప్రెసిడెంట్‌ను కలిసి తన దుస్థితిని వివరించారు. సహాయం కోసం అభ్యర్థించారు. ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యి మీద వంట చేద్దామని భావించినా అక్కడ కూడా అడ్డంకులు ఎదురవుతున్నాయి. కట్టెల పొయ్యి ఏర్పాటు చేసుకునేందుకు యజమానులు భారీగా అద్దెలు డిమాండ్ చేస్తున్నారు. అంత మొత్తంలో అద్దెలు చెల్లించే స్తోమత తనకు లేదని ఆమె స్పష్టం చేశారు.
బిగ్ టీవీతో కుమారి ఆంటీ
గ్యాస్ కొరతతో వ్యాపారం తగ్గింది
ఐటెమ్స్ కూడా బాగా తగ్గించాం
ప్రస్తుతం నా వద్ద గ్యాస్ సిలిండర్లు కూడా లేవు
ఏం చేయాలో అర్థం కావడం లేదు
మా ఊరి ప్రెసిడెంట్ ను కూడా కలిసి పరిస్థితి వివరించాను
కట్టెల పొయ్యి పెట్టుకుని వంట చేయడానికి భారీగా అద్దెలు… pic.twitter.com/GVukUMzyJa
— BIG TV Breaking News (@bigtvtelugu) March 14, 2026
ఒకవైపు గ్యాస్ దొరకక.. మరోవైపు ఇతర ప్రత్యామ్నాయాలు భారంగా మారడంతో కుమారి ఆంటీ సందిగ్ధంలో పడ్డారు. వేల మందికి రుచికరమైన భోజనం పెట్టిన ఆమె ఇప్పుడు తన ఉపాధి కోసం పోరాడాల్సి వస్తోంది. ప్రభుత్వం లేదా దాతలు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని ఆమె కోరుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆమె ఫుడ్ స్టాల్ మళ్ళీ పాత వైభవాన్ని సంతరించుకోవాలని అభిమానులు సైతం ఆశిస్తున్నారు.
ALSO READ: D-Mart Staff: డి-మార్ట్ ఉద్యోగి పైత్యం, బిడ్డకు పాలిస్తున్న మహిళను చూసి.. అలాంటి మాట, వీడియో వైరల్!