BigTV English

Animals Act – India: మీకు తెలుసా? ఇండియాలో కోడిని చంపడం నేరం.. ఏ శిక్ష విధిస్తారంటే?

Animals Act – India: మీకు తెలుసా? ఇండియాలో కోడిని చంపడం నేరం.. ఏ శిక్ష విధిస్తారంటే?

ఇంటికి బంధువులు వచ్చినా, పండుగలు, పబ్బాలు అయినా, మిత్రులతో కలిసి పార్టీ చేసుకోవాలనుకున్నా కామన్ గా చేసే పని కోడిని కోయడం. పెళ్లిళ్లు సహా పెద్ద పెద్ద వేడుకలు చేస్తే మేకపోతులను కోస్తారు. నిజానికి కోడి, మేకను కోయడం భారతీయ చట్టాల ప్రకారం నేరం. జంతవుల పట్ల క్రూరత్వ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి, శిక్ష విధించే అవకాశం ఉంటుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అక్రమ వధ అనేది దేశంలో నేరంగా పరిగణిస్తారు. మరి చికెన్, మటన్ సహా ఇతర మాంసాహార దుకాణాల పరిస్థితి ఏంటి? అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతుంది. అయితే, చట్టంలో వాటికి కూడా ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం ఏం చెప్తుందంటే?

జంతువుల పట్ల హింసను ఇంకా చెప్పాలంటే అవనసరమైన బాధను నివారించేందుకు సహేతుకమైన చర్యలు తీసుకోవాలని ఈ చట్టం వివరిస్తున్నది. కానీ, చికెన్, మటన్ సెంటర్లలో నిత్యం కోళ్లు, మేకలను చంపేస్తున్నారు కదా?  వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అనే ప్రశ్నలు తలెత్తుతాయి. అయితే, వాటికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. చికెన్, మటన్ దుకాణాల యజమానులు కచ్చితంగా లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ లైసెన్స్ లేకుండా ఆ దుకాణాలు నిర్వహించడం చట్ట ప్రకారం నేరమే అవుతుంది. అంతేకాదు, వధశాలలో కోళ్లు, మేకల బాధను తగ్గించడానికి సరైన విధానాలు పాటించాలి. ఎవరు పడితే వాళ్లు కోళ్లను మేకలను  కోస్తే, భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 428, 429 జంతువుల పట్ల క్రూరత్వ చర్యలకు శిక్షలను విధించే అవకాశం ఉంటుంది.


బ్రిటీష్ పాలన నుంచే దేశంలో జంతు సంరక్షణ చట్టాలు

వాస్తవానికి భారత్ బ్రిటిష్ పాలనలో ఉన్నప్పటి నుంచే జంతు సంరక్షణకు చట్టాలు చేశారు. 1876లో జంతుహింస నిరోధక చట్టాని చేశారు ఆంగ్లేయులు. 1945లో చేసిన డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ చట్టంలో కూడా జంతువులపై హింసను నిరోధించే నిబంధనలు చేర్చారు. ఇక 1960లో భారత ప్రభుత్వం అత్యంత కఠినమైన చట్టం చేసింది. పీసీఏ చట్టం ప్రకారం  జంతువులు, వన్యప్రాణులను హింసించడం, చంపడం నేరం. ఈ చట్టం ఆధారంగా దేశంలో జంతు సంరక్షణ బోర్డును కూడా ఏర్పాటు చేశారు. జంతువులపై సౌందర్యసాధనాలను పరీక్షించడాన్ని 2014లో నిషేధించారు. ఈ రకమైన చట్టం చేసిన తొలి దేశంగా భారత్ గుర్తింపు తెచ్చుకున్నది.

జంతుహింస నిరోధక చట్టం ఏం చెప్తుందంటే? 

భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 428, 429 ప్రకారం జంతువులను చంపటం, హింసించటం శిక్షార్హమైన నేరం. కోళ్లతోసహా ఏ జంవుతునైనా వధశాలలో కాకుండా బహిరంగ ప్రదేశాల్లో చంపకూడదు. కబేలా రూల్స్ 2001లోని రూల్ 3 ప్రకారం దేశంలో జంతువధ నిషేధం. సెక్షన్ 11(1)(ఎం)(2), (ఎన్) ప్రకారం జంతువుల మధ్య ఎలాంటి పందేలు, కొట్లాట కార్యక్రమాలు నిర్వహించరాదు. అలా చేయటం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. మూడు నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. దేశంలోని ప్రతిపౌరుడు అన్ని ప్రాణుల పట్ల జాలి, దయాగుణం కలిగి ఉండటం ప్రాథమిక విధి అంటున్నది భారత రాజ్యాంగం.

Read Also: తండ్రి శవం రెండు ముక్కలు.. వీళ్లెక్కడి కొడుకులండి బాబు!

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×