Viral News : టైటిల్ చూసి ఉలిక్కిపడకండి. మీరు చదివింది నిజమే. ఈ న్యూస్ నిజంగా నిజమే. మగవారి హక్కుల కోసం ఢిల్లీలో సత్యాగ్రహ దీక్షకు కదం తొక్కింది పురుష సమాజం. మహిళలకు ప్రత్యేకంగా మహిళా కమిషన్ ఉన్నట్టే.. పురుషులకు కూడా ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలనేది వాళ్ల డిమాండ్. అందుకే చలో ఢిల్లీ అంటూ.. రాజధాని రైల్ ఎక్కారు కరుడుగట్టిన మగజాతి హక్కుల కార్యకర్తలు. ఫ్లెక్సీ చేతబట్టి.. గట్టిగా స్లోగన్స్ ఇస్తూ.. హస్తినకు బయలు దేరారు. శనివారం, ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిరసన ప్రదర్శన, ధర్నా చేయనున్నారు. ఆసక్తి ఉన్న మగవారు ఎవరైనా ఈ కార్యక్రమానికి హాజరుకావొచ్చు. తమ సపోర్ట్ తెలియజేయవచ్చు.
పురుష కమిషన్ కోసం డిమాండ్
సేవ్ ఇండియన్ ఫ్యామిలీ మూమెంట్. వైజాగ్ కేంద్రంగా పని చేస్తోంది. ఏదో టైంపాస్ నినాదాలకు, మీటింగులకే పరిమితం కాలేదు ఈ గ్రూప్. మగవారి హక్కుల కోసం గట్టిగా పోరాడుతోంది. మహిళల వేధింపుల నుంచి మగజాతిని కాపాడేందుకు.. ప్రత్యేకంగా పురుష కమిషన్ కావాలని పంతం పట్టింది. తమ డిమాండ్ కేంద్ర ప్రభుత్వానికి తెలిసిరావాలంటే.. ఎక్కడో వైజాగ్‌లో ధర్నాలు చేస్తే సరిపోదని భావించారు. అందుకే నేరుగా ఢిల్లీలోనే తేల్చుకుందామని.. జంతర్ మంతర్ దగ్గర దీక్షకు దిగబోతున్నారు. పోరాడితే పోయేదేమి లేదు బ్రో.. మహిళల టార్చర్ నుంచి విముక్తి తప్ప.. అంటున్నారు.
హి టీమ్స్ కావాలంటూ పోరాటం
ఈ మధ్య ఇలాంటి నినాదాలు, పోరాటాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవలే.. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ దగ్గర కూడా ఇలాంటి ధర్నానే జరిగింది. షీ టీమ్స్ తరహాలో.. HE TEAMS ఏర్పాటు చేయాలంటూ ఆర్జే శేఖర్ బాషాతో పాటు పలువురు అడ్వకేట్లు, భార్యా బాధిత సంఘాల ప్రతినిధులు దీక్ష చేశారు. మగవారికి జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలని.. మహిళల వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని వారంతా ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. 498A తదితర బలమైన సెక్షన్లతో.. మగవారిని అనవసరంగా కేసుల్లో ఇరికించి ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు.
Also Read : ప్రపంచమంతా మస్క్ పిల్లలు? మనోడు మంచి ఆటగాడే..
మగవారికి రక్షణ ఏది?
మగవారిపై ఇటీవల దారుణాలు మరీ ఎక్కువవుతున్నాయి. భర్తను చంపిన భార్య ఉదంతాలు పెరిగిపోతున్నాయి. మీరట్‌లో భర్తను చంపేసి.. డెడ్ బాడీని ముక్కలుగా కట్ చేసి.. డ్రమ్ములో వేసి కాంక్రీట్ పోసిన ఘటన తెలిసి మగజాతి ఉలిక్కిపడింది. ఎక్కడో మీరట్ అనే కాదు. తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని.. పెరుగన్నంలో విషం పెట్టి భర్తను చంపాలని చూసిందో భార్య. ఇక వైఫ్ టార్చర్ భరించలేక సెల్ఫీ వీడియోలు పెట్టి సూసైడ్ చేసుకుంటున్న మగవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పెళ్లైన వాళ్లే కాదు.. ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసే యువతుల సంఖ్య ఎక్కువే. అందుకే, కేవలం ఆడవారికే కాదు.. మగవారికీ రక్షణ కావాలని.. అందుకోసం ప్రత్యేక పురుష కమిషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఢిల్లీ పయనమయ్యారు వైజాగ్‌కు చెందిన సేవ్ ఇండియన్ ఫ్యామిలీ మూమెంట్ సభ్యులు. ఇలాంటి ఉద్యమాలు, పోరాటాలు ఇంకా పెద్ద ఎత్తున రావాలని కోరుకుంటోంది పురుష సమాజం.
మగవారి హక్కుల కోసం..
రేపు డిల్లీలో నిరసన చేయబోతున్నారు.
మహిళలకు కమిషన్ ఉన్నట్టే… పురుష కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. #Delhi #MensCommission #WomensCommission #BIGTVCinema pic.twitter.com/K6gGk3tFYI— BIG TV Cinema (@BigtvCinema) April 18, 2025