BigTV English

Viral Video: బాబోయ్.. ఇంత పెద్ద రుమాల్ రోటినా, తినడానికా, చలికి కప్పుకోవడానికా నాయనా?

Viral Video: బాబోయ్.. ఇంత పెద్ద రుమాల్ రోటినా, తినడానికా, చలికి కప్పుకోవడానికా నాయనా?

రుమాల్ రోటీ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. రెస్టారెంట్లకు, దాబాలకు వెళ్లినప్పుడు పెద్ద పెంక మీద వీటిని కాల్చుతుంటారు. చాలా మంది పాయాలో అద్దుకుని తినేందుకు ఇష్టపడుతుంటారు. రుమాల్ రోటీ అంటే, రుమాల్ మాదిరిగానే మూడు నాలుగు ఫీట్ల పొడవు ఉండేలా తయారు చేస్తుంటారు. కానీ, ఓ యువకుడు ఏకంగా 12 అడుగు రుమాల్ రోటీలు చేసే వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

తాజాగా పాకిస్తాన్ కు చెందిన ఫుడ్ వ్లాగర్ సోహైబ్ ఉల్లా యూసఫ్‌ జాయ్ ఈ వీడియోను తన ఇన్ స్టా వేదికగా షేర్ చేశారు.  “ప్రపంచంలోనే అతిపెద్ద రోటీ. 12 అడుగుల పొడవు” అంటూ ఈ వీడియోను పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో ఫుడ్ లవర్స్ తో పాటు నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. ఇప్పటి వరకు ఈ వీడియో 133 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఈ వీడియోలో ఓ వ్యక్తి పెద్ద పిండి ముద్దను తీసుకుని చేతుల ద్వారా పెద్దగా సాగేలా చేస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 12 అడుగుల పొడవు తయారు చేసి నిప్పులు పెంక మీదకి విసురుతూ కనిపించాడు. రొట్టెలు చాలా పెద్ద ఉండటంతో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఓ వేడుకలో భాగంగా వంటలు వంటలు చేస్తుండగా, ఈ రుమాల్ రోటీలను కూడా తయారు చేశారు. ప్రస్తుతం ఈ వీడియోపై సోషల్ మీడియాలో ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు.


Read Also: బబుల్ ర్యాప్ తో విచిత్రమైన దుస్తులు, ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

 సోషల్ మీడియాలో నెటిజన్ల ట్రోలింగ్

ఇక ఆ వ్యక్తి రుమాల్ రోటీలు బాగానే తయారు చేస్తున్నప్పటికీ, పరిసరాలు ఏమాత్రం శుభ్రంగా లేకపోవడం పట్ల నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. పైగా తయారు చేసే వ్యక్తి కూడా ఏమాత్రం శుభ్రత పాటించకపోవడంపై విమర్శలు చేస్తున్నారు. “అతడు తయారు చేసే రుమాల్ రోటీ తన కాళ్లు, చేతులూ , ముక్కు, జుట్టును తాకడాన్ని నేను ఇష్టపడుతున్నాడు. ఆ రోటికి అదే నిజమైన రుచి” అంటూ ఓ నెటిజన్ వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. “ఈ రోటీని చేతులతో పాటు కాళ్లతోనూ తయారు చేయడం బాగుంది” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “వామ్మో అవి రోటీలా? నేను వాటిని దుప్పట్లు అనుకున్నాను” అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు “హలో వెయిటర్, ఏక్ రోటీ, 10 ప్లేట్స్ కర్రీ ప్లీస్” అని ఇంకొకరు రాశారు.  మొత్తంగా చాలా మంది నెటిజన్లు ఈ పెద్ద రుమాల్ రోటీలను చూసి నవ్వుతుండగా, మరికొంత మంది తయారు చేస్తున్న వ్యక్తి టాలెంట్ ను మెచ్చుకుంటున్నారు. ఇంకొంత మంది నీట్ నెస్ లేదని విమర్శిస్తున్నారు. మొత్తంగా ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by YoUzEECreator (@youcreatorzee)

Read Also: గర్భవతి అని తెలిసిన 4 గంటల్లోనే బిడ్డకు జననం, అలా ఎలా?

Related News

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Big Stories

×