Prabhas Salaar OTT.. సాధారణంగా ఏ సినిమా అయినా సరే థియేటర్లలో విడుదలైన 8 వారాలకు ఓటీటీ ప్లాట్ఫారం లోకి వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఓటీటీ ప్రియులను కూడా ఆ సినిమా మెప్పించాల్సిందే. ఒకవేళ అక్కడ రేటింగ్ రాకపోతే మాత్రం వెంటనే ఆ సినిమా స్థానంలో ఇంకో సినిమా వేసేస్తూ ఉంటారు నిర్వాహకులు. అయితే ప్రభాస్ (Prabhas)మూవీ మాత్రం ఏకంగా రూ.300 రోజులుగా నిర్విరామంగా ప్రేక్షకులను అలరిస్తూ సరికొత్త రికార్డు సృష్టించింది. అంతేకాదు ఈ రికార్డు చూసిన నెటిజన్స్ సైతం ఈ రికార్డు కేవలం ప్రభాస్ కి మాత్రమే సాధ్యం అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సలార్ తో సరైన సక్సెస్..
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయిన రెబల్ స్టార్ ప్రభాస్.. వరుస పెట్టి పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే తన సినిమాలను పాన్ ఇండియా వైడ్ గా విడుదల చేస్తున్నారు. కానీ ఆ సినిమాలు అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. దీనికి తోడు ఆయన నటించిన ప్రతి సినిమా కూడా డిజాస్టర్ గానే మిగిలింది. ఉదాహరణకు బాహుబలి 2 తర్వాత ‘సాహో’, ‘రాధేశ్యామ్’ సినిమాలు చేశారు.కానీ సక్సెస్ కాలేదు.ఆ తర్వాత కేజీఎఫ్ సీరీస్ లతో కన్నడ పరిశ్రమకు ఒక్కసారిగా పాన్ ఇండియా గుర్తింపు తీసుకొచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel)దర్శకత్వంలో సలార్(Salaar)సినిమా చేశారు.అటు చాలాకాలం పాటు సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్ కి సలార్ సినిమా మంచి ఊరట ఇచ్చింది. ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన సలార్..
ఇకపోతే ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ సుమారుగా రూ.320 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. జనవరి 20 నుండి స్ట్రీమింగ్ అయింది. అయితే అనుకోకుండా ఈ సినిమా అక్కడ టిఆర్పి రేటింగ్స్ సొంతం చేసుకోలేదు. కానీ ఇప్పటికీ నడుస్తోందని చెప్పాలి. అయితే మరోవైపు ఈ సినిమా హిందీ ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 16 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఇప్పటివరకు కూడా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో హిందీ వర్షన్ లో ప్రసారమవుతూ ప్రేక్షకులను అలరిస్తోంది. దీన్నిబట్టి చూస్తే దాదాపు 300 రోజులుగా నిర్విరామంగా ప్రేక్షకులను అలరిస్తూ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది సలార్. ఏది ఏమైనా ప్రభాస్ సలార్ మూవీ సరికొత్త రికార్డు సృష్టించిందని చెప్పవచ్చు.
సలార్ సినిమా విశేషాలు..
సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా విడుదలై, మంచి విజయం అందుకుంది. హోం భలే ఫిలిమ్స్ పతాకం పై విజయ్ కిరంగదూర్ ఈ సినిమాను నిర్మించారు. రూ.200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.800 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇందులో మధు గురుస్వామి, ఈశ్వరీ రావ్, జగపతిబాబు, పృధ్వీరాజ్ సుకుమారన్, శ్రియా రెడ్డి, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు కీలకపాత్రలు పోషించారు.