E-Paper
Advertisement

Jagtial district: మరణ శాసనం.. తన సమాధి తానే నిర్మించుకున్న జగిత్యాల వాసి

Jagtial district: మరణ శాసనం.. తన సమాధి తానే నిర్మించుకున్న జగిత్యాల వాసి
Advertisement

Jagtial district: జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన నక్క ఇంద్రయ్య జీవిత ప్రయాణం..  ఆయన తీసుకున్న నిర్ణయం నిజంగా అసాధారణం. ఒక సామాన్య కార్మికుడిగా మొదలై..  అంచెలంచెలుగా ఎదిగి, మరణాన్ని కూడా ఒక పండగలా..  ముందుస్తు ప్రణాళికతో స్వీకరించిన ఆయన గాథ ప్రస్తుతం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వేలాది మందిలో ఆయన ఒకరు. దుబాయ్‌లో ఒక సాధారణ కార్మికుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన..  తన పట్టుదలతో కష్టపడి అక్కడే సొంతంగా ఒక కంపెనీని స్థాపించే స్థాయికి ఎదిగారు. తన ఎదుగుదలతో ఆగిపోకుండా..  తన ప్రాంతానికి చెందిన ఎంతో మంది నిరుద్యోగులకు దుబాయ్‌లో ఉపాధి అవకాశాలు కల్పించి ఆపద్బాంధవుడిగా నిలిచారు.

Advertisement

సాధారణంగా మనుషులు మరణం గురించి ఆలోచించడానికే భయపడతారు. కానీ ఇంద్రయ్య ఆలోచనా  భిన్నంగా ఉండేది. తన మరణం తర్వాత పిల్లలు ఇబ్బంది పడకూడదని..  వారికి భారం కాకూడదని ఆయన భావించారు. ఈ క్రమంలోనే 2009వ సంవత్సరంలో..  అంటే సుమారు 15 ఏళ్ల క్రితమే  తన సొంత పొలంలో 8 లక్షల రూపాయలతో ఒక అందమైన రాతి సమాధిని నిర్మించుకున్నారు.

ఆ సమాధిని ఆయన కేవలం ఒక కట్టడంగా చూడలేదు. ప్రతిరోజూ అక్కడికి వెళ్లి..  తన కోసం తాను నిర్మించుకున్న ఆ స్థలంలోనే ధ్యానం చేసుకునేవారు. మరణాన్ని ఒక అనివార్య సత్యంగా అంగీకరిస్తూ..  దాని కోసం మానసికంగా సిద్ధపడటం ఆయన ప్రత్యేకత. ఇటీవల అనారోగ్యంతో శనివారం ఆయన కన్నుమూశారు. ఆయన ముందుగా కోరుకున్న విధంగానే కుటుంబ సభ్యులు ఆయన నిర్మించుకున్న రాతి సమాధి వద్దే అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement

తానూ నిర్మించుకున్న సమాధిలోనే నిద్రపోవాలన్న ఆయన కోరిక నెరవేరింది. జీవితాన్ని గెలిచి..  మరణాన్ని కూడా గౌరవప్రదంగా ఆహ్వానించిన ఇంద్రయ్య కథ ఇప్పుడు సోషల్ మీడియా, స్థానికంగా చర్చనీయాంశమైంది.

ALSO READ:మహిళల రక్షణే మా ప్రాధాన్యత.. విశాఖ పోలీసుల పనితీరుపై సీఎం చంద్రబాబు ప్రశంసలు

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×