Aghori – Srivarshini Marriage: గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో.. అఘోరీ నాగసాధువు అలియాస్ శ్రీనివాస్ అంశం తీవ్ర కలకలం రేపుతోంది. తాను లోక కళ్యాణం, సనాతన ధర్మం పరిరక్షణ పేరుతో తిరుగుతూ.. హల్ చల్ చేస్తున్న అఘోరీ తాజాగా మరో సంచలన పని చేశాడు.
చెప్పినట్లుగానే అఘోరీ శ్రీనివాస్ మూడవ సారి వర్షిణి మెడలో తాళి కట్టాడు. సోమవారం నాడు మధ్య ప్రదేశ్ లోని ఒక ఆశ్రమంలో వీరి వివాహం జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారాయి. అనేక సాధువుల మధ్య అంగరంగ వైభవంగా అఘోరీ వర్షిణి మెడలో తాళి కట్టాడు. అఘోరీ, శ్రీ వర్షిణి పరస్పరం దండలు మార్చుకున్నారు. అనంతరం తలంబ్రాలు పోసుకుని.. ఏడు అడుగులు వేశారు. ఈ సందర్భంగా భక్తి పాటలు పాడుతూ ఆనందంలో మునిగి తేలారు.
ఇప్పటికే రెండు సార్లు తాళి కట్టినట్లుగా చెప్పారు. ఇటీవల వర్షిణి బిగ్ టీవి స్టూడియోలో కూర్చొని అనేక విషయాలు చెప్పుకొచ్చింది. తల్లిదండ్రుల సమక్షంలో ఒకసారి, అంతకముందు దేవాలయంలో ఒక సారి.. ఇలా రెండు సార్లు తన మెడలో తాళి కట్టినట్టుగా చెప్పింది. అదే సమయంలో అఘోరీ శ్రీనివాస్ కూడా మాట్లాడాడు. మరోసారి కూడా వివాహం చేసుకుంటా.. ఈ సారి అంగరంగ వైభవంగా చేసుకుంటా అని చెప్పారు. అన్నట్లుగానే అఘోరీ శ్రీ వర్షిణి మెడలో తాళి కట్టారు. ఇద్దరం కలిసి మరోసారి పార్వతి పరమేస్వర్లకు జన్మిస్తాం. త్వరలోనే తాను శ్రీ వర్షిణీని తీసుకొని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న తన స్వగ్రామానికి వస్తానని, వర్షిణీతో కలిసి ఉంటాము. మేమిద్దరం కలిసి పిల్లల్ని కూడా కంటామంటూ వాళ్లు ఇద్దరు చెబుతున్నారు.
ఇప్పటికే అఘోరీ శ్రీనివాస్ పైన రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. ఒక పక్క వర్షిణి తల్లిదండ్రులు కావాలనే తమ కుమార్తెను వశీకరణంతో లొంగ తీసుకుని ఈ రకంగా వ్యవహరిస్తున్నాడు. ఆమెను మోసం చేసి వివాహం చేసుకున్నాడంటూ వారు ఆరోపిస్తుంటే.. నిన్న మరో యువతి తెరమీదకు వచ్చింది. కరీంనగర్ కి చెందిన రాధ అనే యువతి అఘోరీ భార్య అంటూ మీడియా ముందుకు వచ్చింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. మాయమాటలు చెప్పాడని ఆరోపించింది.
అయితే ఈ ఆరోపణలపై అఘోరీ స్పందించింది. తాను ఎవరిని పెళ్లి చేసుకోలేదని తెలిపింది. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యింది. అసలు తాను తాళి కట్టాను అనడానికి రుజువు కావాలని.. ఆమె మాట్లాడిన ఆడియో రికార్డ్ కూడా బయట పెట్టాలని డిమాండ్ చేసింది.
అయితే శ్రీనివాస్ అలియాస్ లేడీ అఘోరీ.. గతేడాది జనవరి 1న తనను పెళ్లాడాడని రాధ చెబుతోంది. తన మెడలో వెండి తాళి కట్టాడని.. అయితే రిసెంట్‌గా ఇంటికి వచ్చి తన తాళి తనకు ఇచ్చేయమని గొడవ చేసి.. ఆ వెండి తాళి తీసుకెళ్లిపోయాడని చెబుతోంది. 15 రోజుల క్రితం వర్షిణి గురించి తాను టీవీల్లో చూశానని.. ఎవరు ఆమె అని అఘోరీని అడిగానని చెప్పింది. వర్షిణి తనకు కూతురు లాంటిదని.. తాను ఆమెకు గురువునని అఘోరీ చెప్పాడంది. అయితే, 4 రోజుల క్రితం వర్షిణిని అఘోరీ పెళ్లి చేసుకున్నాడనే మేటర్ తెలిసి.. ఫోన్ చేస్తుంటే కాల్ లిఫ్ట్ చేయట్లేదని.. తన నెంబర్ బ్లాక్ చేశాడనేది రాధ ఆరోపణ.
Also Read: భర్తే యముడు.. 8 నెలల గర్బిణీ దారుణహత్య, విశాఖలో ఘోరం
అంతేకాదు అఘోరీ తనకు పంపిన వాయిస్ మెసేజ్‌లను బిగ్ టీవీకి అందజేసింది రాధ. ఆ ఆడియోలో అఘోరీ.. రాధపై చాలా ప్రేమ వొలకబోసాడు. ఆ ఆడియోలో తనను చాలా మిస్ అవుతున్నా.. రాగానే తాళి కడతా.. గుండెలో చాలా పెయిన్ ఉంది.. మనం జీవితాంతం కలిసి ఒకటే ఇంట్లో ఉండాలని కోరిక.. అందరూ వేరు.. నువ్వు వేరు..ఇలా సాగింది అఘోరీ ప్రేమ వ్యవహారం.
ఇక ఈరోజు రాధ అనే యువతి మహిళా కమీషన్‌కి ఫిర్యాదు చేయబోతున్నారు. అలాగే కరీంనగర్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడానికి సిద్ధ మవుతున్న తరుణంలో.. అఘోరీ వర్షిణీని మరోసారి వివాహం చేసుకోవడం సంచలనంగా మారింది. చూడాలి ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో.. వీరి వివాహం ఎలా ముందుకు వెళుతుందో వేచి చూడాల్సిందే.