తల్లిదండ్రులు బతికి ఉన్నప్పుడే కాదు, చనిపోయిన తర్వాత కూడా ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు కొంతమంది సుపుత్రులు. తాజాగా తండ్రికి అంత్యక్రియలు నిర్వహించే విషయంలో అన్నదమ్ములు గొడవపడి ఏకంగా మృతదేహాన్ని రెండు ముక్కలు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సర్దుమణిగింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
తండ్రి అంత్యక్రియల కోసం అన్నదమ్ముల గొడవ
మధ్యప్రదేశ్ లోని తికమ్ గఢ్ జిల్లా లిధోరాతాల్ కు చెందిన 85 ఏళ్ల ధ్యానీ సింగ్ ఘోష్ చనిపోయారు. అనారోగ్యం, వయో సంబంధ సమస్యలతో కన్నుమూశారు. అయితే, ఆయన బతికి ఉన్నంత కాలంగా జాగ్రత్తగా చూసుకున్నపెద్ద కొడుకు దామోదర్ సింగ్ దహన సంస్కారాలు చేసేందుకు సిద్ధం అయ్యాడు. అదే సమయంలో సమీపంలోని పట్టణంలో ఉంటున్న, ఆయన తమ్ముడు కిషన్ సింగ్ తండ్రి మృతి విషయం తెలిసి కుటుంబంతో కలిసి ఊరికి వచ్చాడు. తానే అంత్యక్రియులు నిర్వహిస్తానని పట్టుబట్టాడు. ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది.
మృతదేహాన్ని రెండు ముక్కులు చేయాన్న తమ్ముడు
తన తండ్రి బతికి ఉన్నప్పుడు తాను జాగ్రత్తగా చూసుకున్నానని, అనారోగ్యం బారినపడితే దగ్గరుండి వైద్యం చేయించానని పెద్ద కొడుకు దామోదర్ సింగ్ చెప్పాడు. ఆయన చనిపోయిన తర్వాత, చితికి తలకొరివి పెట్టే బాధ్యత కూడా తనదే అవుతుందన్నాడు. అటు తమ్ముడు కిషన్ సింగ్ అన్న మాటలను లెక్క చేయలేదు. తానే తండ్రి అంత్యక్రియాలు చేస్తానని పట్టుబట్టాడు. లేదంటే తండ్రి డెడ్ బాడీని రెండు ముక్కులు చేసి, చెరో ముక్కకు అంత్యక్రియలు జరుపుకుందామని చెప్పాడు. ఆయన మాట విని ఊళ్లో వాళ్లంతా నిప్పుడు చెరిగారు. తండ్రి మృతదేహాన్ని ముక్కలు చేయడం ఏంటంటూ మండిపడ్డారు. గ్రామస్తులు ఎంత చెప్పినా చిన్న కొడుకు కిషన్ వినకపోవడంతో బంధువులు జోక్యం చేసుకున్నారు. అయినా కిషన్ తగ్గేదే లేదన్నాడు.
5 గంటల పాటు కొనసాగిన హైడ్రామా
తండ్రి మృతదేహానికి తాను అంత్యక్రియలు చేస్తానంటే.. తాను చేస్తానంటూ ఇద్దరు అన్నదమ్ములు చాలాసేపు గొడవపడ్డారు. దాదాపు 5 గంటల పాటు ఈ వివాదం అలాగే కొనసాగింది. చివరకు ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసలు స్పాట్ కు చేరుకున్నారు. కిషన్ కు నచ్చజెప్పారు. దీంతో అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాసేపటికి మనసు మార్చుకున్న కిషన్ కుటుంబంతో కలిసి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. బతికుండగా తండ్రిని చూసుకున్న దామోదర్.. చివరకు అతడి చితికి నిప్పు అంటించాడు. అక్కడితో వివాదం ముగిసిపోయింది.
Read Also: మహిళ రైల్వే ట్రాక్ దాటుతుంటగా దూసుకొచ్చిన రైలు.. ఒక్కసారిగా షాక్..
కిషన్ మద్యం మత్తులో వివాదానికి కారణం అయ్యాడని పోలీసులు చెప్పారు. తండ్రి బతికి ఉన్నప్పుడు పట్టించుకోని కొడుకు ఇప్పుడు అత్యంక్రియలు నిర్వహిస్తానని చెప్పడం గ్రామస్తులకు సైతం నచ్చలేదన్నారు. అందుకే, గ్రామస్తులు తమకు సమాచారం అందించారని వెల్లడించారు. చిన్న కుమారుడికి సముదాయించి పెద్ద కుమారుడి చేత తండ్రికి దహన సంస్కారాలు నిర్వహించామని పోలీసులు తెలిపారు.
Read Also: రైల్లో మహిళపై అత్యాచారం, బాబోయ్.. మరీ ఇంత దారుణమా?