BigTV English

Gold Smuggling: ఎయిర్ పోర్టులో ప్రయాణికుడిని టాయ్ లెట్‌లోకి తీసుకెళ్లిన కస్టమ్స్ అధికారి.. అక్కడ ఏం జరిగిందంటే..

Gold Smuggling: ఎయిర్ పోర్టులో ప్రయాణికుడిని టాయ్ లెట్‌లోకి తీసుకెళ్లిన కస్టమ్స్ అధికారి.. అక్కడ ఏం జరిగిందంటే..

Gold Smuggling| ఎయిర్ పోర్ట్ లో విమానం దిగిన ఒక ప్రయాణికుడు తన లగేజ్ తీసుకున్న తరువాత అటుఇటుగా చూపులు చూస్తున్నాడు. అతను కంగారుపడుతున్నట్లు కనిపిస్తోంది. అతను ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదంతా ఒక కస్టమ్స్ అధికారి గమనిస్తూ ఉన్నాడు. ఆ ప్రయాణికుడు ఎయిర్ పోర్ట్ బయటకు వెళ్లే సమయంలో అతడిని పట్టుకున్నాడు. వారిద్దరి మధ్య ఏవో మాటలు జరిగాయి. ఆ తరువాత ప్రయాణికుడిని ఆ అధికారి టాయ్ లెట్ లోకి తీసుకెళ్లాడు. అక్కడ జరిగిన విషయం తెలిసి ఎయిర్ పోర్ట్ అధికారులంతా షాకయ్యారు.


వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో గల్ఫ్ దేశం నుంచి వచ్చిన ఇండిగో 6E-1346 విమాన ప్రయాణికుడు లగేజ్ తీసుకొని అనుమాస్పదంగా చూపులు చూస్తుండగా.. అతడిని కస్టమ్స్ ఆఫీసర్ వరుణ్ కౌండిన్యా గమనించాడు. ఆ ప్రయాణికుడి ముఖానికి చెమటలు పడుతున్నాయి. ఆఫీసర్ వరుణ్ ఆ ప్రయాణికుడి వద్దకు వెళుతుండగా.. అతను కూడా ఆఫీసర్ రాకను గమనించి ఎయిర్ పోర్టు బయటకు వెళ్లేందుకు త్వరగా నడుస్తున్నాడు. అయినా ఆఫీసర్ వరుణ్ అతడిని గ్రీన్ చానెల్ వద్ద పట్టుకున్నాడు.

ప్రయాణికుడిని పక్కకు తీసుకెళ్లి.. అతని లగేజ్, బట్టలన్నీ చెక్ చేశాడు. కానీ ఏమి కనబడలేదు. అయినా ఆఫీసర్ వరుణ్.. ఆ ప్రయాణికుడిని గట్టిగా ప్రశ్నించాడు. దీంతో భయపడిపోయిన ఆ ప్రయాణికుడు తన వద్ద భారీ మొత్తంలో బంగారం ఉందని అంగీకరించాడు. గల్ఫ్ దేశం నుంచి తీసుకొచ్చిన్నట్లు చెప్పాడు. కానీ ఆ బంగారం ఎక్కడ ఉందో చెప్పలేదు. ఆఫీసర్ వరుణ్ ‌కు అనుమానం కలిగి అతడిని ఎయిర్ పోర్టు టాయ్ లెట్ లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆ ప్రయాణికుడి బట్టలు విప్పి చెక్ చేశాడు. కానీ ఏమీ దొరకలేదు. అయితే ఆ ప్రయాణికుడు తనంట తానే బంగారం ఎక్కడుందో చెప్పాడు.


Also Read: దారుణం.. బ్రతికుండగానే సజీవంగా పూడ్చిపెట్టిన వీడియో వైరల్

బంగారం తన మలద్వారంలో ఉందని తెలిపాడు. దీంతో ఆఫీసర్ వరుణ్ అతడినే స్వయంగా బయటికి తీసి ఇవ్వాలని ఆదేశించాడు. దీంతో ఆ ప్రయాణికుడు తన మలద్వారంలో ఉన్న బంగారాన్నీబయటికి తీశాడు. బంగారాన్ని మొత్తని పేస్టులా చేసి దాన్ని క్యాప్సూల్ రూపంలో మలద్వారంలో దాచాడు. కస్టమ్స్ ఆఫీసర్లు ఆ బంగారాన్ని తూకం వేయగా.. దాని బరువు 967 గ్రాములు ఉందని తేలింది. ఆ బంగారం విలువ దాదాపు 61 లక్షల రూపాయలు ఉంటుంది చెప్పారు. ఆ తరువాత ఆ ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి పోలీసులకు అప్పగించారు.

వారం రోజుల క్రితం కూడా ఢిల్లీ ఎయిర్ పోర్టులోనే.. సౌదీ అరేబియా దేశం జెద్దా నుంచి వచ్చిన విమాన ప్రయాణికుడు తన మల ద్వారంలో నాలుగు క్యాప్సూల్ లో 1096.76 గ్రాముల బంగారం దాచి స్మగ్లింగ్ చేస్తుండగా.. పట్టుబడ్డాడు. ఆ బంగారం విలువ రూ.69 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.

 

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×