E-Paper
Advertisement

D-Mart Staff: డి-మార్ట్ ఉద్యోగి పైత్యం, బిడ్డకు పాలిస్తున్న మహిళను చూసి.. అలాంటి మాట, వీడియో వైరల్!

D-Mart Staff: డి-మార్ట్ ఉద్యోగి పైత్యం, బిడ్డకు పాలిస్తున్న మహిళను చూసి.. అలాంటి మాట, వీడియో వైరల్!
Advertisement

ప్రముఖ రిటైల్ చైన్ సూపర్ మార్కెట్ డిమార్ట్ స్టోర్‌ లో జరిగిన ఒక సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఓ తల్లి తన శిశువుకు పాలిచ్చేటప్పుడు స్టోర్ సిబ్బంది అనుచితంగా మాట్లాడారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులు సిబ్బంది తీరుపై సీరియస్ అయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

ఓ మహిళ తన బిడ్డతో కలిసి డిమార్ట్ కు వచ్చింది. కాసేపటి బేబి ఏడ్చింది. స్టోర్ లోని ఓ మూలకు కూర్చుని పాలు ఇచ్చింది. ఆ సమయంలో కొంత మంది యువకులు అయిన స్టోర్ ఉద్యోగులు అక్కడికి చేరుకుని తనను గమనిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆమె ఆరోపించారు. ఆ సమయంలో తాను చాలా అవమానంగా ఫీలయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు.  ఆ తర్వాత సదరు మహిళ కుటుంబ సభ్యులు స్టోర్ సిబ్బందిని ప్రశ్నించడం ఈ వీడియో కనిపించింది.  కొంతమంది ఉద్యోగులు ఆమె చేసిన ఆరోపణలు నిజం కాదని చెప్పగా, మరికొంత మంది స్పందించకుండా తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతుంది.

#ShameOnDMart హ్యాష్‌ ట్యాగ్ ట్రెండింగ్

Advertisement

ఈ వీడియో చూసిన తర్వాత #ShameOnDMart అనే హ్యాష్‌ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. వేలాది మంది నెటిజన్లు ఆ మహిళకు సపోర్ట్ చేస్తున్నారు. తల్లిపాలు ఇవ్వడం సహజమైన విషయం అని, మహిళలను కించపరిచేలా మాట్లాడాల్సిన అవసరం లేదంటున్నారు. స్టోర్ లో అన్ని సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ, ఆమెను వేధించారంటే? బయట పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ఇలాంటి ఘటనల పట్ల సైలెంట్ ఉంటే, మళ్లీ అలాంటి తప్పు చేస్తారని, కఠిన చర్యలు తీసుకోవాలని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇంత కాలం డిమార్ట్ లో మోసాలు మాత్రమే జరుగుతాయనుకునే వాళ్లం.. ఇప్పుడు మహిళలపై వేధింపులు కూడా జరుగుతున్నాయా? అని మరికొంత మంది రియాక్ట్ అవుతున్నారు.

Advertisement

Read Also: రైలులో సీటు కోసం గొడవ.. ఈ ఆంటీకి ఆస్కార్ ఇవ్వాల్సిందే, చివరిలో మిస్ కావద్దు!

స్పందించిన డిమార్ట్ యాజమాన్యం

అటు ఈ వివాదం పెరుగుతున్న నేపథ్యంలో డిమార్ట్ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనపై తమకు సమాచారం ఉందని వెల్లడించింది. ఈ ఘటనపై అంతర్గత దర్యాప్తు జరపుతున్నట్లు తెలిపింది. ఉద్యోగులు తప్పు చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పింది. త్వరలోనే అసలు విషయం వెలుగులోకి వస్తుందని తెలిపింది.

Read Also: చెప్పు చూపిస్తూ.. బూతులతో రెచ్చిపోయిన మహిళ, ఓపిక నశించి.. అతడు ఏం చేశాడంటే?

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×