Ispl t10 League : టీ10 టెన్నిస్ బాల్ ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ గత ఏడాది ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే వాస్తవానికి ఈ లీగ్ లో మ్యాచ్ లు చాలా ఆసక్తికరంగా సాగుతుంటాయి. క్రికెట్ థ్రిల్‌ను వీధుల నుంచి స్టేడియం వరకు తీసుకురావడానికి సీసీఎస్ స్పోర్ట్స్ ఎల్ఎల్‌పీ దేశంలో మొట్టమొదటి సారిగా ఈ టోర్నీకి శ్రీకారం చుట్టింది. ఇక విచిత్రం ఏంటంటే.. ఒక బంతిని బౌలర్ వేయగా.. బ్యాట్స్ మెన్ బలంగా కొట్టాడు. అది స్టేడియంలో ఒక స్టెప్ పడి.. పోర్ లైన్ అవుతల ఫీల్డర్ స్టేడియంలోకి విసిరాడు. అయితే అది ఫోరా లేక కాదా..? అనేది సందిగ్దం లో ఉండటం.. ఫీల్డింగ్ కి సంబంధించిన వీడియో చూస్తే.. మాత్రం నవ్వు ఆపుకోలేరు.
Also Read : Travis head – Rohit Sharma: రోహిత్ ఏమైనా నీ లవర్ ఏంట్రా… ట్రావిస్ హెడ్ పై ట్రోలింగ్
అలా ఫోర్ లైన్ నుంచి బౌలర్ కి వేయగా.. బౌలర్ ఆ బాల్ ని బ్యాట్స్ మెన్ పరుగులు తీస్తుంటే.. వికెట్లకి విసిరివేయడంతో మళ్లీ ఫోర్ లైన్ కి తాకింది. ఒక్క బాల్ కి ఏకంగా 8 రన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇలా కూడా ఫీల్డింగ్ చేస్తారా..? అంటూ సోషల్ మీడియాలో చర్చించుకోవడం విశేషం. హైదరాబాద్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ), ముంబై (మహారాష్ట్ర), బెంగళూరు (కర్ణాటక), చెన్నై (తమిళనాడు), కోల్‌కతా (పశ్చిమ బెంగాల్), శ్రీనగర్ (జమ్మూ, జమ్మూ- కాశ్మీర్) జట్లు ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్‌లో భాగస్వామ్యం కానున్నాయి. తమ కలల స్టేడియంలో క్రికెట్ ఆడాలనుకునే ఎంతో మంది ప్రతిభావంతుల కలను నిజం చేయడం, స్ట్రీట్ – స్టేడియం మధ్య అంతరాన్ని తగ్గించాలనేది ఈ లీగ్ లక్ష్యంగా చెబుతున్నారు. ఆటగాళ్లు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు ఇది ఓ వేదిక కానుంది.
గల్లీల్లో క్రికెట్ ఆడే క్రీడాకారులకు ఇది అద్భుతమైన అవకాశంగా చెప్పవచ్చు. ఇందులో ప్రతిభ కనబరిచిన వారికి రంజీ మ్యాచ్ లలో ఛాన్స్ వస్తుంటుంది. అక్కడి నుంచి ప్రతిభ కనబరిస్తే.. మంచి టాలెంట్ ఉన్న క్రీడాకారులకు టీమిండియాలో కూడా ఆడే అవకాశం ఉంటుంది. అనుభవజ్ఞులైన రంజీ ట్రోఫీ ఆటగాళ్ల నుంచి అమూల్యమైన సలహాలను కూడా అందుకోవచ్చునన్నారు. ఈ మెంటర్‌షిప్ అవకాశం ఆటగాళ్ళలో నైపుణ్యాలను, ఆటపై అవగాహన పెంచడం, క్రికెట్ ప్రపంచంలో వారి భవిష్యత్తు విజయానికి మార్గాన్ని సృష్టించనుందని చెప్పారు. క్రికెట్ లో చాలా వరకు ఎక్కువగా ప్రాక్టీస్ చేసేందుకు టెన్నీస్ బాల్ నే వాడుతుంటారని చాలా మంది చెబుతుంటారు. అలాంటిది అదే టెన్నీస్ బాల్ తో గల్లీలలో ఆడే మాదిరిగానే టీ10 టెన్నిస్ బాల్ ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ఎంతో ఉపయోగపడుతుందనే చెప్పవచ్చు. ఇలాంటి అవకాశాన్ని క్రికెట్ పై ఆసక్తి గల వారు ఉపయోగించుకుంటే క్రికెట్ రంగంలో రాణించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోండి.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">