BigTV English

Maharastra:ఈ ఆటోవాలా మామూలోడు కాదు..అతని స్కిల్ కు అంతా ఫిదా

Maharastra:ఈ ఆటోవాలా మామూలోడు కాదు..అతని స్కిల్ కు అంతా ఫిదా

Maharastra English speaking auto driver vedio viral 


మనకు నిత్యం సామాజిక మాధ్యమాలలో చాలా వైరల్ వీడియోలు కనిపిస్తుంటాయి. వాటిల్లో కొన్ని వెగలు పుట్టించే వి కొన్నయితే మరికొన్ని ఆలోచింపజేసేవిగా ఉంటాయి. వాటిల్లో మనకి నచ్చిన వీడియోలను వెంటనే ఇతరులకు షేర్ చేస్తుంటాము. సోషల్ మీడియా లో మనసుకు నచ్చిన కొన్ని వీడియోలు చాలా తొందరగా ట్రెండింగ్ అవుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఇలాంటిదే ఓ వీడియో మహారాష్ట్ర లోని ఓ ఆటోడ్రైవర్ కు సంబంధించినది బాగా వైరల్ అవుతోంది. అంతలా ఆకట్టుకుంటున్న ఆ వీడియో ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారా? ఇంతకీ ఆ ఆటోవాలాకు ఉన్న టాలెంట్ ఏమిటి? అతనికి ఉన్న ప్రత్యేకత ఏమిటి?

ఆటోవాలా ఇంగ్లీష్


సాధారణంగా ఆటో డ్రైవర్లు ఎక్కువగా మాట్లాడరు. ప్రయాణికులను గమ్యానికి చేర్చడం వారు ఇచ్చిన డబ్బులు తీసుకోవడం అంతకు మించి పెద్దగా ఆలోచించరు. అయితే మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతానికి చెందిన ఓ ఆటోడ్రైవర్ తన ఆటో ఎక్కిన ప్రయాణికులకు ఇంగ్లీష్ లో మాట్లాడాలని సలహాలు ఇస్తున్నాడు. అంతేకాదు ఇంగ్లీష్ లో అద్భుతంగా మాట్లాడేస్తున్నాడు. అతని వాగ్దాటికి అంతా ఫిదా అయిపోతున్నారు. విదేశీయుల స్టయిల్ లో ఈ ఆటోవాలా ఇంగ్లీష్ మాట్లాడటం చూసి నెటిజన్లు అంతా నోరెళ్లబెడుతున్నారు. అయితే అతని టాలెంట్ ను ఎలాగైనా ఈ ప్రపంచానికి చాటి చెప్పాలని భావించారు అతనితో ప్రయాణించే కస్టమర్. ఆటోవాలా మాట్లాడిన ఇంగ్లీష్ ను వీడియో తీసి దానిని కాస్తా ఇన్ స్టా లో పెట్టేశాడు. ఇంకేముంది క్షణాలలో ఆ వీడియోకు తెగ లైకులు, షేర్లు వచ్చాయి.

భాషపై పట్టు

ఆటోవాలా ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడటమే కాదు అందరికీ సలహాలు కూడా ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరూ ఆంగ్ల భాషపై పట్టు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. పైగా ఆంగ్ల మాధ్యమం పై ఇలా అంటున్నాడు ఆటోవాలా ‘మీరంతా నేను చెప్పే విషయం చాలా శ్రద్ధగా వినండి..మీరు ఇంగ్లీష్ భాషను బాగా నేర్చుకుని దానిపై పట్టు సాధించినట్లయితే మీరు కూడా అమెరికా, లండన్, ప్యారిస్ వంటి దేశాలు వెళ్లవచ్చు. అక్కడ ఏదైనా ఉద్యోగావకాశాలు వస్తే హ్యాపీగా చేసుకోవచ్చు’అయితే చూపులకు పల్లె ప్రాంతం నుంచి వచ్చిన ఈ ఆటోవాలను చూస్తే ఎడ్యుకేటెడ్ అని ఎవరూ అనుకోరు.

మెడిసిన్ చదివి..

మనం చూసేదానికి, అర్థం చేసుకోవడానికి చాలా తేడా ఉందని ఈ ఆటోవాలా ను చూస్తే అర్థమవుతుంది. ఆటోవాలా నాగపూర్ ప్రాంతంనుంచి వచ్చానని చెప్పాడు. పైగా మెడిసిన్ చదివానని చెబుతున్నాడు. మెడిసిన్ లాంటి చదువులు చదివి కూడా ఏ మాత్రం సంశయించకుండా పొట్టకూటికోసం ఆటో నడుపుకుంటున్న ఈ ఆటోవాలా సింప్లిసిటీకి హ్యాట్సాఫ్ అంటున్నారు నెటిజన్లు. ఆటోవాలా జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకంగా ఉందంటూ కితాబు ఇస్తున్నారు. అయితే ఈ ఇన్ స్టాగ్రామ్ వీడియోలో పోస్ట్ చేసిన వ్యక్తి ఆటోవాలా గురించి ఇలా చెప్పుకొచ్చాడు. ‘ఇవాళ నేను ఓ ఆటోవాలాను కలిశాను. ఆయనతో కలిసి సరదాగా చిట్ చాట్ చేశాను. నాగున్న పరిజ్ణానంతో ఇంగ్లీష్ లో అతనితో చాటింగ్ మొదలుపెట్టాను. ఏకధాటిగా ఆటోవాలా మాట్లాడే ఇంగ్లీష్ చూసి ఆశ్చర్యపోయాను. ఆయన ఆంగ్ల పరిజ్ణానం చూసి మీరు కూడా స్ఫూర్తిని పొందుతారు‘ అంటూ పోస్ట్ పెట్టాడు.

Tags

Related News

Himachal Pradesh News: మేనల్లుడుతో మేనత్త ఓయోలో కస్సమిస్సా.. ట్విస్ట్ ఏంటంటే..

Dinosaur Condom: డైనోసార్ కండోమ్.. రాయిని బద్దలకొడితే ఇది బయటపడింది, సైజ్ ఏంటీ సామి అంత ఉంది?

Viral video: రీల్స్ కోసం రైల్వే ట్రాక్‌పై రిస్క్ చేసిన దంపతులు.. దూసుకొచ్చిన వందే భారత్!

Woman Sprays Pepper: ప్రయాణికుల కళ్లల్లో పెప్పర్ స్ప్రే కొట్టిన మహిళ.. అలా ఎందుకు చేసిందంటే?

Viral News: బాల భీముడు మళ్లీ పుట్టాడు, బరువు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Software Engineer Journey: సెక్యూరిటీ గార్డ్ To సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్.. ఆకట్టుకునే జోహో ఎంప్లాయీ సక్సెస్ స్టోరీ!

Viral News: ఎంతకొట్టినా చావడం లేదని.. నోటితో కొరికి పాముని చంపేశాడు, వింత ఘటన ఎక్కడ?

Nose Drinks Beer: ఓరి మీ దుంపలు తెగ.. ముక్కుతో బీరు తాగడం ఏంటి?

Big Stories

×