BigTV English

Flight Crash : ఈ ప్రకటనలో ఉన్నదే జరిగింది.. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన న్యూస్ పేపర్!

Flight Crash : ఈ ప్రకటనలో ఉన్నదే జరిగింది.. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన న్యూస్ పేపర్!

Flight Crash : కొన్ని చాలా వింతగా అనిపిస్తాయి. చాలా యాదృచ్ఛికంగా జరుగుతుంటాయి. నమ్మశక్యంగా అనిపించదు. అలాగని తీసి పడేయనూ లేము. అహ్మదాబాద్ విమాన ప్రమాదంకు సంబంధించి అలాంటిదే ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది చూస్తే.. అరే.. నిజంగానే అలానే జరిగిందిగా.. ఇంత పక్కాగా ఎలా మ్యాచ్ అవుతోందబ్బా.. అనిపిస్తుంది. ఇంతకీ అదేంటంటే…


జూన్ 12 మధ్యాహ్నం 1.39 గంటలకు అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే విమానం కుప్పకూలిపోయింది. సమీపంలోని బీజే మెడికల్ కాలేజ్ భవనంపై పడింది. విమాన భాగాలు ఆ బిల్డింగ్‌లోకి దూసుకెళ్లాయి. భవనం మొత్తం డ్యామేజ్ అయింది. మెస్‌లో లంచ్ చేస్తున్న డాక్టర్లు కొందరు చనిపోయారు. చాలామంది గాయపడ్డారు. ఫ్లైట్ క్రాష్‌తో పాటు మెడికల్ కాలేజ్ బిల్డింగ్ ఉదంతమూ విషాదాన్ని నింపింది. కట్ చేస్తే…

ఉదయమే పేపర్లో యాడ్..


అదే రోజు ఉదయమే గుజరాత్‌లో మిడ్ డే న్యూస్ పేపర్‌లో ఓ యాడ్ వచ్చింది. కిడ్ జానియా.. డాడ్స్ డే అవుట్.. అంటూ ఫాదర్స్‌ డే ఈవెంట్ సెలబ్రేషన్‌కు సంబంధించిన ప్రకటన అది. పిల్లలు, పెద్దలు.. షాపింగ్ చేసేందుకు, సరదాగా ఆడిపాడుతూ సమయం గడిపేందుకు, రెస్టారెంట్లు గట్రా ఉండే.. ప్లే జోన్ ఏరియా వేసిన యాడ్ అది. గుజరాత్, ముంబై ఎడిషన్స్‌లో ప్రచురితమైంది. ఆన్‌లైన్ ఎడిషన్స్ లోనూ వచ్చింది. అయితే, ఆ యాడ్‌లో ఉన్న ఓ ఇమేజ్ ఇప్పుడు అందరినీ అనుమానంగా చూసేలా చేస్తోంది. ఇంతకీ ఆ యాడ్‌లో ఉన్న ఆ ఇమేజ్ ఏంటంటే….

సేమ్ టు సేమ్ అలానే..

ఇద్దరు చిన్నపిల్లలు, ఓ ఫాదర్, షాపులు, జీపు.. ఫోటోలతో ఉందా ఇమేజ్. అందులో ఓ కార్నర్‌లో భవనం మధ్యలోంచి ఎయిర్ ఇండియా విమానం దూసుకొచ్చిన ఫోటో ఉంది. అదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ రచ్చకు కారణం. ఉదయం పేపర్లో యాడ్ వచ్చింది.. సేమ్ టు సేమ్ అలానే మధ్యాహ్నం విమానం బిల్డింగ్‌లోకి దూసుకెళ్లింది. అంటే.. ఆ యాడ్.. ఈ ప్రమాదం.. రెండింటికీ లింక్ ఏంటి? మరీ అంతగా కోఇన్‌సిడెంట్ అవ్వాలా? అంత పర్‌ఫెక్ట్‌గా ఎలా సింక్ అయింది? అనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది.

ఆ పేపర్ యాడ్.. ఈ విమాన ప్రమాదాన్ని ముందే ఊహించిందా? ఏదో అలా జరిగిపోయిందా? మరీ ఇంత టైమింగ్‌తో జరగాలా? బిల్డింగ్‌లోంచి విమానం వచ్చినట్టు అలానే ఫోటో ఎందుకు పెట్టాలి? పెట్టారే అనుకున్నా.. దానిపై ఎయిర్ ఇండియా విమానం అనే ఎందుకు రాసుండాలి? ఏ ఇండిగో ఫ్లైటో, స్పైస్ జెట్ ఫ్లైట్ ఫోటోనో పెట్టి ఉండొచ్చుగా? ఆ యాడ్ ఇచ్చిన రోజే.. నిజంగా విమాన ప్రమాదం జరగాలా? జరిగిందే పో.. అచ్చం ప్రకటనలో ఉన్నట్టుగానే విమానం బిల్డింగ్‌లోకి దూసుకెళ్లాలా? ఇదంతా కాకతాళీయంగా జరిగిందని భావించాలా? ఏదో అదృశ్య శక్తి ముందస్తు హింట్ ఇచ్చిందని అనుకోవాలా? అసలేం అర్థం కావట్లేదంటూ సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. నెటిజన్ల అటెన్షన్ డ్రా చేస్తోంది.

Related News

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Big Stories

×