BigTV English

Pakistan Beggar: రూ.కోటి ఖర్చుతో పార్టీ ఇచ్చిన పాకిస్తాన్ బిచ్చగాడు.. 20 వేల మందికి మటన్, చికెన్‌తో భారీ విందు

Pakistan Beggar: రూ.కోటి ఖర్చుతో పార్టీ ఇచ్చిన పాకిస్తాన్ బిచ్చగాడు.. 20 వేల మందికి మటన్, చికెన్‌తో భారీ విందు

Pakistan Beggar| ‘బండ్లు ఓడలైతాయి. ఓడలు బండ్లవుతాయి.’ అని పెద్దలు సామెత చెబుతూ ఉంటారు. ఆ సామెత ఇప్పుడు పాకిస్తాన్‌లో ఒక బిచ్చగాడిని చూస్తే.. నిజమేననిపిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ దేశమంతా ప్రజలు నిత్యాసరాల ధరలు పెరిగిపోయి.. సంపాదన లేక ఇబ్బందిపడుతున్నారు. చాలామందికి పేదలకు, మధ్య తరగతి వారికి ఆహారం లభించని పరిస్థితి. ఈ కష్టకాలంలో ఒక బిచగాళ్ల కుటుంబం భారీ దావత్ చేసింది. ఈ పార్టీకి ఏకంగా 20000 మందిని ఆహ్వానించింది. ఇంతమందికి ఎన్నో రుచికరమైన వంటలు వడ్డించడానికి ఏకంగా రూ.1 కోటి 25 లక్షలు ఖర్చు అయింది.


వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రం గుజ్రాన్ వాలా నగరానికి చెందిన ఒక బిచ్చగాళ్ల కుటుంబ సభ్యులు తమ నానమ్మ చనిపోయిందని.. ఆమె తద్దినం (40 రోజులు) కర్మకు భారీ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు తమ ప్రాంతంలో నివసించే అందరూ రావాలని బహిరంగంగా ఆహ్వానం పలికారు.

గుజ్రాన్ వాలా నగరంలోని రహ్వాలీ రైల్వే స్టేషన్ వద్ద ఒక మైదానంలో జరిగిన ఈ భారీ విందులో ఎన్నో రకాల వంటలు వడ్డించారు. వెజ్, నాన్ వెజ్, కర్రీలు, బిర్యానీలు, హలీం, స్వీట్లు వంటి అన్ని నోరూరుంచే వంటకాలు అతిథులు ఆనందంలో ఆరగించారు. పేరుకే తద్దినం భోజనం కానీ.. అతిథులు మాత్రం ఇలాంటి విందులు అందరూ ఇస్తే బాగుండని ఎంజాయ్ చేస్తూ ఆరగించారు.


Also Read: 10 మంది పిల్లల తండ్రితో ప్రేమవివాహం.. ప్రాణహాని ఉందని కోర్టుకెళితే జడ్జి ఫైర్

20000 మంది భారీ జనం రావడంతో వండిన వంటలు సరిపోక మళ్లీ అప్పుడే వంటకాలు చేసారట. ప్రతి ఒక్కరూ తినే వెళ్లాలని ఎవరికీ ఆహార కొరత రానివ్వకుండా ఆతిథ్యం ఇచ్చారట. దాదాపు 250 మేకలు, ఎద్దులు (పాకిస్తన్ లో సాధారణంగా), 2000 కోళ్లు విందు కార్యక్రమం కోసం కోయడం జరిగింది. మటన్ త్వరగా అయిపోవడంతో నాన్, పాయా, తల కూర కూడా రెడీ చేయించారట.

ఈ విందు గురించి టీవి చానెళ్లలో చెప్పకపోయినా సోషల్ మీడియాలో పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి. నెటిజెన్లు ఒక బిచ్చగాడు ఇంత ఖర్చు ఎలా చేశాడని ఆశ్చర్యపోతూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే బిచ్చగాడు ఇంత ఎలా సంపాదించాడు. అని అనుమానం వ్యక్తం చేస్తుంటే. మరి కొంతమంది.. “వారి నానమ్మ పట్ల ఎంత ప్రేమ ఉందో? ఆమె తప్పకుండా గ్రేట్!” అని భావోద్వేగంగా కామెంట్లు చేస్తున్నారు.

ఏదేమైనా పాకిస్తన్ ప్రజలు పస్తులుగా ఉంటే చూస్తూ ఉన్న ప్రభుత్వం కన్నా.. ఇలాంటి పెద్ద మనసు ఉన్న బిచ్చగాళ్లు నయం అనిపిస్తుంది.

Related News

Python Video: అమ్మ బాబోయ్..! భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది.. వీడియో చూస్తే..?

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Big Stories

×