BigTV English

Mecca Clock Tower : అందమైన ఆర్ట్ లా ఉంది పిడుగుపాటు..మక్కాలో వైరల్ గా మారిన వీడియో

Mecca Clock Tower : అందమైన ఆర్ట్ లా ఉంది పిడుగుపాటు..మక్కాలో వైరల్ గా మారిన వీడియో

Lightning strikes Mecca Clock Tower.. creating flower-like effect viral video: ఒక్కోసారి ప్రకృతి ప్రళయాలు కూడా అందంగా కనిపిస్తాయి. భయంకరమైన పిడుగు పాటు దృశ్యాలు సైతం చూడచక్కని పెయింటింగ్ ఆర్ట్ లా కనువిందు చేస్తాయి. ఇలాంటి విచిత్రాలు, వింతలు చూసినప్పుడు అద్భుత అనుభూతికి లోనవుతుంటారు. చూడలేని వారు అయ్యో తమకు ఎందుకు కలగలేదు ఈ అదృష్టం అని ఫీలవుతూ ఉంటారు. అవన్నీ ఒకప్పుడు..టెక్నాలజీ పెరిగిపోయిన ఈ రోజుల్లో ఇలాంటి అరుదైన దృశ్యాలను కెమెరాలు, వీడియోలలో బంధించి సోషల్ మీడియాలో పెడుతున్నారు. దీనితో అలాంటి సన్నివేశాలను చూడలేకపోయామని బాధపడేవారికి ఈ సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియోలు, పిక్చర్స్ చూసి ఆనందపరవశులవుతున్నారు. అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


మక్కాలో జరిగిన అద్భుతం

ప్రపంచంలోని ప్రతి ముస్లిం కూడా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా మక్కాకు వెళ్లాలని అనుకుంటారు. అది వారికి అత్యంత పవిత్రమైన స్థలం. ఒక్కసారి మక్కాకు వెళ్లి వచ్చినవారు ఇక జీవితంలో ఎలాంటి తప్పూ చేయకూడదని డిసైడ్ అయిపోతారు. సమాజంలో కూడా వారిని అందరూ గురువులుగా భావిస్తుంటారు. అయితే ఇటీవల మక్కా ప్రాంతంపై ప్రకృతి కన్నెర్ర చేసింది.తుఫాను ప్రభావంతో గత కొద్ది రోజులుగా అక్కడ వర్షాలు, గాలులతో బలమైన చెట్లు కూడా విరిగిపడిపోతున్నాయి. ఎక్కడ చూసినా తుఫానుకు అతలాకుతలమైన దృశ్యాలే కనిపిస్తున్నాయి. అయితే ఓ రాత్రి అక్కడ అద్భుతమైన దృశ్యం చోటుచేసుకుంది. ఓ పక్క గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులతో తుఫాను వాయుగుండం విరుచుకుపడుతోంది. ఉరుములు, మెరుపులు ప్రకృతి భీభత్సం ఏదో జరగబోతోందని సంకేతం ఇస్తున్నట్లుగా ఉంది పరిస్థితి. సరిగ్గా అర్థరాత్రి సమయం లో అక్కడ మక్కాలో ఉండే క్లాక్ టవర్ పై ఓ అద్భుత దృశ్యం కనిపించింది.


సుందర దృశ్యం

క్లాక్ టవర్ పై భాగం నుంచి ఆకాశం దిశగా ఎవరో ఆర్ట్ గీతలు గీసినట్లు మెరుపు మెరిచింది.ఎవరో చిత్రకారుడు చిత్రీకరించినట్లుగా కనిపించింది. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో కూడిన పిడుగు ఆ ప్రాంతంలో పడింది. అయితే ఆకాశంలో అద్భుతంగా జరిగిన ఈ ప్రక్రియను ఓ వ్యక్తి తన సెల్ ఫోన్ లో బంధించాడు. దానిని షేర్ చేయగానే ఆ వీడియో వైరల్ గా మారింది. క్షణాలలో 1.3 మిలియన్ కు పైగా నెటిజన్స్ వీక్షించడం జరిగింది. దీనితో ఈ వీడియోను తాము చూసిందిగాక ఇతరులకూ షేర్ చేసి ఆనందిస్తున్నారు మరికొందరు.

Related News

Google 27th Anniversary: గూగుల్ 27వ వార్షికోత్సవం.. తొలినాటి డూడుల్ తో సెర్చ్ ఇంజిన్ సర్ ప్రైజ్

Viral Video: ప్రియుడితో భార్య సరసాలు.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త!

Viral News: కొండ చివరలో ఆ పని చేస్తుండగా.. జారి లోయలో పడ్డ కారు, స్పాట్ లోనే..

Viral Video: వరదలో పాము.. చేపను పట్టుకొని జంప్.. వీడియో చూసారా?

Steel Spoons In Stomach: కడుపులో 29 స్టీల్ స్పూన్లు, 19 టూత్ బ్రష్ లు..అలా ఎలా మింగేశావ్ భయ్యా!

Bank Employee: అనారోగ్యంతో ఒక్క రోజు లీవ్ పెట్టిన బ్యాంకు ఉద్యోగి.. హెచ్ఆర్ నుంచి వార్నింగ్ మెయిల్

Indore Crime News: బ్రేకప్ చెప్పిందని బైక్‌తో ఢీ కొట్టిన యువకుడు, వీడియో వైరల్

Viral Video: బ్యాట్ తో కుర్రాళ్లు, లోకల్ ట్రైన్ లో ఆడాళ్లు.. గర్బా డ్యాన్స్ తో అదరగొట్టారంతే!

Big Stories

×