Manushi Chhillar: విశ్వసుందరి.. హర్యానా బ్యూటీ మానుషి చిల్లర్ గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు.

కాకపోతే నెట్టింట్లో గిరగిరా తిరిగేందుకు తహతహలాడుతోంది ఈ అమ్మడు. ఆ మధ్య మాజీ సీఎం మనవడితో నెట్టింట్లో తెగ గోల చేసింది.

ఆ విషయం ఎంతవరకు వచ్చిందో తెలీదు. ఆ విషయాన్ని పక్కనబెడితే జాన్‌అబ్రహం లేటెస్ట్ మూవీ టెహ్రాన్.

ఈ సినిమా కోసం తెగ కష్టపడుతోంది. దీని ద్వారా బాలీవుడ్‌లో బిజీ కావాలని ఆశపడుతోంది.

మరి ఈ ప్రాజెక్టు కోసమే ఏంటోగానీ ముంబై వీధుల్లో నానాహంగామా చేస్తోంది.

పానీపూరీ తీసుకుంటూ రకరకాలుగా ఫోటోలకు పోజులిచ్చింది. అసలే.. విశ్వసుందరి ఎవరైనా సైలెంట్‌గా ఉంటారా?

నార్మల్‌గా అయితే విశ్వసుందరికి బీటౌన్‌లో అవకాశాలకు కొదవ ఉండదని చాలామంది చెబుతుంటారు. ఈమె సరైన ఆఫర్లను దక్కించుకోలేపోతోంది.

ఈ క్రమంలో విశ్వసుందరిపై రకరకాల గాసిప్స్ హంగామా చేస్తున్నా, ఆవేమీ పట్టించుకోలేదు. గ్లామర్ ఇండస్ట్రీలో అవన్నీ సహజమేనని లైట్‌గా తీసుకుంటోంది.. దటీజ్ మానుషి చిల్లర్.
