E-Paper
Advertisement

1 Year for Pushpa 2: పుష్ప 2 స్పెషల్ షో.. థియేటర్ దగ్గర మళ్లీ గందరగోళం

1 Year for Pushpa 2: పుష్ప 2 స్పెషల్ షో.. థియేటర్ దగ్గర మళ్లీ గందరగోళం
Advertisement

1 Year for Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)హీరోగా నటించిన పుష్ప 2(Pushpa 2) సినిమా విడుదల అయ్యి నేటికి సరిగ్గా ఏడాది పూర్తిచేసుకుంది. డిసెంబర్ 5, 2024వ తేదీ ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 1800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు పెద్ద ఎత్తున ప్రశంసలు వచ్చాయి.

విమల్ థియేటర్లో స్పెషల్ షో…

ఈ సినిమా విడుదల అయ్యి నేటికి సరిగ్గా ఏడాది కావడంతో అభిమానుల కోసం హైదరాబాద్ బాలానగర్ లోని విమల్ థియేటర్లో పుష్ప 2 స్పెషల్ షో వేశారు. కేవలం సింగిల్ షో మాత్రమే కావడంతో మరోసారి అభిమానులు బిగ్ స్క్రీన్ పై అల్లు అర్జున్ నట విశ్వరూపం చూడటానికి ఎంతో ఆసక్తి కనబరిచారు . ఈ క్రమంలోనే అభిమానుల మధ్య చిన్నపాటి గొడవలు జరిగాయని తెలుస్తోంది. ఈ సినిమా టికెట్లను ఆన్లైన్ లో కాకుండా ఆఫ్ లైన్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సినిమా 4 వ తేదీ సాయంత్రం ప్రసారం కాగా నవంబర్ 30వ తేదీ థియేటర్ వద్ద ఈ సినిమాకు సంబంధించిన టికెట్లను ఆఫ్లైన్ ద్వారా విడుదల చేశారు దీంతో సినిమా టికెట్ల విషయంపై పెద్ద ఎత్తున గందరగోల పరిస్థితులు ఏర్పడటమే కాకుండా అభిమానులు కొట్టుకున్నట్లు తెలుస్తోంది.

టికెట్ల కోసం కొట్టుకున్న ఫ్యాన్స్..

Advertisement

ఈ సినిమాకు ఆఫ్లైన్స్ ద్వారా టికెట్లను జారీ చేయడంతో కొంతమంది అభిమానులకు సినిమా టికెట్లు దొరకకపోవడంతో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఈ విషయంపై రెండు వర్గాల మధ్య టికెట్ల విషయంలో గొడవలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారని తెలుస్తోంది. ఇలా పుష్ప 2 సినిమా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదల అయ్యి మరోసారి ఇలాంటి గొడవ చోటు చేసుకోవడంతో కాస్త గందరగోళ వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. గత ఏడాది కూడా ఇలాగే గొడవలు చోటు చేసుకోవడంతో అల్లు అర్జున్ ఏకంగా జైలుకు కూడా వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట..

Advertisement

గత ఏడాది డిసెంబర్ 4వ తేదీ ప్రీమియర్లు ప్రసారమైన నేపథ్యంలో అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి సంధ్యా థియేటర్ వద్దకు వెళ్లారు. ఇక అల్లు అర్జున్ వస్తున్నారనే విషయం తెలిసిన అభిమానులు ఒకసారిగా ఆయనని చూడటం కోసం ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట ఘటన కారణంగా రేవతి అనే అభిమాని మరణించడమే కాకుండా తన కుమారుడు శ్రీ తేజ్ ఇప్పటికీ చావు బతుకుల మధ్య పోరాటం చేస్తున్నారు. ఇక ఈ వివాదం కారణంగా అల్లు అర్జున్ పై కేసు నమోదు కావడంతో ఈయనని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కూడా గొడవలు చోటు చేసుకోవడంతో అభిమానులు కంగారు వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Akhanda 2 : కట్టాల్సింది 70 కోట్లు కాదు.. 90 కోట్లు.. తవ్వేకొద్ది బయట పడుతున్న నిర్మాతల బొక్కలు

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×