Singer Mangli: టాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్ మంగ్లీ (Singer Mangli)పెద్ద ఎత్తున వివాదంలో చిక్కుకున్నారు. ఈమె తన పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని త్రిపురా రిసార్ట్ లో పెద్ద ఎత్తున పుట్టినరోజు వేడుకలను(Birthday Celebrations) జరుపుకున్నారు. ఇక ఈ పుట్టిన రోజు వేడుకలలో తన కుటుంబ సభ్యులు స్నేహితులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పుట్టినరోజు వేడుకలలో భాగంగా డ్రగ్స్ ఉపయోగించినట్లు పోలీసులకు సమాచారం రావడంతో వెంటనే పోలీసులు ఈ రిసార్ట్ పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ ఘటన గురించి మంగ్లీ కూడా ఒక వీడియో విడుదల చేస్తూ అక్కడ తప్పు ఏమి జరగలేదని కుటుంబ సభ్యుల సమక్షంలోనే నా పుట్టినరోజు వేడుకలు జరిగాయి అంటూ చెప్పుకు వచ్చారు.
అనుమతి తీసుకోవాలని తెలియదు…
తాజాగా సింగర్ మంగ్లీ ఓ మీడియా ఛానల్ కు ఫోన్ కాల్ ద్వారా మాట్లాడారు. రిసార్ట్ లో జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈమె క్లుప్తంగా వివరించారు. తాను తన తల్లిదండ్రుల కోరిక మేరకే పుట్టినరోజు వేడుకలను అక్కడ జరుపుకున్నానని వెల్లడించారు. అయితే ముందుగా ప్లాన్ చేసింది కాదని, అప్పటికప్పుడు అనుకోవటం వల్ల త్రిపుర రిసార్ట్ లో ఈ వేడుకను నిర్వహించాము. ఇలా పార్టీ చేసుకోవాలంటే కూడా అనుమతి తీసుకోవాలని మద్యం వాడటానికి డీజే సౌండ్ పెట్టుకోవడానికి కూడా అనుమతి తీసుకోవాలని నాకు ఎలాంటి అవగాహన లేదని తెలిపారు.
పోలీసులు దాడి చేశారు..
నా పుట్టినరోజున రాత్రి 7 గంటలకు రిసార్ట్ కి వెళ్ళామని, తొమ్మిది గంటలకు బర్త్ డే సెలబ్రేషన్స్ మొదలయ్యాయి, 12 గంటలకు పూర్తి అయ్యాయని తెలిపారు. 12:30 కు పోలీసులు కొంతమంది నార్మల్ డ్రెస్ లో వచ్చి వీడియో తీస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి నాది ఎవరైనా విష్ చేయడానికి ఇలా సర్ప్రైజ్ గా ప్లాన్ చేశారా ఏంటి? అనేది అర్థం కాలేదని మంగ్లీ తెలిపారు. అక్కడికి తాను పోలీసులతో మాట్లాడుతున్న వారు వినిపించుకోలేదని ఈమె ఆవేదన చెందారు. ఇలా అక్కడ ఏమి తప్పు జరగకపోయినా తప్పు జరిగిందని చిత్రీకరిస్తూ పెద్ద ఎత్తున ఈ వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారని ఇది ఉద్దేశపూర్వకంగా నాపై కుట్ర చేశారని కొంతమంది నా గొంతు నొక్కేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన చెందారు.
కుట్ర చేశారు..
ఇలా మంగ్లీ అక్కడ జరిగిన విషయాల గురించి చెప్పడంతో మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు ఎన్నో ప్రైవేట్ పార్టీలకు వెళ్లి ఉంటారు. కనీసం పర్మిషన్ తీసుకోవాలని తెలియకపోవడం ఏంటి? పోలీసులు రాగానే వెళ్లి బాత్రూంలో దాక్కోవడం ఏంటి అనే ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. తాను ఎప్పుడు ప్రైవేటు పార్టీలకు వెళ్లలేదని కేవలం సినిమా ఈవెంట్లకు మాత్రమే వెళ్లేదానిని నిజంగా నాకు అవగాహన ఉంటే కచ్చితంగా పర్మిషన్ తీసుకునే దాన్ని అని తెలిపారు. ఇక పోలీసులు ఒక్కసారిగా రైడ్ చేయడంతో అలా బాత్రూంలో దాక్కోవాల్సి వచ్చింది. అక్కడ ఏమి తప్పు జరగలేదు కానీ తన ఫోటోలు బయటకు వస్తే తన కెరియర్ పై కూడా దెబ్బ పడుతుందని మంగ్లీ తెలిపారు. అయితే మేమేం తప్పు చేయకపోయినా కొంతమంది ఉద్దేశపూర్వకంగానే నాపై ఇలా నెగెటివిటీని స్ప్రెడ్ చేశారు అంటూ మంగ్లీ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సంచలనగా మారాయి