BigTV English

Alekhya Chitti Pickles: ఇంత మోసమా.. అంతా ఫేమ్ కోసమే బూతులు.. రమ్యపై నెటిజన్స్ ఫైర్..

Alekhya Chitti Pickles: ఇంత మోసమా.. అంతా ఫేమ్ కోసమే బూతులు.. రమ్యపై నెటిజన్స్ ఫైర్..

Alekhya Chitti Pickles: సోషల్ మీడియా ఇది ఒక మేనియా. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ మెయింటెనెన్స్ కంటే, సోషల్ మీడియా అకౌంట్స్ మెయింటైన్ చేయడమే ఒక ఫ్యాషన్. అందుకేనేమో, చిన్నా పెద్దా తేడా లేకుండా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లెవెల్ లో తెగ సందడి చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ఫేమ్ ఒక్క నిమిషంలో రావచ్చు, ఒక్క గంటలో రావచ్చు లేక ఏళ్ల తరబడి కష్టపడ్డా ఫలితం లేకుండా పోవచ్చు.


కానీ ఇప్పుడు సోషల్ మీడియాలోని అకౌంట్ లకు ఎంత నెగిటివ్ కామెంట్స్ వస్తే, అంత ఫేమస్ అవుతారన్నది ఇప్పుడు కాదనలేని వాస్తవం. అందుకే ఫేమ్ రావాలంటే కాస్త ఓపిక, కాస్త సహనం, మరికాస్త శాంతంగా ఉంటే చాలు, ఒక్కరోజులో స్టార్ కావడం సాధ్యమే. అయితే ఇలా ఫేమ్ తెచ్చుకున్న వారిని, ట్రోలర్స్ ఒక్క పట్టాన వదలరు సుమా. కాస్త లైన్ దాటి మళ్లీ ట్రోలింగ్ చేస్తుంటారు. పాపం ఇప్పుడు అదే పరిస్థితి ఎదుర్కొంటోంది అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య. మమ్మల్నే మోసం చేస్తావా అంటూ ట్రోలర్స్ మళ్లీ తెగ హడావుడి చేస్తున్నారు.

ఇక అసలు విషయం లోకి వెళితే..
తమ పికిల్స్ బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా చేసుకోవాలన్న లక్ష్యంతో అలేఖ్య, రమ్య సిస్టర్స్ సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు. వీరి బిజినెస్ అనుకున్నట్లే సక్సెస్ గా సాగుతున్న క్రమంలో ఎవరి దిష్టి తగిలిందో కానీ, ఒక్కసారిగా వివాదం చుట్టుముట్టింది. పికిల్స్ ధరలు ఎక్కువగా ఉన్నాయని, ఒక నెటిజన్ చేసిన కామెంట్ కు రమ్య దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది. ఇదే వివాదానికి కారణమైంది. చివరకు సారీ వరకు వెళ్లింది వ్యవహారం. దీనితో ఈ వివాదం ఏమో కానీ, వారికి ఫాలోవర్స్ పెరిగారు.. బిజినెస్ మాత్రం కాస్త తగ్గింది. మళ్లీ కొత్త పేరుతో పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేసినట్లు రమ్య ప్రకటించింది.


ఇక్కడే ప్లాన్ అమలైందా?
సోషల్ మీడియాలో ఫేమ్ రావాలంటే నెగిటివ్ మోడ్ ఉండాల్సిందే. అందుకే అలేఖ్య చిట్టి పికిల్స్ పక్కా ప్లాన్ తో వివాదం చెలరేగించి, ఆ తర్వాత సారీ ల పర్వం సాగించారని ఓ వర్గం నెటిజన్స్ వాదన. మరికొందరు మాత్రం, యువతులు స్వయం ఉపాధిలో రాణిస్తూ ఎందరికో ఆదర్శంగా ఉన్నారని మరికొందరి భావన. అయితే చిట్టచివరకు ఫాలోవర్స్ పెరిగారు.. ఆ నెగిటివ్ మోడ్ తో ఫేమ్ కూడా వచ్చేసింది ఈ సిస్టర్స్ కు.

వివాదం నుండి సినిమా వేదికపైకి..
నెగిటివ్ మోడ్ కామెంట్స్ చేసి రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన రమ్య చిట్టచివరకు ఓ ఆడియో ఫంక్షన్ లో కనిపించడం చూసి, నెటిజన్స్ షాక్ కు గురయ్యారు. తన రీల్స్ తో ఇప్పటికే కుర్రకారుని ఆకర్షించడంలో ముందుండే రమ్య, ఇప్పుడు ఒక్కసారిగా సినిమా వేదికపై కనిపించడంతో మావల్లే ఆ ఫేమ్ అంటూ ట్రోలర్స్ భోరున విలపిస్తున్నారు. పక్కా ప్లాన్ తో స్కెచ్ వేసి ఫేమ్ తెచ్చుకొని నేడు సినిమా రేంజ్ కు రమ్య వెళ్ళిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్న పరిస్థితి.

అశ్విన్ బాబు హీరోగా నటిస్తున్న వచ్చినవాడు గౌతమ్ అనే సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ లో రమ్య కనిపించింది. అంతేకాదు సంగీత దర్శకుడు తమన్ పక్కన సైలెంట్ గా ఉన్న రమ్య, ఇది నా రేంజ్ అంటూ నెటిజన్స్ కు బిగ్ షాక్ ఇచ్చింది. మేము ట్రోలింగ్ చేశాము, ఇప్పుడు రమ్యకు సినిమా ఫేమ్ తెచ్చామని, ట్రోలర్స్ నేనంటే నేను అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.

పక్కా ప్లాన్ తో..
అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ కావాలనే సోషల్ మీడియా ఫేమ్ కోసం గలీజ్ మాటలు మాట్లాడి, ఫేమ్ తెచ్చుకున్నారని, ఇదంతా ప్లాన్ అంటూ కొందరు వాదిస్తున్నారు. ఆ ఫేమ్ ను ఉపయోగించుకుంటేనే, సినిమా ఛాన్స్ లు వస్తాయని, అందుకే వారు రెచ్చిపోయారని కొందరు అంటున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరికి ఫేమ్ వస్తుందో చెప్పడం కష్టం. ఇప్పుడు బూతు మాటలతో మొదలైన చిట్టి పికిల్స్ ప్రస్థానం, ట్రోలర్స్ దెబ్బకు సెలబ్రిటీ రేంజ్ కు వెళ్ళిందని చెప్పవచ్చు.

Also Read: Big TV Exclusive: చిరు – అనిల్ మూవీలో స్పెషల్ బీట్.. రంగంలోకి ఆ బ్యూటీ..!

ఇప్పుడు వీరిని ఆదర్శంగా తీసుకొని, మరికొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లూ యెన్సర్స్ ట్రోలింగ్ కోసం తెగ పాకులాడుతున్నారట. మొత్తం మీద సోషల్ మీడియాలోని ఓ వర్గానికి రమ్య ఆదర్శంగా మారడం విశేషం. ప్లాన్ ప్రకారం ఫేమ్ తెచ్చుకున్నారా? లేక యాధృచ్చికంగా ఫేమ్ వచ్చిందా అనే విషయం పక్కన పెడితే, చిట్టి పికిల్స్ సిస్టర్స్ మాత్రం ట్రోలింగ్ కు ఎదురొడ్డి పోరాడారని కొందరు తెగ పొగిడేస్తున్నారు. చూద్దాం.. రమ్య హీరోయిన్ ఛాన్స్ కొట్టేస్తుందా? లేదా అన్నది మున్ముందు తెలియాల్సి ఉంది.

Related News

Viral Video: కారు రన్నింగ్‌లో ఉండగా.. స్టీరింగ్ వదిలేసి.. డోరు తెరిచి బొన్నెట్‌పై కూర్చొని రిస్కీ స్టంట్!

Viral Video: పిల్లలకు టీకాలు వేసేందుకు ఆరోగ్య కార్యకర్త సాహసం, సూపర్ ఉమెన్‌ లా దూకుతూ..

Viral Video: డేంజర్ యాక్సిడెంట్.. సీసీటీవీ ఫుటేజ్‌లో షాకింగ్ నిజాలు, వైరల్ వీడియో

Shrekking: అందంగా లేకపోయినా ఐ లవ్యూ చెప్పేసెయ్.. డేటింగ్ లో ఇదో కొత్త ట్రెండ్

YouTuber accident: సోషల్ మీడియా కోసం రిస్క్.. చూస్తుండగానే యూట్యూబర్ బలి!

Viral Video: సినిమా శైలిలో రెచ్చిపోయిన యువ జంట.. అందరిచూపు వారిపై, చివరకు ఏమైంది?

Big Stories

×