BigTV English

ICC T20I Batting Ranking: టీ20 ర్యాంకింగ్ టాప్-10లో సూర్యకుమార్, రుతురాజ్, శ్రీలంక‌, కివీస్‌లకు షాక్

ICC T20I Batting Ranking: టీ20 ర్యాంకింగ్ టాప్-10లో సూర్యకుమార్, రుతురాజ్, శ్రీలంక‌, కివీస్‌లకు షాక్

ICC T20I Batting Rankings(Sports news headlines): టీ 20 ప్రపంచ ర్యాంకింగ్‌లో భారత స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ సెకండ్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఇక ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్‌హెడ్ తొలి స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. టీమిండియా మరో ఆటగాడు రుతురాజ్ తన ఆట తీరును మెరుగుపరుచుకుని ఏడో స్థానానికి ఎగబాకాడు.


టీ 20 ప్రపంచకప్ ముగిసింది. వెంటనే ఐసీసీ బ్యాటింగ్‌లో ఆటగాళ్ల ర్యాంకింగ్‌ జాబితాను విడుదల చేసిం ది. బలమైన జట్టుగా పేరుపొందిన ఆస్ట్రేలియా నుంచి కేవలం ఒకే ఒక్క ఆటగాడికి ఛాన్స్ లభించింది. అదీ కూడా ట్రావిస్‌హెడ్ ఫస్ట్ ప్లేస్ సంపాదించుకున్నాడు. మిగతా ఆటగాళ్లు టాప్-10లో స్థానం లభించ లేదు.

టాప్-10లో ఇండియా నుంచి ముగ్గురు, ఇంగ్లాండ్, వెస్టిండీస్, పాకిస్థాన్ నుంచి ఇద్దరేసి ఆటగాళ్లకు ఛాన్స్ లభించింది. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా నుంచి ఒక్కరికి మాత్రమే స్థానం లభించింది. ఇక శ్రీలంక, న్యూజిలాండ్‌, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లకు ఆ ఛాన్స్ లభించలేదు.


ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ తొలిస్థానం నిలబెట్టుకోగా, సెకండ్ ప్లేస్‌లో టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్, మూడో స్థానంలో ఇంగ్లాండ్ ఫిల్ సాల్ట్ నిలిచారు. ఇక నాలుగైదులో బాబర్ అజమ్, రిజ్వాన్ సరిపెట్టుకున్నారు.

ఆరో స్థానంలో ఇంగ్లాండ్ ఆటగాడు జాస్ బట్లర్, ఏడు స్థానానికి టీమిండియా ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ ఏడో ప్లేస్‌కు ఎగబాకాడు. గతంలో 13 స్థానంలో ఉండగా ఆటతీరును మెరుగు పరుచుకున్నాడు రుతురాజ్. ఎనిమిది, తొమ్మిదిలో వెస్టిండీస్ ఆటగాళ్లు, బ్రాండన్‌ కింగ్, జాన్సన్ ఛార్లెస్ నిలిచారు. పదో ప్లేస్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు మార్క్‌రామ్, టీమిండియా ఆటగాడు జైశ్వాల్ కొనసాగుతున్నారు. గతంలో జైశ్వాల్ ఏడో ప్లేస్‌లో ఉండగా, తాజా ర్యాంకింగ్స్‌లో పదికి పడిపోయాడు.

ALSO READ: లోకం అంతా ఒకవైపు.. పాండ్యా ఒక్కడూ ఒకవైపు

బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో అక్షర్‌‌పటేల్‌- 9, కుల్‌దీప్‌ యాదవ్‌-11, బుమ్రా-14వ స్థానాల్లో కొనసాగుతున్నారు. ఆల్‌రౌండర్ జాబితాలో శ్రీలంకకు చెందిన హసరంగా ఫస్ట్ ప్లేస్ కాగా, సెకండ్‌లో హర్థిక్‌పాండ్యా ఉన్నాడు.

Related News

Virender Sehwag :ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో వేలు పెట్టిన సెహ్వాగ్.. ఆడుకుంటున్న ఫ్యాన్స్

AB de Villiers : RCB కోసం రంగంలోకి ఏబీ డివిలియర్స్.. సరికొత్త రోల్ ఫిక్స్.. ఇక ఫ్యాన్స్ కు పండగే

Michael Clarke Cancer: మైఖేల్ క్లార్క్ కు క్యాన్సర్… ముక్కు కట్ చేసి మరీ ట్రీట్మెంట్

Ravichandran Ashwin: ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్.. ధోని టార్చర్ తట్టుకోలేకే !

Sanju Samson : ఒకే బంతికి 13 పరుగులు కొట్టిన సంజూ.. చరిత్రలోనే తొలిసారి

Swastik Chikara’s father: నా కొడుకు క్రికెట్ ఆడకున్నా పర్వాలేదు… కోహ్లీకి నీళ్లు ఇచ్చి బతికేస్తాడు

Big Stories

×