Vizag Crime News: వారిద్దరి కులాలు వేరు.. మనసులు కలిశాయి.. పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. పెళ్లి జరిగి రెండేళ్లు అయ్యింది. ఈ విషయాన్ని భర్త తల్లిదండ్రులకు చెప్పకుండా మేనేజ్ చేశాడు. భార్య గర్భవతి అయ్యింది. రేపో మాపో పండంటి బిడ్డకు జన్మ ఇవ్వనుంది. అంతలో కట్టుకున్న భార్యని ఆ లోకం నుంచి పంపించేశాడు భర్త. సంచలన రేపిన ఈ ఘటన విశాఖ సిటీలో చోటు చేసుకుంది. ఇంకా లోతుల్లోకి వెళ్తే..
స్టోరీలోకి వెళ్తే..
పోలీసులు చెప్పిన కథనం ప్రకారం.. దువ్వాడకు చెందిన జ్ఞానేశ్వర్, సిటీలోని ఓ ప్రాంతానికి చెందిన అనూషను ప్రేమించాడు. అనూష తల్లికి చూపు మందగించింది. నాలుగేళ్ల కిందట తండ్రి చనిపోయాడు. ఆ ఇంటికి ఆమె పెద్ద దిక్కు అయ్యింది. మూడేళ్లు కిందట జ్ఞానేశ్వర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే వీరిద్దరు కులాలు వేరు వేర్వేరు.
జ్ఞానేశ్వర్ రెండు ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలు నడుపుతున్నాడు. డబ్బులకు కొదవలేదు. పెళ్లి జరిగి మూడేళ్లు గడిచినా భార్యను తల్లిదండ్రులకు పరిచయం చేయలేదు జ్ఞానేశ్వర్. పెళ్లి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పకుండా సిటీలో ఉద్యోగం చేస్తున్నానని వారిని నమ్మించాడు. అత్తమామల వద్దకు వెళ్దామని భార్య ఎప్పుడు అడిగినా రకరకాల కారణాలు చెప్పి తప్పించుకునేవాడు.
భార్య అనూష గర్భవతి అయ్యింది. ప్రస్తుతం ఎనిమిదో నెల. వచ్చేవారంలో ఆమెకి డెలివరీ డేట్ ఇచ్చారు డాక్టర్లు. ఇప్పుడున్న సమయంలో భార్య డెలివరీ అయితే తల్లిదండ్రులతో లేనిపోని సమస్యలు వస్తాయని భావించాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భార్యని ఏదోవిధంగా చంపేయడమే బెటరని నిర్ణయానికి వచ్చాడు.
ALSO READ: మూడు రోజుల కింద పెళ్లి, ఆపై కత్తులతో దాడి
భార్యను వదిలించుకునేందుకు రకరకాల స్కెచ్‌లు వేశాడు. తనకు క్యాన్సర్ వచ్చిందని ఒకసారి, విడాకులు తీసుకుని వేరే పెళ్లి చేసుకోవాలని భార్యను కన్వీస్ చేసే ప్రయత్నం చేసేవాడు. అందుకు భార్య ససేమిరా చెప్పింది. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య తరచుగా గొడవలు జరిగేవి.
పక్కాగా ప్లాన్ చేశాడు, ఆపై
గర్భిణిగా ఉన్న అనూషకు నెలలు నిండాయి. సోమవారం ఆమెని ఆసుపత్రిలో చేరాల్సి ఉంది. అక్కడే తన స్కెచ్‌ని పక్కాగా అమలు చేశాడు జ్ఞానేశ్వర్. ఆసుపత్రికి తోడు తీసుకెళ్లేందుకు అమ్మమ్మను రెండు రోజుల కిందట ఇంటికి పిలిచాడు. ఆదివారం రాత్రి భార్యాభర్తలు కలిసి నిద్రపోయాడు. ఇదే సరైన సమయమని భావించాడు భర్త.
సోమవారం వేకువజామున నిద్రలో ఉన్న భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. తెల్లారిపోయింది.. మనుమరాలు నుంచి కనీసం ఉలుకు పలుకు లేదు. దీంతో వాళ్ల అమ్మమ్మ కంగారుపడి జ్ఞానేశ్వర్‌ను పిలిచింది. పైకి ఏమీ తెలియనట్టు స్థానికులతో కలిసి భార్యను కేజీహెచ్‌కు తరలించాడు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
దీనిపై స్థానికుల్లో అనుమానాలు మొదలయ్యాయి. చివరకు ఈ వ్యవహారం పోలీసుల వద్దకు చేరింది. జ్ఞానేశ్వర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు పీఎం పాలెం పోలీసులు. దీంతో అసలు విషయం బయటపడింది. ప్రేమ పేరుతో అనూషను నమ్మంచి మోసం చేశానని తెలిపాడు. ఆమెని వదిలించుకునే ప్రయత్నంలో హత్య చేసినట్టు అంగీకరించాడు.