బెలారస్ కు చెందిన ZNWR డిజైనర్ బ్రాండ్ ప్రపంచ వ్యాప్తంగా బాగా ఫేమస్. ఈ సంస్థ చిత్ర విచిత్రమైన దుస్తులను డిజైన్ చేస్తుంది. తాజాగా బబుల్ ర్యాప్ అనే విచిత్రమైన దుస్తులను రూపొందించింది. అంతేకాదు, దీని ధర ఏకంగా 90 అమెరికన్ డాలర్లుగా నిర్ణయించడంతో జనాలు అవాక్కవుతున్నారు. ప్రస్తుతం ఈ వింతైన దుస్తులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
న్యూ ఇయర్ కోసం తయారీ
ఈ బెలారసియన్ డిజైనర్ బ్రాండ్ పూర్తిగా బబుల్ ర్యాప్‌తో తయారు చేసిన దుస్తులు, జాకెట్ వైరల్ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ఈ దుస్తులకు సదరు కంపెనీ ‘బాలెన్సియాగా ఆఫ్ బెలారస్’ అని పేరు పెట్టింది. ఈ వింతైన దుస్తులను సోషల్ మీడియా వేదిగా ప్రచారం చేస్తున్నది. వాస్తవానికి ఈ దుస్తులను న్యూ ఇయర్ కోసం రూపొందించింది. అయితే, కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టినా ఈ దుస్తులు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ‘తక్కువగా ఉంటే ఎక్కవ’ అనే కానెస్ట్ తో ఈ సంస్థ దుస్తులను డిజైన్ చేస్తుంది.
వింత దుస్తుల ధర ఎంతో తెలుసా?
తాజాగా తయారు చేసిన బబుల్ ర్యాప్ దుస్తులను ఇద్దరు మోడల్స్ ధరించి స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడుతూ కనిపించారు. ఈ డియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. పాదర్శకతకు ఈ దుస్తులు నిదర్శనం అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ వింత దుస్తుల ధరను సదరు కంపెనీ 280 బెలారసియన్ రూబిళ్లు అంటే 90 అమెరికన్ డాలర్లుగా నిర్ణయించింది. భారత కరెన్సీలో ఈ ధర సుమారు రూ. 7 వేలుగా నిర్ణయించింది. పూర్తిగా పాలిథిన్ తో తయారు చేసిన ఈ దుస్తులు వేడి వాతావరణానికి సరిపోవని ZNWR వెల్లడించింది. ఈ దుస్తులను శుభ్రం చేయడం చాలా ఈజీ అని చెప్పుకొచ్చింది.
చెత్తతో పౌచ్.. టేప్ తో బ్రాస్ లెట్
రీసెంట్ గా ZNWR స్టోర్ లో ఓ మహిళ ఈ దుస్తులను గుర్తించి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన తర్వాత బాగా వైరల్ అయ్యాయి. ఇవి నిజంగా అమ్మకానికి ఉన్నట్లు దుస్తుల మీద జిప్పర్ ను కూడా చూపించింది. ZNWR కంపెనీ వింతైన డిజైన్లకు ప్రసిద్ధి చెందినది. గతంతో చెత్తతో తయారు చేసిన పౌచ్ ను 1,800 డాలర్లు, టేప్ తో తయారు చేసిన బ్రాస్ లెట్ ను 3,300 డాలర్లకు అమ్మి ఆశ్చర్యపరిచింది.
సోషల్ మీడియాలో ట్రోలింగ్
ఇక ఈ తాజాగా దుస్తులపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్స్ వస్తున్నాయి. “ఈ బబుల్స్ ని పాప్ చేయడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “ప్రయణీకులతో కిక్కిరిసిన బస్సులోకి ఈ దుస్తులు వేసుకుని వెళ్లకండి. లేదంటే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది” అని మరో నెటిజన్ల ఫన్నీగా కామెంట్ పెట్టాడు. “వింటర్ కోసం స్టైరోఫోమ్ తో తయారు చేసిన దుస్తులను ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు?” అని మరో నెటిజన్ల్ ప్రశ్నించాడు. “ఆహా.. ఈ దుస్తులు వేసుకుని నడుస్తుంటే, ఆ ఊహే చాలా అందంగా ఉంది” అంటూ మరో వ్యక్తి చమత్కరించాడు.
Read Also: గర్భవతి అని తెలిసిన 4 గంటల్లోనే బిడ్డకు జననం, అలా ఎలా?