BigTV English

Viral 3D Painting: ఏంటీ బ్రో నీలో ఇంత టాలెంట్ ఉందా.. ఒక్క ఫోటోలో ముగ్గురు హీరోలను దింపేశావ్ గా..

Viral 3D Painting: ఏంటీ బ్రో నీలో ఇంత టాలెంట్ ఉందా.. ఒక్క ఫోటోలో ముగ్గురు హీరోలను దింపేశావ్ గా..

Viral 3D Painting: సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదోొ ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలకు సంబంధించిన వీడియోలు అయితే క్షణాల్లో అందరినీ ఆకర్షిస్తుంటారు. ఇందులో భాగంగా వారి పుట్టిన రోజు, పెళ్లి రోజు సమయంలో అభిమానులు వారిపై అభిమానాన్ని చాటుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో తాాజగా టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ కొణెదెల చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు నేడు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. చిరంజీవి అభిమానులు తమ అభిమాన హీరోపై ప్రేమ, అభిమాన్ని చాటుకునేందుకు వినూత్న బహుమతులు అందజేస్తున్నారు. ఈ క్రమంలో అసోసియేన్లు బర్త్ డే పార్టీలు చేస్తూ సందడి చేస్తున్నారు. మరోవైపు కొంత మంది ఆయన పేరుపై పూజలు చేస్తూ పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారు. నిన్న ఓ అభిమాని చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఏకంగా తిరుమల కొండపైకి పొరుగుదండాలు పెడుతూ మెట్లపై వెళ్లిన వీడియో అందరినీ ఆకట్టుకుంటుంది.


చిరంజీవికి కేవలం సినిమాల పరంగా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగాను చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, అభిమానులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇలా లక్షల మంది శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో చిరంజీవిపై తన అభిమానాన్ని చాటుకునేందుకు ఓ కళాకారుడు చేసిన అద్భుతం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చిరంజీవి పుట్టిన రోజును పురస్కరించుకుని చిరంజీవి ఫోటోతో ఓ పెయింటింగ్ వేయాలని అనుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కుప్పంకు చెందిన పురుషోత్తం అనే కళాకారుడు ఈ సాహసం చేశాడు. ఈ క్రమంలో పొలంలో కూర్చుని ఓ 3డీ పెయింటింగ్ వేయడం ప్రారంభించాడు. అయితే ఆ పెయింటింగ్ లో కేవలం చిరంజీవి ఫోటో మాత్రమే కాకుండా ఆయన సోదరుడు, పవర్ స్టార్, కొణిదెల పవణ్ కళ్యాణ్ మరోవైపు ఆయన కుమారుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫోటోలను కూడా వేశాడు.

ఆ పెయింటింగ్ ముందు నుంచి చూస్తే చిరంజీవి ఫోటో, కుడి వైపు నుంచి చూస్తే రామ్ చరణ్, ఎడమ వైపు నుంచి చూస్తే పవన్ కళ్యాణ్ ఫోటోలు కనిపించేలా ఎంతో అందంగా, అద్భుతంగా పెయింగ్ గీశాడు. ఈ పెయింటింగ్ వీడియోను తీసి సోషల్ మీడియాలో చిరంజీవికి విషెస్ చెబుతూ పోస్ట్ చేయడంతో చిరంజీవి అభిమానులు తెగ సంతోష పడిపోతున్నారు. చూడముచ్చటగా ముగ్గురు మెగా స్టార్ల ఫోటోలు ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తూ ఆ చిత్రాన్ని గీసిన కళాకారుడిని మెచ్చుకుంటున్నారు. పురుషోత్తం కు చాలా టాలెంట్ ఉందని కూడా కామెంట్స్ చేస్తున్నారు.


Related News

Viral Video: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Dasara Bumper Offer: దసరా బంపర్ ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!

Viral News: రోజుకు 24 గంటలు కాదు.. 18 గంటలే.. అథోస్ సన్యాసులు చెప్పింది వింటే మైండ్ బ్లాకే!

OnlyFans: ఇండియాలో ‘ఓన్లీ ఫ్యాన్స్’ లీగలా? ఇందులో ఎలా సంపాదించవచ్చు?

Big Stories

×