Man Without Clothes In Train| లోకల్ ట్రైన్‌లో ఒక యువకుడు పూర్తిగా బట్టలు విప్పేసి వచ్చాడు. పైగా అతను ఎక్కింది మహిళల కంపార్ట్‌మెంట్. ఆ యువకుడిని చూసి మహిళలంతా ఆందోళనకు గురయ్యారు. అతడిని ఎంతగా బయటికి వెళ్లమని చెప్పినా అతను ఏమీ పట్టనట్లు నిలబడుకున్నాడు. ఈ ఘటన ముంబై నగరంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ముంబై నగరంలోని ఘాట్ కోపర్ రైల్వే స్టేషన్ డిసెంబర్ 16 సోమవారం సాయంత్రం 4 గంటలకు కల్యాణ్ ప్రాంతానికి వెళుతున్న లోకల్ ట్రైన్ ప్లామ్ ఫామ్‌పై వచ్చి ఆగింది. ఈ లోకల్ ట్రైన్ లో సరిగ్గా సాయంత్రం 4.11 గంటలకు ట్రైన్ లోని లేడీస్ కంపార్ట్‌మెంట్ లో ఒక యువకుడు అనుకోకుంగా ప్రవేశించాడు. ఆ యువకుడి ఒంటిపై ఎటువంటి వస్త్రాలు లేవు. దీంతో అతడిని చూసిన మహిళలందరూ వెంటనే దిగిపోమని చెప్పారు. అయినా అతను ఏమీ పట్టనట్లు అలా నిలబడి అందరినీ చూస్తున్నాడు. కిందికి దిగడానికి నిరాకరించాడు. ఇంతలో ట్రైన్ కదిలి ముందుకు సాగిపోయింది.
ఈ క్రమంలో కొందరు మహిళలు కేకలు వేస్తుండగా.. ఒకరిద్దరు ట్రైన సిబ్బందిని పిలిచేందుకు ప్రయత్నించారు. ఇంతలో అక్కడికి మహిళల అరుపులు విని మోటర్ మెన్ ట్రైన్‌ని నిలిపివేశాడు. ఆ ట్రైన్ మెల్లగా ఛత్రపతి శివాజీ టర్మినస్ లో ఆగింది. పక్క బోగీలో ఉనన ట్రైన్ టిసి విషయం తెలుసుకొని అక్కడికి పరుగెత్తుకొని వచ్చాడు. ఆ యువకుడిని దిగిపోమని చెప్పినా.. అతను వినలేదు. దీంతో ఆ వస్త్రాలు లేని యువకుడిని టిసి బలవంతంగా ట్రైన్ నుంచి కిందకు తోసేశాడు. ఆ యువకుడు ప్లాట్ ఫామ్ పై కింద పడ్డాడు.
Also Read: ఎడారిలో చిక్కుకున్నారా?.. భయమెందుకు స్పెషల్ ఊబర్ సవారీ మీ కోసం!
ఇదంతా బోగీలో కూర్చొని ఉన్న ఒక మహిళ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. వీడియోలో యువకుడు బోగీలో బట్టలు లేకుండా ప్రవేశించి ద్వారం వద్దనే నిలుచున్నాడు. మహిళల అరుపులు వినిపిస్తున్నాయి. కొద్ది సేపటి తరువాత ట్రైన్ టిసి వచ్చి బలవంతంగా అతడిని కిందికి దించాడు.
యువకుడు ఒక మానసిక రోగి
ట్రైన్ లో వస్త్రాలేమీ ధరించకుండా కనిపించిన యువకుడి గురించి రైల్వే సిబ్బంది మాట్లాడుతూ.. ఆ యువకుడా ఒక పిచ్చోడు. అతని మానసిక ఆరోగ్యం సరిగా లేదు. అతడిని రైల్వే పోలీసులు తీసుకెళ్లారు. అతడికి బట్టలు ధరింప చేసి.. స్టేషన్ బయట కూర్చో బెట్టారు. అయితే ఈ ఘటనపై రైల్వే స్టేషన్ల్ లో భద్రతా సిబ్బంది పనితీరుపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఒక వ్యక్తి అనాగరికంగా రైల్వే స్టేషన్ లో బట్టలు విప్పేసి తిరుగుతుంటే రైల్వే పోలీసులు, భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారని? ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.
చైనాలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. జూన్ 2024లో ఒక ప్రయాణికుడు మద్యం సేవించి సాటి కంపార్ట్ మెంట్ లో ఒంటరిగా ఉన్న మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆ మహిళ రైల్వే సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్టు చేసి అయిదు రోజుల పాటు జైలు శిక్ష విధించారు.
Mumbai Local Viral Video, naked man in mumbai local train pic.twitter.com/kjTGnnCkyd
— Chinmay jagtap (@Chinmayjagtap18) December 17, 2024