ఈసారి తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ గా కన్నడ సీరియల్ నటుడు నిఖిల్ నిలవబోతున్నాడు అంటూ అందరూ దాదాపు ఫిక్స్ అయిపోయారు. కానీ చివరి క్షణాల్లో ఈ అంచనాలు తప్పేలా కనిపిస్తున్నాయి. దీనికి కారణం మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ చేసిన పని అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఎప్పుడు కూడా ఓటింగ్లో టాప్ లో కొనసాగుతూ.. టైటిల్ ఫేవరెట్ గా నిలిచిన నిఖిల్, ఒక్కసారిగా డేంజర్ జోన్ లో పడ్డారు. మరి అసలు ఏమైందో ఇప్పుడు చూద్దాం.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 చివరి దశకు చేరుకుంది.మరో రెండు మూడు వారాలు మాత్రమే ఈ సీజన్ సాగుతుంది. ప్రస్తుతం హౌస్ లో 10 మంది కంటెస్టెంట్స్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. 11వ వారం ఫ్యామిలీ వీక్ కావడంతో ఎవరిని ఎలిమినేట్ చేయలేదు. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని, దాదాపు అందరూ ఫిక్స్ అయ్యారు. ఇకపోతే హౌస్ లో గౌతమ్, నిఖిల్, నబీల్,పృథ్వి, టేస్టీ తేజ, అవినాష్, ప్రేరణ, యష్మీ , రోహిణి, విష్ణుప్రియ మాత్రమే ఉన్నారు. ఇక 12వ వారం నామినేషన్ లో భాగంగా బిగ్ బాస్ తెలుగు 8 లో ఎక్స్ కంటెస్టెంట్స్ తో ఎప్పుడు లేని విధంగా 12వ వారం నామినేషన్స్ నిర్వహించారు. దీంతో ఎక్స్ హౌస్ మేట్స్ అందరూ కూడా కన్నడ బ్యాచ్ ను టార్గెట్ చేస్తూ నామినేట్ చేశారు. ప్రస్తుతం 12 వ వారం నామినేషన్ లో నిఖిల్, ప్రేరణ, పృథ్వీ, నబీల్ మాత్రమే ఉన్నారు. దీనికి తోడు నామినేషన్స్ లో భాగంగా సీత హౌస్ లోకి వచ్చి.. యష్మీ ను వాడుకొని , ఆమె గేమ్ ను పాడు చేస్తున్నావు అంటూ నిఖిల్ తో తెలిపింది. దీంతో హర్ట్ అయిన నిఖిల్.. ఆడియన్స్ నాకు ఓటు వేయకండి.. నన్ను ఎలిమినేట్ చేయండి అంటూ బాధపడ్డాడు. తర్వాత మళ్ళీ కెమెరా ముందుకు వచ్చి, దయచేసి నాకు ఓటు వేయండి. ఓడిన చోటే గెలిచి తీరుతాను. కప్పు కొట్టే బయటికి వెళ్తాను అంటూ తెలిపారు. దీంతో నిఖిల్ పై పలు రకాల కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.
ఇకపోతే ఎక్స్ హౌస్ మేట్స్ వేసిన దెబ్బ నిఖిల్ పై భారీగానే పడిందని చెప్పవచ్చు. ఇక తాజాగా ఓటింగ్ చూసుకున్నట్లయితే.. ప్రేరణ మొదటి స్థానంలో నిలిచింది. 21.4% ఓటింగ్ నమోదయింది. ఇక ఎప్పటిలాగే యష్మి రెండవ స్థానంలో కొనసాగుతోంది. 20.9% ఓటింగ్ నమోదయింది. ఇక మూడో స్థానంలో నబీల్ ఉండగా, నాలుగవ స్థానంలో నిఖిల్, ఐదవ స్థానంలో పృథ్వీ ఉన్నారు. మొత్తానికైతే బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరూ డేంజర్ జోన్ లో పడ్డారని చెప్పవచ్చు. అయితే ఇవి అధికారిక వోట్స్ కాకపోయినా.. అధికారికంగా పోలయ్యే ఓట్లను దాదాపుగా బయటపెట్టరు. కాబట్టి అనధికారిక ఓట్ల ప్రకారమే ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరు అనేది దాదాపు అంచనా వేస్తారు. ఇకపోతే నిన్నటి వరకు యష్మినే ఎలిమినేట్ అవుతుంది అనుకున్నారు కానీ అనూహ్యంగా ఆమె దూసుకొచ్చేసింది. ఇక ఇప్పుడు డేంజర్ జోన్ లో పడ్డ పృథ్వీ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.