Prakash Raj:గత నాలుగు రోజులుగా ప్రముఖ జర్నలిస్టులు ప్రశ్న రావణ్ , కే.వీ.ఆర్ పేర్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపిస్తున్న విషయం తెలిసిందే. కారణం గత నెల 28వ తేదీన ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సమర శంఖారావం సభ.. అందులో స్పీచ్ ఇచ్చిన ప్రశ్న రావణ్.. అసలు విషయంలోకి వెళ్తే ఈ సభలో జర్నలిస్ట్ ప్రశ్న రావణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , రాధా మనోహర్ దాస్ లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ బండ బూతులతో చెలరేగిపోయాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ గా చేసుకొని అసభ్య పదజాలంతో రెచ్చిపోయాడు. దీంతో పోలీసులు వెంటనే అతడిని అరెస్టు చేశారు..
ఈ అరెస్ట్ ను ప్రశ్నిస్తూ ప్రకాష్ రాజ్ సపోర్ట్ చేయడం అటు సోషల్ మీడియాలో విమర్శలకు దారితీసింది. ఎప్పటిలాగే జస్ట్ ఆస్కింగ్ పేరిట తన ఎక్స్ వేదికగా జర్నలిస్టులు ప్రశ్న రావణ్, కేవీఆర్ లను అరెస్టు చేయడంపై తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి గొంతు నొక్కడం ప్రజాస్వామ్యానికే విఘాతం. ఇది ఫాసిజం, పిరికితనం అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లపై ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ప్రశ్నించే వారిని అరెస్టు చేయడం ప్రజాస్వామ్యమా? ఒకవేళ మన పూర్వీకులు అలా గొంతులు నొక్కేసి ఉంటే.. ఈరోజు ఈ ప్రజాస్వామ్యం మిగిలేదా? అంటూ సూటిగా ప్రశ్నించారు.
అలా ప్రశ్న రావణ్ కు మద్దతుగా నిలవడంతో ప్రకాష్ రాజ్ పై విమర్శలు వెల్లువెత్తాయి . ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఇలా పబ్లిక్ ఈవెంట్లలో బూతులతో తిట్టడం సమంజసమా? అలాంటి వ్యక్తికి ప్రకాష్ రాజ్ మద్దతు పలకడం ఏంటి? అంటూ ప్రకాష్ రాజ్ పై విమర్శలు కూడా గుప్పిస్తున్నారు . అయితే అలాంటి ఈయన ఇప్పుడు మరొకసారి మరో ట్విట్టర్ పోస్ట్ చేస్తూ ఎందుకు ఇలాంటి సిగ్గులేని కక్ష సాధింపులు.. జనాలు చూస్తున్నారు.. ఇప్పటికైనా మారండి అంటూ మరో వీడియోతో ఆడియన్స్ ముందుకి వచ్చారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
also read:Akhil Akkineni: నాకు అప్పుడే తెలుసు.. సమంత పై అఖిల్ ఊహించని కామెంట్స్!
తాజాగా ప్రకాష్ రాజ్ రిలీజ్ చేసిన మరో వీడియో విషయానికి వస్తే.. “ప్రశ్న రావణ్ ను హైదరాబాదులో అర్ధరాత్రి అరెస్టు చేసి పెద్ద బిల్డప్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ కి తీసుకెళ్లారు. కోర్టు ఈ కేసులో అరెస్టు చేయలేము అని చెప్పి రావణ్ కు బెయిల్ ఇచ్చింది. వెంటనే ఇంకో కేసు వేసి మళ్లీ అరెస్టు చేశారు.. అప్పుడు కూడా కోర్టు ఇది కరెక్ట్ కాదు అంటూ మళ్లీ బెయిల్ ఇచ్చింది. మళ్లీ ఇంకో కేసులో అరెస్టు చేస్తారా? ఇలా ఒక 30 కేసులు రెడీగా ఉన్నాయి అంట కదా మీ దగ్గర. అంటే మీరు మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తున్నా.. కోర్టు బెయిల్ ఇస్తుంటే మీరు మళ్ళీ అరెస్టు చేస్తారా.. ? అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఎక్కడిదాకా వెళ్తారు..? ఎందుకు ఇలాంటి సిగ్గులేని కక్ష సాధింపు చర్యలు. ఏం చేయాలనుకుంటున్నారు.? జనాలు చూస్తున్నారు.. మీ కోపాన్ని వాళ్ళు చూస్తున్నారు. ఇలా చిన్నచిన్న వాటికి పవర్ ని మీరు దుర్వినియోగం చేయలేరు. త్వరలోనే రావణ్ ను రిలీజ్ చేస్తారని భావిస్తున్నాను” అంటూ తెలిపారు ప్రకాష్ రాజ్. మరి ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
How low will you stoop down and missuse power and government machinery.. do you realise you are getting Naked day by day . #justasking pic.twitter.com/f3dDPw2ZAk
— Prakash Raj (@prakashraaj) July 2, 2026