BigTV English

Ola Foods| ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ చేస్తే ఇలా కూడా చేస్తారా?.. కస్టమర్‌కు చుక్కలు చూపించిన ఫుడ్ డెలివరి బాయ్!

Ola Foods| ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ చేస్తే ఇలా కూడా చేస్తారా?.. కస్టమర్‌కు చుక్కలు చూపించిన ఫుడ్ డెలివరి బాయ్!

Ola Foods| ఈ రోజుల్లో ఆన్ లైన్ ఫుడ్ ఆర్ఢర్ చేయడం చాలా కామన్. మంచి రుచిగల వంటకాలు నోరూరించే స్వీట్లు ఇంట్లో కూర్చొని ఫోన్లో బుక్ చేస్తే చాలు నిమిషాల్లో మీరు కోరుకున్న ఆహారం మీ ముంగిట్లో ప్రత్యక్షమవుతుంది. ఫుడ్ డెలివరి బిజినెస్ రోజురోజుకీ పెరుగుతూనే ఉంది.జొమాటో, స్విగ్గీ ఈ రంగంలో దూసుకుపోతున్నాయి. దీంతో గత కొన్నినెలలుగా ప్రముఖ అన్ లైన్ క్యాబ్ సంస్థ ఓలా కూడా ఈ రంగంలో ప్రవేశిచింది. అయితే ఓలా బిజినెస్ మిగతా కంపెనీలతో పొలిస్తే.. అంతంతమాత్రంగానే నడుస్తోంది.


చాలా సార్లు కస్టమర్లకు చేదు అనుభవం ఎదురవుతుంది. ఫుడ్ ఆర్డర్ చేస్తే.. ఒక ఐటెమ్ బదులు మరొకటి రావడం.. లేదా చెడిపోయన ఫుడ్ రావడం వంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల ఓలా ఫుడ్స్ కు చెందిన ఫుడ్ డెలివరి బాయ్.. కస్టమర్ కు చుక్కలు చూపించాడు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఫుడ్ డెలివరీ చేయకుండా అతను ఏం చేశాడంటే..
దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని నోయిడా ప్రాంతంలో నివసించే అమన్ జైస్వాల్ అనే వ్యక్తి ఓలా ఫుడ్స్ యాప్ ద్వారా ‘ఫ్రెంచ్ ఫ్రైస్’ ఆర్డర్ చేశాడు. అయితే ఆర్డర్ డెలివరీ చేయాల్సిన ఫుడ్ డెలివరీ బాయ్ ఆలస్యం చేశాడు. అమన్ ఆ డెలివరి బాయ్ కు ఫోన్ చేస్తే.. తనకు రూ.10 ఎక్స్ ట్రా కావాలని ఆ డెలివరీ బాయ్ డిమాండ్ చేశాడు. అయితే అమన్ అతని డిమాండ్ ని ముందుగా పట్టించుకోలేదు.. ఆ తరువాత సరే రూ.10 లే కదా.. అని ఒప్పుకున్నాడు. అయినా 45 నిమిషాల వరకు డెలివరి బాయ్ రాలేదు.


అమన్ చాలా సేపు ఎదురుచూసి.. ఇంటి బయటకు వచ్చి ఫోన్ చేశాడు. అప్పుడు తన ఇంటి బయటే బైక్ పార్క్ చేసుకొని ఒక ఫుడ్ డెలివరీ బాయ్ కనిపించాడు. అతను ఫుడ్ పార్సిల్ ఓపెన్ చేసి తింటూ కనిపించాడు. అమన్ అనుమానంతో అతనో కాదో అని మళ్లీ ఫోన్ చేశాడు. అప్పుడు ఆ ఫుడ్ తింటున్న వ్యక్తి ఫోన్ మోగింది. ఇది చూసి అమన్ కు చాలా కోపం వచ్చింది. “ఏంటిది.. అది నా పార్సిల్ కదా.. నువ్వు తినేస్తున్నావేంటి?,” అని నిలదీశాడు.దానికి ఆ ఫుడ్ డెలివరి బాయ్.. “అయితే నన్నేం చేయమంటావ్?” అని ఎదురు ప్రశ్నించాడు.

Also Read: ఎయిర్ పోర్టులో ప్రయాణికుడిని టాయ్ లెట్‌లోకి తీసుకెళ్లిన కస్టమ్స్ అధికారి.. అక్కడ ఏం జరిగిందంటే..

“ఉండు నీ గురించి కంప్లెయింట్ చేస్తా..” అని చెప్పగానే.. ఆ డెలివరి బాయ్.. “ఏం చేస్తావో చేసుకో” అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. ఇదంతా అమన్ జైస్వాల్ వీడియో తీసి తన ఇన్స్ టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశాడు. ఇప్పుడా వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. చాలా మంది ఈ వీడియోపై కామెంట్లు చేస్తున్నారు.

ఒక యూజర్ అయితే ఓలా.. ఫుడ్ డెలివరి కూడా చేస్తోందా? అని రాస్తే.. మరొకరు ఓలా క్యాబ్ సర్వీస్ లాగే దాని ఫుడ్ డెలివరి కూడా చెత్తగా ఉంది. అని రాశాడు. మరొక యూజర్ అయితే ఆ డెలివరి బాయ్ ఎందుకు అలా చేశాడో సరిగ్గా గెస్ చేశాడు. ‘ఆ డెలివరి బాయ్ ఉద్యోగం మానేస్తున్నట్లుగా అనిపిస్తోంది.. బహుశా ఇదే అతని చివరి రోజు అయి ఉండొచ్చు.. లేదా అతనికి కంపెనీ పేమెంట్ చెల్లించకపోతే.. ఇలా పగ తీర్చుకున్నాడేమో’ అని రాశాడు.

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Aman Birendra Jaiswal (@amanbjaiswal)

Tags

Related News

Viral Video: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Dasara Bumper Offer: దసరా బంపర్ ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!

Viral News: రోజుకు 24 గంటలు కాదు.. 18 గంటలే.. అథోస్ సన్యాసులు చెప్పింది వింటే మైండ్ బ్లాకే!

OnlyFans: ఇండియాలో ‘ఓన్లీ ఫ్యాన్స్’ లీగలా? ఇందులో ఎలా సంపాదించవచ్చు?

Big Stories

×