Jr NTR : సెలబ్రిటీలు సినిమా సినిమాకి మధ్య దొరికే కాస్త గ్యాప్ లోనే అలా ఊపిరి పీల్చుకోవాలి అనుకుంటారు. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రాత్రి పగలు తేడా లేకుండా సినిమా షూటింగ్ లలో పాల్గొనే స్టార్స్, మూవీ షూటింగ్ పూరవ్వడం, రిలీజ్ కావడం అయిపోతే చిన్న బ్రేక్ తీసుకోవడం సహజం. కానీ అది వాళ్ళు ఉన్న ఏరియాలో, లేదంటే పాపులర్ అయిన ప్లేస్ లో సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి అలా విదేశాలకు వెళ్తారు. అందుకే తరచుగా మన స్టార్స్ అందరూ ఫ్యామిలీతో సహా విదేశాలకు వెకేషన్ లకు వెళ్ళిపోతూ ఉంటారు. తాజాగా ఓ విదేశీ ఇన్ఫ్లుయెన్సర్ విదేశాల్లో మన యంగ్ టైగర్ (Jr NTR) ని తన వీడియోలో బంధించి, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
స్కాట్లాండ్ లో తారక్…
ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ వెకేషన్ కోసం వెళ్లొచ్చారు ఎన్టీఆర్. అయితే అప్పుడు ఎన్టీఆర్ (Jr NTR) విదేశాలకు వెళ్లిన, తిరిగి వచ్చిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఆయన ‘వార్ 2’ సినిమా షూటింగ్ లో మళ్లీ పాల్గొంటారు అనే వార్తలు వినిపించాయి. కానీ అంతలోనే తాజాగా ఓ స్కాట్లాండ్ ఇన్ఫ్లుయెన్సర్, ట్రావెల్ బ్లాగర్ ఎడిన్‌బర్గ్ మార్కెట్ అందాలను చూపించే క్రమంలో అనుకోకుండా జూనియర్ ఎన్టీఆర్ ని తన వీడియోలో క్యాప్చర్ చేశాడు. అయితే అతనికి కూడా ఇది సర్ప్రైజంగానే అనిపించిందేమో… ఆ వీడియోను పోస్ట్ చేసి తాను అర్థం చేసుకోవడానికి కాస్త టైం తీసుకున్నట్టు వెల్లడించారు. “వెయిట్…. నేను ఎడిన్‌బర్గ్ క్రిస్మస్ మార్కెట్లో భారతీయ సినీ ప్రముఖుడిని పట్టేసినట్టున్నాను” అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.
అంతేకాకుండా అతను క్యాప్షన్ లో “జూనియర్ ఎన్టీఆర్ ఇండియన్ సినిమాలో డైనమిక్ ఫోర్స్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ట్రూ ఐకాన్. ఆర్ఆర్ఆర్, అరవింద సమేత లాంటి రీసెంట్ బ్లాక్ బస్టర్ సినిమాలలో అద్భుతంగా నటించాడు. అతని పవర్ ఫుల్ యాక్టింగ్, ఎలక్ట్రిఫైయింగ్ డాన్స్ మూమెంట్స్ తో పాపులర్ అయిన ఈ స్టార్ హీరో తెలుగు సినిమాని కొత్త శిఖరాలకు తీసుకువెళ్లే గ్లోబల్ స్టార్” అంటూ ఆ వీడియోని పోస్ట్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఎన్టీఆర్ ఎప్పుడు స్కాట్లాండ్ కి వెళ్ళాడు అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. కానీ ఈ వీడియోలో మీరు ఎన్టీఆర్ ను ఒక్కసారి చూస్తే మాత్రం అస్సలు పట్టేయలేరు. కాబట్టి రెండు మూడు సార్లు చూడాల్సిందే.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">
నెక్స్ట్ ఎన్టీఆర్ – నీల్ మూవీనే…
ప్రస్తుతం ‘వార్ 2’ (War 2) అనే తన ఫస్ట్ హిందీ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. జనవరి ఎండింగ్ లోనే ఆ మూవీ షూటింగ్ పూర్తి చేసి, కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తో తన నెక్స్ట్ మూవీ ‘డ్రాగన్’ని మొదలు పెట్టబోతున్నాడు. ప్రస్తుతం నీల్ ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.