Viral Video : రీల్స్.. షార్ట్స్.. పిచ్చి పీక్స్‌కు చేరుతోంది. సోషల్ మీడియా లేకుండా ఒక్క క్షణం కూడా గడిచే పరిస్థితి లేదు. ఉదయం లేవగానే.. మొబైల్‌తో మొదలు. రాత్రి పడుకునే వరకూ అదే తంతు. ఇన్‌స్టా, ఫేస్‌బుక్, యూట్యూబ్, ఎక్స్.. అదే ప్రపంచం. పిచ్చి మాలోకం. లైక్‌లు, కామెంట్లు, షేర్ల కోసం పడి చస్తున్నారు. ప్రాణాలు పోయే వరకు ఫీట్లు చేస్తున్నారు. ఎప్పుడు తమ వీడియో వైరల్ కావాలన్నా.. రైల్‌తోనే చెలగాటం ఆడుతుంటారు చాలామంది. వైరల్ వీడియోల్లో చాలావరకు ట్రైన్‌తో చేసిన సాహసాలే కనిపిస్తాయి. ఒకడు రన్నింగ్ ట్రైన్‌తో డేంజరస్ ఫీట్లు చేస్తుంటాడు.. ఇంకొకడు రైల్ నుంచి దూకేస్తాడు.. మరొకడు రైలుకు ఎదురుగా రన్నింగ్ చేస్తాడు.. పట్టాలపై పడుకుంటాడు.. అబ్బో వాళ్ల ఓవరాక్షన్ మామూలుగా ఉండదు. ఆ రీల్స్ బెడిసికొట్టి.. రైల్ కింద పడి చచ్చిన వాళ్లు కూడా చాలామందే. కట్ చేస్తే….
అంతా అబ్బాయిలేనా? అమ్మాయిలేమన్నా తక్కువా? ఎందులోనూ తగ్గేదేలే అంటున్నారు. తాము కూడా ట్రైన్‌తో రీల్స్ చేస్తామంటూ సవాల్ చేస్తున్నారు. లేటెస్ట్‌గా.. ఓ లేడీ ఫిట్‌నెస్ ట్రైనర్ అలాంటి పనే చేసింది. వేగంగా వెళ్తున్న రైల్‌తో పోటీ పడింది. కంకర రాళ్లపై చాలా రిస్క్ చేసి రన్నింగ్ చేసింది. ట్రైన్‌ను ఓడిద్దామనా? వీడియో వైరల్ చేద్దామనా? స్కెచ్ ఏంటో కానీ.. ఆమె చేసిన ఆ డేంజరస్ ఫీట్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆవిడకు కావాల్సింది కూడా అదే. తాను అనుకున్నట్టుగానే ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : అఘోరి మొదటి భార్య ఎంట్రీ.. వర్షిణి వదిలేస్తుందా?
పికు సింగ్. ఫిట్‌నెస్ ఇన్ఫ్లుయెన్సర్. రన్నింగ్ రైల్‌తో పోటాపోటీగా రన్నింగ్ చేసిన వీడియోను ఇన్‌స్టా పేజ్‌లో అప్‌లోడ్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమెకు మంచి ప్రాక్టీసే ఉన్నట్టుంది. బాగానే పరిగెత్తింది. కానీ, అసలే కంకర రాళ్లు. ఏమాత్రమైన కంట్రోల్ తప్పి ఉంటే? కాలు స్లిప్ అయిఉంటే? జరగకూడనిది ఏదైనా జరిగుంటే? అంత ఓవరాక్షన్ అవసరమా? పాపులారిటీ కోసం అంత రిస్క్ చేయొచ్చా? ప్రాణాలతో చెలగాటమేంటి? ఇలా సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్‌తో పింక సింగ్‌ను కుమ్మేస్తున్నారు నెటిజన్స్.