E-Paper
Advertisement

నగరంలో వరుస హత్యలు… పోలీసులకు హింట్ ఇచ్చి మరీ చంపే సీరియల్ కిల్లర్

నగరంలో వరుస హత్యలు… పోలీసులకు హింట్ ఇచ్చి మరీ చంపే సీరియల్ కిల్లర్
Advertisement

Korean Crime Mystery Thriller : సీరియల్ కిల్లర్ కథలు ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. కిల్లర్ వరుస హత్యలు చేస్తూనే, పోలీసుల నుంచి చాకచక్యంగా తప్పించుకుంటారు. చివరికి పట్టుబడతారు అనుకోండి, అది వేరే సంగతి. కానీ అదే కిల్లర్ పోలీసులకే హింట్స్ ఇస్తూ తనని చేతనైతే పట్టుకోమని ఛాలెంజ్ విసిరితే… ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ స్టోరీ అచ్చం ఇలాగే ఉంటుంది. అదే కొరియన్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌ ‘నైన్ పజిల్స్’ (Nine Puzzles). 2025లో విడుదలైన ఈ సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఈ సిరీస్ పదేళ్ల క్రితం జరిగిన ఒక మిస్టీరియస్ మర్డర్, ప్రస్తుతం జరుగుతున్న వరుస హత్యల మధ్య ఉన్న భయంకరమైన సంబంధం చుట్టూ తిరుగుతుంది. హైస్కూల్ విద్యార్థిని యూన్ ఎనా. ఓరోజు రాత్రి ఆమె మేనమామ దారుణంగా హత్యకు గురవుతాడు. ఆ క్రైమ్ సీన్‌కు మొదట చేరుకున్నది ఎనానే. అక్కడ ఒక వింతైన పజిల్ ముక్క దొరుకుతుంది. మామ రక్తపు మడుగులో పడి ఉండడం చూసిన ఎనాకు మతిపోతుంది. ఆ రాత్రి ఏం జరిగిందనే విషయం ఎనాకు పూర్తి జ్ఞాపకం ఉండదు. డిటెక్టివ్ కిమ్ హన్-సేమ్ మాత్రం ఆమెనే ప్రధాన నిందితురాలిగా అనుమానిస్తాడు. కానీ ఆధారాలు లేకపోవడంతో కేసు మిస్టరీగా మిగిలిపోతుంది.

Advertisement

ఇక్కడి నుంచి కథ పదేళ్ల తర్వాతకు షిఫ్ట్ అవుతుంది. ఎనా తనపై పడ్డ నిందను పోగొట్టుకోవడానికి, అసలు నేరస్థుడిని పట్టుకోవడానికి తెలివైన క్రిమినల్ ప్రొఫైలర్‌ గా మారుతుంది. ఆమె మెదడు హత్యల వెనుక ఉన్న మానసిక స్థితులను, పజిల్ ముక్కల వెనుక దాగి ఉన్న సందేశాలను విశ్లేషించే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇక ఇప్పుడు చూసుకుందాం అన్నట్టుగా మళ్లీ హత్యలు మొదలవుతాయి. సరిగ్గా పదేళ్ల తర్వాత నగరంలో వరుస హత్యలు గందరగోళాన్ని సృష్టిస్తాయి.

అయితే ప్రతి శవం పక్కన గతంలో దొరికిన లాంటి పజిల్ ముక్కలే లభిస్తాయి. ఈ కొత్త కేసుల దర్యాప్తు కోసం ఎనా, గతంలో ఆమెను నిందితురాలిగా చూసిన డిటెక్టివ్ హన్-సేమ్ ఇద్దరూ కలిసి పని చేయాల్సి వస్తుంది. హంతకుడు వదిలి వెళ్తున్న తొమ్మిది పజిల్ ముక్కల వెనుక ఉన్న సీక్రెట్ సందేశాలను కనిపెట్టడానికి వీరిద్దరూ ఒకరికొకరు తోడవుతారు. కానీ ఈ పజిల్స్ వెనుక దాగి ఉన్న నిజం ఎనా గతాన్ని, హన్-సేమ్ వృత్తి జీవితాన్ని బయట పెడుతుంది. చివరికి ఆ పజిల్స్ పూర్తి చేసి అసలైన హంతకుడిని ఎలా పట్టుకున్నారనే ఉత్కంఠభరితమైన కథను సిరీస్ లో చూడాల్సిందే. 11 ఎపిసోడ్‌ల ఈ సిరీస్ హాట్‌స్టార్ లో (JioHotstar)లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ఆడియో లేదు, కానీ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో మాత్రం అవైలబుల్ గా ఉన్నాయి.

Advertisement

Read Also: సైకో తమ్ముడి కోసం హాస్పిటల్ నే తగలబెట్టే నర్స్… ఐకానిక్ హర్రర్ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్

Tags

Related News

ఆ ఊరిలో ప్రతి 10 ఏళ్లకో నరబలి… ఓటీటీలోకి అల్టిమేట్ డార్క్ థ్రిల్లర్… హనుమాన్ చాలీసాను పక్కన పెట్టుకుని చూడండి

లోకాన్ని నాశనం చేయాల్సిన విలన్ బాబు మిస్సింగ్… ఏంజెల్ డెమన్ల టెన్షన్ పీక్స్… మతిపోగొట్టే ఫ్యాంటసీ సిరీస్

తండ్రినే చంపాలని కూతురికి ఆర్డర్… మైండ్ బ్లాకింగ్ స్పై థ్రిల్లర్ సిరీస్

30 వేల ఏళ్లుగా నిద్రపోతున్న డెవిల్ ని గెలికింది… క్యూట్ ఫెయిరీ చేసిన పనికి వరల్డ్ కే వణుకు… ఈ ఫాంటసీ లవ్ కాంబో వేరే లెవెల్

కేస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి లవ్ డ్రామా… డాక్టర్ తో ఫైర్‌ఫైటర్ రొమాంటిక్ లవ్ ట్రాక్

లండన్‌లో వడాపావ్ బిజినెస్‌తో కోట్ల సంపాదన… కానీ ఆ ఒక్క సీక్రెట్ బయటపడితే అంతా షెడ్డుకే

18 ఏళ్ల శత్రుత్వం… బద్దశత్రువుల ఇంట్లో పుట్టి ప్రేమలో పడే జంట… క్రేజీ కొరియన్ రొమాంటిక్ సిరీస్

24 ఏళ్లకే ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్… షుమాకర్ లెజెండ్ గా మారిన గూస్‌బంప్స్ మూమెంట్

Big Stories

Advertisement
×