Air India Passenger: అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో మొత్తం 242 మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో పలువురు స్థానికులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులందరినీ అహ్మదాబాద్ లోని హాస్పిటల్ కు వెల్లడించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేట్ పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.
ప్రయాణీకుడు చెప్పిందే నిజమైంది!
నిజానికి ప్రమాదానికి గురైన విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ కు వచ్చింది. ఈ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళ్లాల్సి ఉంది. అయితే, ఢిల్లీలో విమానం ఎక్కిన ప్రయాణీకుడు ఈ విమానంలో ఏదో తేడాగా ఉందంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. విమానంలోని ఏసీలు పని చేయడం లేదన్నాడు. కనీసం సీటుకు ఉండే స్క్రీన్లు కూడా పని చేయడం లేదని ఆ వీడియోలో వెల్లడించాడు. విమానంలో ఏదో సమస్యగా ఉన్నట్లు ఆయన అనుమానం వ్యక్తం చేశాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలు షేర్ చేసిన ప్రయాణీకుడు అహ్మదాబాద్ లో దిగినట్లు తెలుస్తోంది.
I was in the same damn flight 2 hours before it took off from AMD. I came in this from DEL-AMD. Noticed unusual things in the place.Made a video to tweet to @airindia i would want to give more details. Please contact me. @flyingbeast320 @aajtak @ndtv @Boeing_In #planecrash #AI171 pic.twitter.com/TymtFSFqJo
— Akash Vatsa (@akku92) June 12, 2025
అహ్మదాబాద్ నుంచి బయల్దేరిన కాసేపటికే..
అటు ఈ విమానానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేసిన కాసేపటికే, విమానం బయల్దేరింది. ఆ తర్వాత కాసేపటికే ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదం జరగడంతో పెద్ద పేలుడు సంభవించింది. ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ నుంచి 230 మంది ప్రయాణికులతో లండన్ లోని గాట్విక్ ఎయిర్ పోర్ట్ కు వెళ్లాల్సి ఉంది. మధ్యాహ్నం 1.38 నిమిషాలకు విమానం టేకాఫ్ అయిన ఒక నిమిషం తర్వాతే ప్రమాదానికి గురైంది. విమానంలో భారతీయులు ఎక్కువ మంది ఉండగా, 53 మంది బ్రిటన్ వాసులు ఉన్నారు. ఏడుగురు పోర్చుగల్, ఒకరు కెనడా పౌరుడు ఉన్నట్టు గుర్తించారు. ఇద్దరు శిశువులు సహా 13 మంది చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా చనిపోయారు.
Read Also: విమాన ప్రమాదానికి కారణం ఇదే! 300 కిమీల వేగంతో.. అంతలోనే.. షాకింగ్ నిజాలు
ఈ ఘటనలో ఇద్దరు పైలెట్లు, 10 మంది సిబ్బంది సహా మొత్తం 242 మంది విమానంలో ఉన్నట్లు ఆధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని అహ్మదాబాద్ సీపీ ప్రకటించారు. ఈ ఘటనపై విదేశాంగశాఖ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అటు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై ఆరా తీశారు.
Read Also: అయ్యో దేవుడా.. ముక్కలైన విమానం.. చెల్లా చెదురైన శరీర భాగాలు