Aarti Gupta : శ్రీనివాస కుమారన్ అంటే అందరికీ తెలియకపోవచ్చు. కానీ ఎస్ కే ఎన్ అంటే తెలియని వాళ్ళు ఉండరు అని చెప్పొచ్చు. ఎందుకంటే అంతగా ఈ మధ్య కాలంలో పాపులర్ అయ్యారు ఎస్ కే ఎన్. ఇంకా ఎస్ కే ఎన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో సినిమాలు నిర్మించిన కూడా ఎస్ కే ఎన్ కి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చిన సినిమా అంటే టాక్సీవాలా అండ్ బేబీ అని చెప్పొచ్చు.
బేబీ సినిమా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఒక సినిమాని నమ్మి కొన్ని కోట్లు పెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఒక దర్శకుడి ఆలోచన నమ్మి కొన్ని కోట్లు పెట్టడం అంటే దానిని సాహసం అనే చెప్పాలి. అయితే అలా సాయి రాజేష్ ఆలోచనను నమ్మి కొన్ని కోట్లు పెట్టి బేబీ సినిమాను నిర్మించారు. ఈ బేబీ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ ను రాబట్టింది.
Also Read : HBD Sakshi Shivanand: ఆ తప్పు చేసి కనుమరుగైన స్టార్ హీరోయిన్.. కట్ చేస్తే..!
ముందుగా ఈ సినిమా విషయంలో కొంతమంది నుంచి కొద్దిపాటి నెగిటివ్ ఫీడ్ బ్యాక్స్ వచ్చాయి. కానీ అవన్నీ కూడా రియల్ ఆడియన్స్ నుంచి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ తో డామినేట్ అయిపోయాయి. ఇకపోతే ఈ సినిమా ప్రీమియర్ పడగానే కల్ట్ బ్లాక్ బస్టర్ కొట్టామని చాలా నమ్మకంతో అప్పట్లో చెప్పుకొచ్చారు ఎస్ కే ఎన్. అక్కడితో ఎస్ కే ఎన్ బాగా ఫేమస్ అవుతూ వచ్చారు. అంతకంటే ముందు నుంచే కూడా ఎస్ కే ఎన్ స్టేజ్ పైన మాట్లాడిన తీరు, ట్విట్టర్లో ఫ్యాన్స్ కి ఇచ్చే రిప్లైస్ కూడా ఎస్ కే ఎన్ కి ఒక ఓన్ ఇమేజ్ ను తీసుకొచ్చి పెట్టాయి. ఇకపోతే ఏ సినిమా ఫంక్షన్ అయినా కూడా ఎస్ కే ఎన్ తన మాటలతో అందరినీ ఆశ్చర్యపరుస్తాడు.
హీరోయిన్ ను ఇన్స్పైర్ చేశాడు
సంపూర్ణేష్ బాబు ఆర్తి గుప్తా కలిసి నటించిన సినిమా సోదరా. ఈ సినిమా సంబంధించిన ఈవెంట్ కు ఎస్కేన్ హాజరయ్యాడు. ఇక్కడ అందరినీ ఉద్దేశిస్తూ మాట్లాడారు. హీరోయిన్ ఆర్తి గురించి మాట్లాడుతూ ముంబై నటులు ఆర్తి గారికి తెలుగులోకి ఎవరైనా రావచ్చు నెక్స్ట్ టైం మాట్లాడేటప్పుడు తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేయండి. నాకు తెలుగంటే ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు అంటూ చెప్పుకొచ్చాడు. సాధారణంగా కొంతమంది ఆ మాటలను పెద్దగా పట్టించుకోరు కానీ ఆర్తి మాత్రం తెలుగు నేర్చుకుంటున్నట్లు ఒక నోట్స్ను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ప్రస్తుతం ఆ నోట్స్ కూడా ఇప్పుడు వైరల్ అయింది. ముంబై నటిని ఇన్స్పైర్ చేసిన ఎస్ కే ఎన్ అంటూ ప్రశంసలు మొదలయ్యాయి.
Also Read : Niharika: మెగా వారి ఇంట్లో సెలబ్రిటీలు… నిహారిక గుడ్ న్యూసే కారణమా..?