Father of 10 Second Marriage| సమాజంలో కొందరు ఒక భార్యతో సంతృప్తి చెందక రెండు మూడు వివాహాలు చేసుకుంటూ ఉంటారు. చట్టప్రకారం నేరమని తెలిసినా.. దొంగచాటుగా ప్రేమ వ్యవహారం నడిపిస్తుంటారు. అలా ఒక వ్యక్తి తన కంటే 20 ఏళ్లు చిన్న వయసుగల యువతిని ప్రేమించి.. ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత ఇరు కుటుంబాల నుంచి ప్రాణ హాని ఉందని కోర్టు కెళితే.. న్యాయమూర్తికి అనుమానం వచ్చి విషయం ఆరా తీశారు. పూర్తి నిజం తెలిశాక యువకుడికే రూ.1 లక్ష జరిమానా విధించి హెచ్చరించారు. ఈ ఘటన హర్యాణా రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. హర్యాణా రాష్ట్రంలోని నూహ్ జిల్లాకు చెందిన బాబర్ అనే 40 ఏళ్ల యువకుడు మెకానిక్ పనిచేస్తున్నాడు. అతనికి భార్య, పది మంది పిల్లలున్నారు. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల రిజ్వానా అనే యువతితో బాబర్ కు పరిచయం ఏర్పడింది. బాబర్ పనిచేసే మెకానిక్ షాపుకి రిజ్వానా తన స్కూటీ రిపేరు చేసుకునే దానికి వచ్చేది. అలా వారిద్దరి మధ్య ఉన్న పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్నారు.
Also Read: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!
పది మంది పిల్లల తండ్రి అని తెలిసినా బాబర్ ను పెళ్లాడడానికి రిజ్వానా సిద్ధమైంది. అయితే వారిద్దరూ దొంగచాటు నికా (పెళ్లి) చేసుకున్నారు. ఆ తరువాత ఈ విషయం రిజ్వానా ఇంట్లో ఈ విషయం తెలిసిపోయింది. రిజ్వానా కుటుంబసభ్యులు, బాబర్ ను చంపేందుకు ప్రయత్నిస్తుండగా.. ఇద్దరు ఇంటి నుంచి పారిపోయి రాజధాని చండీగడ్ చేరుకున్నారు. అక్కడ ఒక లాయర్ ని కలిసి తమకు భద్రత కల్పించేందుకు కోర్టులో పిటీషన్ వేశారు. పిటీషన్ లో ప్రేమవివాహం చేసుకోవడంతో కుటుంబసభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. అయితే వారి పిటీషన్ విచారణ చేసిన న్యాయమూర్తి.. ఇద్దరి ఆధార్ కార్డులు పరిశీలించి యువతి ఆధార్ కార్డు కాపీ స్పష్టంగా లేదని.. అందులో ఆమె ముఖం సరిగా లేదని గుర్తించారు. ఆ తరువాత బాబర్ వయసులో రిజ్వానా కంటే చాల పెద్దవానిగా కనిపించడంతో వారి గురించి ఆరా తీయమని పోలీసులకు ఆదేశించారు.
పోలీసులు నూహ్ జిల్లాలో బాబర్ గురించి ఆరా తీయగా.. అతనికి ఇంతకుముందే పెళ్లి జరిగిందని.. మొదటి భార్య వల్ల 10 మంది పిల్లలు కూడా పుట్టారని తెలిసింది. పైగా రిజ్వానా.. వయసులో బాబర్ కంటే 20 ఏళ్లు చిన్నది అని తెలిసింది. ఈ వివరాలన్నీ కోర్టుకు పోలీసులు అందజేశారు. పైగా బాబర్ మొదటి భార్య బంధువులు రిజ్వానాని హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. బాబర్ పిటీషన్ విచారణ చేసిన న్యాయమూర్తి.. అతను రెండు భార్యలను ఎలా పోషిస్తాడని అడిగారు.
Also Read: విమాన ప్రయాణంలో ప్రైవేట్ పార్ట్స్ కాలిపోయాయి.. ఎయిర్‌లైన్స్‌పై కేసు పెట్టిన ప్రయాణికుడు!
దీంతో బాబర్ కు 45 ఎకరాల భూమి, నెలకు 55000 సంపాదన ఉందని అతని లాయర్ సమాధానం ఇచ్చారు. అయినా న్యాయమూర్తి బాబార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులో పిటీషన్ దాఖలు చేసిన సమయంలో అతని మొదటి వివాహం గురించి, 10 పిల్లల గురించి, రిజ్వానా వయసు గురించి వివరాలు దాచిపెట్టనందుకు బాబర్ పై రూ.1 లక్ష జరిమానా విధించారు. అయితే ఇస్లాం మత ప్రకారం.. ఇద్దరి వివాహానికి చట్టపరంగా అనుమతి ఉండడంతో రిజ్వానాకు భద్రత కల్పించాలని పోలీసులకు ఆదేశించారు.